ప్రధాన మంత్రి కార్యాలయం

బిర్ చిలారాయ్ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకున్న - ప్రధానమంత్రి

Posted On: 27 FEB 2021 3:59PM by PIB Hyderabad

ప్రముఖ బిర్ చిలారాయ్ జయంతి సందర్భంగా, ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ, ఆయన్ని స్మరించుకున్నారు.

ఈ విషయమై, ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "ప్రముఖుడైన బిర్ చిలారాయ్,  శౌర్యం మరియు దేశభక్తి కి పర్యాయపదంగా నిలిచారు. ఆయన, ఒక అత్యుత్తమ యోధుడు. ఆయన ప్రజల కోసం మరియు ఆయన పవిత్రంగా భావించిన సూత్రాల కోసం పోరాడారు. ఆయన చూపిన ధైర్య, సాహసాలు, ముందు తరాలకు ప్రేరణగా నిలుస్తాయి. ఆయన జయంతి సందర్భంగా, ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాను." అని పేర్కొన్నారు. 

*****(Release ID: 1701405) Visitor Counter : 192