ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వరుసగా ఆరో రోజు కొత్తకేసులకంటే కోలుకున్న వారే అధికం


మూడు రోజులుగా 3 లక్షలలోపే రోజువారీ కొత్త కేసులు
గత 24 గంటలలో 20 లక్షల కోవిడ్ పరీక్షలతో ప్రపంచ రికార్డు
రోజువారీ పాజిటివిటీ శాతం 13.31% కు తగ్గుదల

ఇప్పటిదాకా 18-44 వయోవర్గానికి 64 లక్షలకు పైగా టీకాలు

Posted On: 19 MAY 2021 12:28PM by PIB Hyderabad

వరుసగా ఆరో రోజు కూడా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్యే అధికంగా ఉంది. గత 24 గంటలలో 3,89,851 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా దేశంలో కోవిడ్ బారినుంచి బైటపడినవారి సంఖ్య 2,19,86,363  కు చేరుకోగా కోలుకున్నవారి శాతం నేడు 86.23% అయింది. కోలుకున్నవారిలో 74.94% మంది పది రాష్ట్రాలకు చెందినవారు.  

 

పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టటాన్ని ప్రతిబింబిస్తూ గత 3 రోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల లోపే ఉంటోంది.  గత 24 గంటలలో 2,67,334 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 74.46% వాటా పది రాష్ట్రాలది కాగా తమిళనాడులో అత్యధికంగా 33,059 కేసులు, కేరళలో  31,337 కేసులు వచ్చాయి.

చికిత్సలో ఉన్న మొత్తం కేసుల సంఖ్య తగ్గుతూ 32,26,719 కు చేరింది. గత 24 గంటలలో నికర తగ్గుదల 1,27,046 కాగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 12.66%.  ఇందులో 69.02% వాటా ఎనిమిది రాష్ట్రాలది. .

 

గత నెలరోజుల కాలంలో చికిత్సలో ఉన్న కేసులలో మార్పును ఈ క్రింది చిత్రపటం చూపుతుంది.  

 

గత 24 గంటలలో 20 లక్షలకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపగా ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు జరపటం ఇదే మొదటి సారి. రోజువారీ పాజిటివిటీ శాతం 13.31% తగ్గింది. గత 24 గంటల్లో 20.08 లక్షల పరీక్షలు జరపటం ప్రపంచ రికార్డు.

దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ పరీక్షలు 32 కోట్లు దాటాయి. 

 

దేశంలో జరిపిన కోవిడ్ పరీక్షల పెరుగుదల క్రమాన్నిఈ క్రింది చిత్రపటం చూపుతోంది. ప్రస్తుతం మొత్తం పాజిటివిటీ 7.96%.

మూడో దశ టీకాల కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా పుంజుకోవటంతో ఇప్పటిదాకా వేసిన వేసిన మొత్తం టీకాలు 18.58 కోట్లకు చేరాయి.  మొత్తం  27,10,934 శిబిరాల ద్వారా 18,58,09,302 టీకా డోసుల పంపిణీ జరగగా అందులో ఆరోగ్య సిబ్బంది వేసుకున్న 96,73,684 మొదటి డోసులు, 66,59,125 రెండో డోసులు, కోవిడ్ యోధులు వేసుకున్న 1,45,69,669 మొదటి డోసులు, 82,36,515 రెండో డోసులు, 18-44 వయోవర్గం వేసుకున్న  64,77,443 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వేసుకున్న 5,80,46,339 మొదటి డోసులు, 93,51,036 రెండో డోసులు, 60 పైబడ్డవారు వేసుకున్న   5,48,16,767 మొదటి డోసులు, 1,79,78,7242 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,73,684

మొదటి డోస్

66,59,125

కోవిద్ యోధులు

మొదటి డోస్

1,45,69,669

మొదటి డోస్

82,36,515

18-44 వయోవర్గం

మొదటి డోస్

64,77,443

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,80,46,339

మొదటి డోస్

93,51,036

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,48,16,767

మొదటి డోస్

1,79,78,724

 

మొత్తం

18,58,09,302

 

***


(Release ID: 1719909) Visitor Counter : 167