ప్రధాన మంత్రి కార్యాలయం
కాకతీయ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో ప్రకటించిన సందర్భం లో సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
25 JUL 2021 6:24PM by PIB Hyderabad
కాకతీయ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో ప్రకటించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవ్యమైనటువంటి ఆ దేవాలయ సముదాయాన్ని సందర్శించి, ఆ దేవాలయం గొప్పదనాన్ని గురించి మౌలికం గా అనుభవాన్ని పొందవలసింది గా ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు కూడా.
యునెస్కో చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ ఇలా అన్నారు:
‘‘దివ్యం గా ఉంది! ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి తెలంగాణ ప్రజల కు, ఇవే అభినందన లు.
ప్రతిమాత్మకమైనటువంటి రామప్ప దేవాలయం మహా కాకతీయ రాజ వంశం యొక్క విశిష్ట శిల్పకళ వైభవాన్ని కళ్లకు కడుతున్నది. ఆ ఠీవి గల దేవాలయ సముదాయాన్ని మీరంతా సందర్శించాలని, ఆ ఆలయ మహత్వాన్ని గురించి మౌలిక అనుభవాన్ని పొందవలసిందని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ’’
***
***
(Release ID: 1738872)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam