ప్రధాన మంత్రి కార్యాలయం
అమృత్ మహోత్సవం కార్యక్రమం సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ఆరంభం కానుంది: ప్రధాన మంత్రి
‘వోకల్ ఫార్ లోకల్’ బాపుజీ కి, స్వాతంత్య్ర యోధుల కు ఒక అద్భుత శ్రద్ధాంజలి అని పేర్కొన్న ప్రధాన మంత్రి
Posted On:
12 MAR 2021 10:00AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పాదయాత్ర’ (స్వేచ్ఛా యాత్ర) కు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం లో శుక్రవారం నాడు ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపనున్నారు.
‘‘నేటి అమృత్ మహోత్సవ్ కార్యక్రమం దాండీ యాత్ర మొదలైన సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ఆరంభమవుతుంది. ఈ యాత్ర భారతదేశ ప్రజల లో గర్వం మరియు ఆత్మనిర్భరత భావనల ను పెంచడం లో కీలక పాత్ర ను పోషించింది. ‘వోకల్ ఫార్ లోకల్’ (లేదా స్థానిక ఉత్పత్తుల వైపు మొగ్గు చూపడం) బాపూజీ కి, మన స్వాతంత్య్ర యోధుల కు ఒక అద్భుతమైనటువంటి శ్రద్ధాంజలి అవుతుంది.
స్థానిక ఉత్పత్తి ని దేనిని అయినా సరే కొనుగోలు చేసి, దాని తాలూకు ఒక ఛాయాచిత్రాన్ని ‘వోకల్ ఫార్ లోకల్’ అనే మాటల తో సామాజిక ప్రసార మాధ్యమాల లో నమోదు చేయండి. సాబర్‌మతీ ఆశ్రమం లోని మగన్ నివాస్ దగ్గర ఒక చరఖా ను అమర్చడం జరుగుతుంది. ఆ చరఖా ఆత్మనిర్భరత కు సంబంధించిన ప్రతి ఒక్క ట్వీట్ తో పాటు ఒకసారి పూర్తి గా తిరుగుతుంది. ఇది ప్రజా ఉద్యమాని కి ఒక ఉత్ప్రేరకం గా కూడా మారాలి’’ అని అనేక ట్వీట్ లలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(Release ID: 1704306)
Visitor Counter : 190
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam