ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు పోర్చుగీస్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి గౌరవనీయులు ఆంటోనియో లూయిస్ శాంటాస్ డా కోస్టా మధ్య టెలిఫోను సంభాషణ

Posted On: 16 MAR 2021 7:17PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, పోర్చుగీస్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి గౌరవనీయులు ఆంటోనియో లూయిస్ శాంటాస్ డా కోస్టా తో టెలిఫోన్ లో మాట్లాడారు. 

తమ దేశాల్లోని కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిని ఇరువురు నాయకులు సమీక్షించారు.   మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సిన్ల యొక్క శీఘ్ర మరియు సమాన పంపిణీ యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించారు.

భారతదేశంలో టీకాలు వేసే కార్యక్రమం గురించి ప్రధానమంత్రి మోదీ, పోర్చుగీసు ప్రధానమంత్రికి  వివరించారు.  అలాగే ఇప్పటివరకు 70 కి పైగా దేశాలకు భారతదేశం తన టీకాలను సరఫరా చేసిందని కూడా తెలియజేసారు.   ఇతర దేశాల టీకాల ప్రయత్నాలకు భారతదేశం తన సామర్థ్యాన్ని ఉత్తమంగా కొనసాగిస్తుందని ఆయన ఈ సందర్భంగా  హామీ ఇచ్చారు.

ఇరువురు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.  గత కొన్నేళ్లుగా భారతదేశం-పోర్చుగల్ భాగస్వామ్యంలో సానుకూల దృక్ఫధం  ఊపందుకుంది. 

2021 మే నెలలో పోర్టోలో ఈ.యు. యొక్క పోర్చుగీసు ప్రెసిడెన్సీ క్రింద జరగనున్న భారత-ఈ.యు. నాయకుల మొదటి సమావేశానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి కూడా వారు సమీక్షించారు.  భారత-ఈ.యు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, ప్రధానమంత్రి కోస్టా పోషిస్తున్న పాత్రను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు.  అదేవిధంగా పోర్టోలో జరిగే సమావేశంలో, తనను కలవడానికి ఎదురుచూస్తున్నానని కూడా, మోదీ పేర్కొన్నారు.

*****



(Release ID: 1705291) Visitor Counter : 120