ప్రధాన మంత్రి కార్యాలయం

శివ‌గిరి మ‌ఠం పూర్వ అధిప‌తి స్వామి ప్ర‌కాశానంద జీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 07 JUL 2021 3:38PM by PIB Hyderabad

శివ‌గిరి మ‌ఠం పూర్వ అధిప‌తి స్వామి ప్ర‌కాశానంద జీ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.


‘‘ స్వామి ప్ర‌కాశానంద జీ ఒక జ్ఞాన జ్యోతి.  అంతేకాదు, ఆధ్యాత్మిక జ్యోతి కూడాను.  ఆయ‌న నిస్వార్థ సేవా కార్యాలు నిరుపేద‌ల కు సాధికారిత ను క‌ల్పించాయి.  శ్రీ నారాయ‌ణ గురు ప‌విత్ర ఆశ‌యాల కు లోక‌ప్రియ‌త్వాన్ని సాధించి పెట్ట‌డం లో స్వామి ప్ర‌కాశానంద జీ అగ్ర‌గామి గా నిలచారు.  స్వామి ప్ర‌కాశానంద జీ మ‌ర‌ణం తో నేను ఎంతో వేదన కు లోనయ్యాను.  ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1733368) Visitor Counter : 167