ప్రధాన మంత్రి కార్యాలయం

జిఎస్‌టి నాలుగు సంవ‌త్స‌రాల కాలాన్ని పూర్తి చేసుకొన్నందుకు ప్ర‌శంస ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


అది భార‌త‌దేశ ఆర్థిక రంగం లో ఒక మైలురాయి గా నిల‌చింద‌న్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 30 JUN 2021 2:38PM by PIB Hyderabad

వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి) నాలుగు సంవ‌త్స‌రాల కాలాన్ని పూర్తి చేసుకొన్న సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌శంస ను వ్యక్తం చేశారు.  భార‌త‌దేశ ఆర్థిక రంగం లో జిఎస్ టి ఒక మైలురాయి గా నిల‌చింద‌ని ఆయ‌న అన్నారు.

‘‘జిఎస్‌టి భార‌త‌దేశ ఆర్థిక రంగం లో ఒక మైలురాయి గా నిల‌చింది.  అది ప‌న్ను ల సంఖ్య ను, ప‌న్నుల తాలూకు నియ‌మావ‌ళి ని అనుస‌రించ‌డం లో భారాన్ని తగ్గించివేయడం తో పాటు సామాన్య మాన‌వుని కి మొత్తం మీద ప‌న్ను ల సంబంధి భారాన్ని త‌గ్గించింది; పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని, (ప‌న్నుల సంబంధిత) నియ‌మాల అనుస‌ర‌ణ ను, సమగ్ర వ‌సూలు ను చెప్పుకోద‌గ్గ‌ రీతి లో పెంచింది కూడాను. #4YearsofGST’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***



(Release ID: 1731434) Visitor Counter : 189