ప్రధాన మంత్రి కార్యాలయం

ఆక్సిజన్ మరియు ఔషధాల లభ్యత, సరఫరాను సమీక్షించిన - ప్రధానమంత్రి


ఔషధాల ఉత్పత్తిని పెంచడానికీ, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని విస్తరించడానికీ, ఉత్పత్తిదారులతో నిరంతరం సంప్రదిస్తున్న - భారత ప్రభుత్వం.

గత కొన్ని వారాలలో రెమ్‌డెసివిర్‌ తో సహా అన్ని ఔషధాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది

మొదటి దశలో జరిగిన గరిష్ట సరఫరాతో పోలిస్తే, ఇప్పుడు మూడు రేట్లు కంటే ఎక్కువగా, పెరిగిన - ఆక్సిజన్ సరఫరా

Posted On: 12 MAY 2021 9:14PM by PIB Hyderabad

ఆక్సిజన్ మరియు ఔషధాల లభ్యత, సరఫరాను సమీక్షించడానికి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు.

కోవిడ్ మరియు శ్లేష్మానికి సంబంధించిన వ్యాధి నిర్వహణలో వాడుతున్న మందుల సరఫరాను ప్రభుత్వం చురుకుగా పర్యవేక్షిస్తోందని ప్రధానమంత్రి కి వివరించారు.  ఔషధాల ఉత్పత్తిని పెంచడానికీ, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని విస్తరించడానికీ, ప్రభుత్వం ఉత్పత్తిదారులతో నిరంతరం సంప్రదిస్తున్నట్లుప్రధానమంత్రికి వివరించారు. అటువంటి ప్రతి ఔషధానికీ సంబంధించి, ప్రస్తుత ఉత్పత్తితో పాటు ఏ.పి.ఐ. ల నిల్వ గురించి కూడా ప్రధానమంత్రికి సమాచారం అందించారు.  తగిన పరిమాణంలో రాష్ట్రాలకు మందులు అందిస్తున్న విషయాన్ని కూడా, ఈ సందర్భంగా చర్చించారు.  గత కొన్ని వారాలలో రెమ్‌డెసివిర్‌తో సహా అన్ని ఔషధాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని కూడా ప్రధానమంత్రికి తెలియజేశారు.  భారతదేశం చాలా శక్తివంతమైన ఔషధ తయారీ రంగాన్ని కలిగి ఉందనీ, వారితో ప్రభుత్వం నిరంతరం సమన్వయంతో ఉండడం వల్ల, అన్ని ఔషధాలు అవసరమైన మేరకు అందుబాటులో లభిస్తున్నాయని, ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

దేశంలో ఆక్సిజన్ లభ్యత మరియు సరఫరాపై ప్రస్తుత పరిస్థితిని కూడా, ప్రధానమంత్రి, అడిగి, తెలుసుకున్నారు.   మొదటి దశలో జరిగిన గరిష్ట సరఫరా తో పోలిస్తే, ఇప్పుడు మూడు రేట్లు కంటే ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా అవుతున్న విషయంపై కూడా ఈ సందర్భంగా చర్చించడం జరిగింది.  ఆక్సిజన్ ఎక్స్-ప్రెస్ రైలు సర్వీసుల కార్యకలాపాల గురించి,  భారతీయ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా గురించి, ప్రధానమంత్రికి వివరించారు.   ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల సేకరణతో పాటు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న పి.ఎస్‌ఎ. ప్లాంట్ల స్థితిగతుల గురించి కూడా, ప్రధానమంత్రికి తగిన సమాచారం అందజేశారు.

వెంటిలేటర్లను సమయస్ఫూర్తితో వినియోగించాలనీ, తయారీదారుల సహాయంతో సాంకేతిక పరమైన, శిక్షణా పరమైన సమస్యలను పరిష్కరించ వలసిందిగా,  రాష్ట్రాలను కోరాలని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****



(Release ID: 1718207) Visitor Counter : 207