ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గత 24 గంటల్లో 84,332 కరోనా కేసులు, 70 రోజుల్లో అత్యల్పం చికిత్సలో ఉన్న కేసులు 63 రోజుల తరువాత 11 లక్షల లోపు


30వరోజు కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాతం 95.07% కు పెరుగుదల

రోజువారీ పాజిటివిటీ 4.39%, 19రోజులుగా 10% లోపే నమోదు

Posted On: 12 JUN 2021 11:36AM by PIB Hyderabad

గత 24 గంటలలో దేశంలో 84,332 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు లక్షలోపు నమోదవటం ఇది ఐదో రోజు. కేంద్రంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతోనే ఇది సాధ్యమైంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RF90.jpg

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 10,80,690 మంది ఉండగా 12రోజులుగా 20 లక్షలలోపే ఉంటున్నారు. గత 24 గంటలలో ఈ సంఖ్య 40,981 ఉండగా చికిత్సలో ఉన్నవారు పాజిటివ్ కేసుల్లో 3.68%  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002727U.jpg

 

ఎక్కువమంది కోవిడ్ బారినుంచి కోలుకొని బైటపడుతూ ఉండటంతో దేశంలో 30వరోజుకూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా నమోదవుతున్నారు. గత 24 గంటల్లో 1,21,311 మంది కోలుకున్నారు. రోజువారీ కేసులతో పోల్చినప్పుడు గత 24 గంటలలో 36,979 మంది ఎక్కువగా కోలుకున్నారు.  

 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003G20P.jpg

ఇప్పటివరకు మొత్తం కరోనా సంక్షోభ సమయంలో 2,79,11,384 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 1,21,311 మంది కోలుకున్నారు. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 95.07%.

 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004YWOY.jpg

పరీక్షల సామర్థ్యాన్ని దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటలలో 19,20,477 పరీక్షలు చేపట్టగా  ఇప్పటివరకు మొత్తం 37.62 కోట్ల (37,62,32,162) పరీక్షలు జరిపినట్టయింది. అదే సమయంలో పాజిటివిటీ తగ్గుతోంది. వారపు పాజిటివిటీ 4.94% కాగా రోజువారీ పాజిటివిటీ ప్రస్తుతం 4.39% అయింది. ఇది 19 రోజులుగా 10% లోపే ఉంటోంది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0056J4D.jpg

 దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య దాదాపుగా 25 కోట్లు చేరింది.  మొత్తం 34,64,228 శిబిరాల ద్వారా 24,96,00,304 డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం చెబుతోంది. గత 24 గంటలలో 34,33,763 టీకా డోసుల పంపిణీ జరిగింది.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,00,35,262

రెండో డోస్

69,47,565

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,66,36,247

రెండో డోస్

88,12,574

18-44 వయోవర్గం

మొదటి డోస్

3,81,21,531

రెండో డోస్

5,61,503

 45 - 60 వయోవర్గం

మొదటి డోస్

7,47,06,979

రెండో డోస్

1,18,31,770

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,21,90,130

రెండో డోస్

1,97,56,743

మొత్తం

24,96,00,304

 

***



(Release ID: 1726488) Visitor Counter : 141