ప్రధాన మంత్రి కార్యాలయం

భార‌తీయ డాక్ట‌ర్ ఒక‌రి తో అఫ్‌ గానిస్తాన్ రాయ‌బారి కి ఎదురైన అనుభవాన్ని గురించి ఒక ట్వీట్ లో వివ‌రించిన ప్ర‌ధాన మంత్రి


మీ అనుభ‌వం లో భార‌త‌దేశం-అఫ్‌ గానిస్తాన్ సంబంధాల సువాస‌న తాలూకు సారం ఉంది: ప్ర‌ధాన మంత్రి

Posted On: 01 JUL 2021 5:06PM by PIB Hyderabad

భారతదేశం లో అఫ్‌ గానిస్తాన్ రాయ‌బారి శ్రీ ఫరీద్ మామున్‌జ‌య్‌ ట్వీట్ పై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఒక వ్యాఖ్య ను చేశారు. భార‌త‌దేశం లో ఒక డాక్ట‌ర్ వ‌ద్ద కు అఫ్‌గాన్ రాయ‌బారి వెళ్ళిన‌ప్పుడు ఆ వైద్యుడు తన రోగి భార‌త‌దేశం లో అఫ్‌గాన్ రాయ‌బారి అనే సంగ‌తి ని తెలుసుకొని ఒక సోద‌రుని వ‌ద్ద నుంచి తాను రుసుము ను వ‌సూలు చేయ‌నని చెప్తూ ఎలాంటి రుసుము ను తీసుకోవ‌డానికి నిరాక‌రించారని ఆయన మ‌న‌సు ను క‌ద‌లించి వేసేటటువంటి విషయాన్ని ఆ ట్వీట్ లో పోస్టు చేశారు. ఆ ట్వీట్ హిందీ బాష లో ఉంది. రాయ‌బారి ప్ర‌స్తావించిన ఈ సంఘ‌ట‌న భార‌త‌దేశం-అఫ్‌గానిస్తాన్ సంబంధాల ప‌రిమ‌ళాన్ని విరజిమ్ముతోందని ప్ర‌ధాన మంత్రి అభివర్ణించారు.

 

మీరు ఒక కామెంట్ లో ఆహ్వానం లభించిన రాజ‌స్థాన్ లోని హ‌రిపురా కు కూడా వెళ్లండి అని అప్ గాన్ రాయబారి ని ప్రధాన మంత్రి కోరారు. అలాగే గుజ‌రాత్ లోని హ‌రిపుర కు సైతం వెళ్లవలసిందని, ఆ ప్రాంతాని కి త‌న‌దైన చ‌రిత్ర అంటూ ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు.

ఈ రోజు న జాతీయ వైద్యుల దినం కావ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ‌ది.



(Release ID: 1732037) Visitor Counter : 216