ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో మొదటి సారిగా ఒక రోజులో 4 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు


వరుసగా రెండు రోజులుగా రోజుకు 3 లక్షలలోపు కొత్త కేసులు
గత 24 గంటల్లో 1,63,232 తగ్గిన చికిత్సలో ఉన్న కేసులు

దేశవ్యాప్తంగా 18.44 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ

18-44 వయోవర్గంలో 66 లక్షల టీకా లబ్ధిదారులు

Posted On: 18 MAY 2021 1:27PM by PIB Hyderabad

ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల అవిశ్రాంత, అంకితభావంతో కూడిన శ్రమ వలన భారతదేశం ఒక మైలురాయి లాటి ఘనత సాధించింది. రోజువారీ కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య వరుసగా రెండు రోజులుగా 4 లక్షలు పైబడింది. గత 24 గంటలలో 4,22,436 మంది కోలుకున్నట్టు నమోదైంది. గత 14 రోజులలో సగటున రోజుకు  3,55,944 మంది కోలుకున్నారు. గడిచిన 14 రోజులలో రోజువారీ కోలుకున్నవారి సమాచారాన్ని ఈ దిగువ చిత్రపటంలో చూడవచ్చు

 

గత 24 గంటలలో 2,63,533 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు 3 లక్షలలోపు నమోదయ్యాయి.  గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య నికరంగా 1,63,232 తగ్గింది.  13వ తేదీ నుమ్చి తగ్గుదల సాగుతున్న తీరును ఈ క్రింది చిత్ర పటం చూపుతోంది.   

దేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య  2,15,96,512 కు చేరగా కోలుకున్నవారి శాతం 85.60% కు పెరిగింది.

ఇందులో 75.77% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం. 

 

మరోవైపు దేశంలో కోవిడ్ చికిత్స పొందుతున్న  వారి సంఖ్య 33,53,765 కు తగ్గింది. ఇది మొత్తం ఇప్పటిదాకా నమొదైన పాజిటివ్ కేసులలో  13.29%. చికిత్సలో ఉన్నవారిలో  69.01%  మంది 8 రాష్టాలకు చెందినవారే

మూడో దశ టీకాల కార్యక్రమం కూడా మొదలవటంతో  దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య దాదాపు 18.44 కోట్లకు చేరింది. 26,87,638 శిబిరాల ద్వారా మొత్తం 18,44,53,149 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 96,59,441 మొదటి డోసులు,   66,52,389 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,45,00,303 మొదటి డోసులు,  82,17,075  రెండో డోసులు 18-44 వయోవర్గం వారు తీసుకున్న  59,39,290 మొదటి డోసులు,  45060 ఏళ్లవారు తీసుకున్న  5,76,64,616  మొదటి డోసులు, 92,43,104 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,46,64,577 మొదటి డోసులు, 1,79,12,354 రెండో డోసులు ఉన్నాయి 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,59,441

రెండవ డోస్

66,52,389

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,45,00,303

రెండవ డోస్

82,17,075

18-44 వయోవర్గం

మొదటి డోస్

59,39,290

 45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,76,64,616

రెండవ డోస్

92,43,104

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,46,64,577

రెండవ డోస్

1,79,12,354

 

మొత్తం

18,44,53,149

 

ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకాలలో 66.70%వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.

 

18-44 వయోవర్గం వారు గత 24 గంటలలో 6,69,884 మంది మొదటి డోస్ తీసుకున్నారు.   దీంతో ఇప్పటిదాకా ఈ వయోవర్గం వారు తీసుకున్న టీకా డోసుల సంఖ్య   59,39,290 కు చేరింది. మొత్తం 36 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారు తీసుకున్నా ఈ టీకా డోసులు తీసుకున్నారు.   

టీకాల కార్యక్రమం మొదలైన 122వ రోజైన మే 17న 14,447 శిబిరాల ద్వారా  15,10,418 టీకా డోసులివ్వగా అందులో 12,67,201 మమ్ది లబ్ధిదారులు మొదటి డోస్, 2,43,217 మంది రెండో డోస్ తీసుకున్నారు.   

గత 24 గంటలలో వచ్చిన కొత్త కొవిడ్ కేసులలో 74.54% వాటా పది రాష్ట్రాలదే. గత 24 గంటలలో కర్నాటకలో అత్యధికంగా 38603 కేసులు నమోదు కాగా తమిళనాడులో 33,075 కొత్త కేసులు వచ్చాయి.

జాతీయ స్థాయిలొ కోవిడ్ మరణాల శాతం 1.10% గా నమోదైంది. గత 24 గంటలలో 4,329 మరణాలు నమోదయ్యాయి. ఇందులో పది రాష్టాల వాటా 75.98% కాగా మహారాష్ట్రలొ అత్యధికంగా 1000 మంది, కర్నాటకలో 476 మంది చనిపోయారు. 

దీనికి తోడుగా విదేశాలనుంచి అందుతున్న కోవిడ్ సాయాన్ని వీలైనంత త్వరగా అందుకొని రాష్ట్రాలకు విభజించి తరలిస్తున్నారు. మొత్తం 11,321 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 15,801 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ ఉత్పత్తి ప్లాంట్లు; 7,470 వెంటిలేటర్లు; దాదాపు 5.5 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ఇప్పటిదాకా రోడ్డు, వాయు మార్గాల్లో పంపారు

***


(Release ID: 1719609) Visitor Counter : 251