ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

18-44 వయోవర్గానికి కోటికి పైగా టీకాలు


వరుసగా 11వ రోజుకూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారే అధికం

8వ రోజు కూడా రోజువారీ కొత్త కేసులు 3 లక్షలలోపే
వారపు పాజిటివిటీ 12.66% కు తగ్గుదల

Posted On: 24 MAY 2021 11:52AM by PIB Hyderabad

కోవిడ్ మీద పొరులో భారత దేశం మరో మైలురాయి దాటింది. మూడో దశ టీకాల కార్యక్రమం కింద చేపట్టిన 18-44 వయోవర్గం వారి టీకా డోసులు కోటి దాటి 1,06,21,235 కి చేరాయి.  కరోనా సంక్షోభాన్ని నియంత్రించటానికి భారత్ చేపట్టిన పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు, కోవిడ్ నియంత్రణ ప్రవర్తనలు ప్రోత్సహించు అనే వ్యూహంలో భాగమే టీకాల కార్యక్రమం. టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తూ భారత ప్రభుత్వం మే 1 నుంచి 18-44 వయోవర్గానికి కూడా టీకాలిచ్చే మూడో దశ చేపట్టింది. .

 

సంఖ్య

రాష్టం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

4,082

2

ఆంధ్రప్రదేశ్

8,891

3

అరుణాచల్ ప్రదేశ్

17,777

4

అస్సాం

4,33,615

5

బీహార్

12,27,279

6

చండీగఢ్

18,613

7

చత్తీస్ గఢ్

7,01,945

8

దాద్రా, నాగర్ హవేలి

18,269

9

డామన్, డయ్యూ

19,802

10

ఢిల్లీ

9,15,275

11

గోవా

30,983

12

గుజరాత్

6,89,234

13

హర్యానా

7,20,681

14

హిమాచల్ ప్రదేశ్

40,272

15

జమ్మూ-కశ్మీర్

37,562

16

జార్ఖండ్

3,69,847

17

కర్నాటక

1,97,693

18

కేరళ

30,555

19

లద్దాఖ్

3,845

20

లక్షదీవులు

1,770

21

మధ్యప్రదేశ్

7,72,873

22

మహారాష్ట్ర

7,06,853

23

మణిపూర్

9,110

24

మేఘాలయ

23,142

25

మిజోరం

10,676

26

నాగాలాండ్

7,376

27

ఒడిశా

3,06,167

28

పుదుచ్చేరి

5,411

29

పంజాబ్

3,70,413

30

రాజస్థాన్

13,17,060

31

సిక్కిం

6,712

32

తమిళనాడు

53,216

33

తెలంగాణ

654

34

త్రిపుర

53,957

35

ఉత్తరప్రదేశ్

10,70,642

36

ఉత్తరాఖండ్

2,20,249

37

పశ్చిమ బెంగాల్

1,98,734

                            మొత్తం

1,06,21,235

 

దేశవ్యాప్తంగా మూడోఈ దశ టీకాలు కూడా చేపట్టటంతో ఈరోజు వరకు వేసిన టీకా డోసుల సంఖ్య 19.60 కోట్లు దాటింది.

 మొత్తం 28,26,725 శిబిరాల ద్వారా ఇప్పటిదాకా  19,60,51,962టీకా డోసులు పంపిణీ చేయగా అందులో  ఆరోగ్య సిబ్బంది వేసుకున్న 97,60,444 మొదటి డోసులు, 67,06,890 రెండో డోసులు, కోవిడ్ యోధులు వేసుకున్న   1,49,91,357 మొదటి డోసులు,   83,33,774  రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న 1,06,21,235 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వేసుకున్న  6,09,11,756 మొదటి డోసులు, 98,18,384 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు వేసుకున్న 5,66,45,457 మొదటి డోసులు,   1,82,62,665 రెండో డోసులు ఉన్నాయి.   

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

97,60,444

రెండో డోస్

67,06,890

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,49,91,357

రెండో డోస్

83,33,774

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,06,21,235

45 -60 వయోవర్గం

మొదటి డోస్

6,09,11,756

రెండో డోస్

98,18,384

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,66,45,457

రెండో డోస్

1,82,62,665

మొత్తం

19,60,51,962

 

మొత్తం ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో 66.30%  వాటా  పది రాష్టాలదే కావటం గమనార్హం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FEJC.jpg

రోజువారీ కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం వరుసగా 11 వ రోజు కూడా నమోదైంది. గత 24 గంటలలో  3,02,544 మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 2,37,28,011 కాగా కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 88.69% కు చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో పది రాష్ట్రాలవాటా  72.23% 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0027ILO.jpg

వరుసగా ఎనిమిది రోజులుగా కొత్త కొవిడ్ కేసులు రోజుకు 3 లక్షలకు లోపు నమోదు కావటం మరో సానుకూల పరిణామం. కొత్తకేసుల సంఖ్యకు, కోలుకున్నవారికి మధ్య తేడా తగ్గుతూ ప్రస్తుతం 80,229 కి తగ్గాయి. దేశంలో నమోదైన కొత్త కేసులు, కోలుకున్న కేసులను పోల్చే చిత్రపటం ఈ క్రింద చూడవచ్చు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0039O7K.jpg

గడిచిన 24 గంటలలో 2,22,315 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాలవాటా 81.08% కాగా, తమిళనాడులో అత్యధికంగా  35,483 కేసులు, మహారాష్ట్రలో 26,672 కేసులు వచ్చాయి

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048UJR.jpg

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులలో మార్పును ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు. చివరి సారి అత్యధికంగా నమోదైన మే 10 తరువాత తగ్గుదలబాటలో సాగుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005H12R.jpg

దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 27,20,716 కు తగ్గాయి.  గత 24 గంటలలో నికరంగా 84,683 కేసులు తగ్గాయి. ఇవి దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్  కేసులలో 10.17%. చికిత్సలో ఉన్నవారిలో 71.62% వాటా 8 రాష్ట్రాలదే.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006QKIJ.jpg

గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 19,28,127 కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య   33,05,36,064 కు చేరింది.  ప్రస్తుత పాజిటివిటీ 8.09% కాగా వారపు పాజిటివిటీశాతం 12.66%.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007900V.jpg

ప్రస్తుతం జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల శాతం 1.14%. గత 24 గంటలలో 4,454 మరణాలు నమోదయ్యాయి. ఇందులో  79.52% వాటా పది రాష్ట్రాలది కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 1320 మంది, కర్నాటకలో 624 మంది  చనిపోయారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008DDFI.jpg

18 రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ కెసులలో మరణాల శాతం జాతీయ సగటు (1.14%) కంటే తక్కువ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0096HAJ.jpg

18 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్ బాధితులలో మరణాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010YE1F.jpg

***

 

 


(Release ID: 1721275)