ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1.35 లక్షలకు తగ్గుదల


గత 24 గంటలలో కొత్తకేసులు రాని 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు

ఇప్పటివరకు 75 లక్షలమందికి పైగా కోవిడ్ టీకాలు

అత్యంత వేగంగా 70 లక్షల టీకాలు దాటిన భారత్

Posted On: 12 FEB 2021 10:53AM by PIB Hyderabad

దేశంలో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య మరింత తగ్గి ఈ రోజుకు 1,35,926కు చేరింది.  మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా 1.25% మాత్రమే. చికిత్సలో ఉన్నవారి సంఖ్య ప్రతిరోజూ తగ్గుతూ వస్తోంది. తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూదా తగ్గుతూ పరిస్థితిని ఆశాజనకంగా చూపుతోంది.

కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే వెయ్యికి పైగా కొత్త కెసులు నమోదయ్యాయి. మిగిలిన రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వెయ్యికంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కొత్త కేసు కూడా రాలేదు. అవి: దాద్రా, నాగర్ హవేలి, డామన్-దయ్యూ, లద్దాఖ్, త్రిపుర, అండమాన్, నికోబార్ దీవులు రోజువారీ మరణాలు కూడా క్రమంగా తగ్గుదల బాటలో సాగుతున్నాయి.

 

గత 24 గంటలలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత  ప్రాంతాలలో ఒక మరణం కూడా నమోదు కాలేదు. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 1-5 మరణాలు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటలలో 9,309 మంది కొత్తగా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. అదే సమయంలో 15,858 మంది కోలుకున్నారు. 

దీంతో జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 97.32% కి చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక కొలుకున్న శాతంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,05,89,230.

కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా కూడా క్రమంగా పెరుగుతూ 1,04,53,304 కి చేరింది. 2021 ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 75,05,010 కి చేరింది.

 

క్రమసంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

3,454

2

ఆంధ్ర ప్రదేశ్

3,43,813

3

అరుణాచల్ ప్రదేశ్

14,322

4

అస్సాం

1,17,607

5

బీహార్

4,48,903

6

చండీగఢ్

7,374

7

చత్తీస్ గఢ్

2,33,126

8

దాద్రా, నాగర్ హవేలి

2,698

9

డామన్, డయ్యూ

1,030

10

ఢిల్లీ

1,62,596

11

గోవా

11,391

12

గుజరాత్

6,45,439

13

హర్యానా

1,90,390

14

హిమాచల్ ప్రదేశ్

72,191

15

జమ్మూ-కశ్మీర్

93,570

16

జార్ఖండ్

1,74,080

17

కర్నాటక

4,77,005

18

కేరళ

3,33,560

19

లద్దాఖ్

2,761

20

లక్షదీవులు

920

21

మధ్యప్రదేశ్

4,87,271

22

మహారాష్ట్ర

6,08,573

23

మణిపూర్

15,944

24

మేఘాలయ

11,642

25

మిజోరం

11,046

26

నాగాలాండ్

8,371

27

ఒడిశా

3,83,023

28

పుదుచ్చేరి

4,780

29

పంజాబ్

97,668

30

రాజస్థాన్

5,90,990

31

సిక్కిం

8,316

32

తమిళనాడు

2,11,762

33

తెలంగాణ

2,70,615

34

త్రిపుర

59,438

35

ఉత్తరప్రదేశ్

7,63,421

36

ఉత్తరాఖండ్

97,618

37

పశ్చిమ బెంగాల్

4,53,303

38

ఇతరములు

84,999

మొత్తం

75,05,010

 

ఇప్పటిదాకా టీకాలు వేయించుకున్నవారు మొత్తం 75,05,010 మంది కాగా, వారిలో ఆరోగ్య సిబ్బంది  58,14,976 మంది, కోవిడ్ యోధులు 16,90,034  మంది ఉన్నారు. వీరికోసం మొత్తం 1,54,370 శిబిరాలు నిర్వహించారు. 70 లక్షల టీకాల మైలురాయిని అత్యంత వేగంగా దాటిన దేశంగా భారత్ తన ప్రత్యేకత చాటుకుంది. 

27వ రోజైన ఫిబ్రవరి 11న 4,87,896 మంది టీకాలు అందుకోగా వారిలో 1,09,748 మంది ఆరోగ్య సిబ్బందిమరియు 3,78,148 మంది కోవిడ్ యోధులు ఉన్నారు.  వీరికోసం  11,314 శిబిరాలు నిర్వహించారు. ప్రతిరోజూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.  

టీకాలు వేయించుకున్నవారిలో 69% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే కావటం విశేషం. ఒక్క ఉత్తరప్రదేశ్ లొనే 10.2% మంది ( 7,63,421 మంది) కోవిడ్ టీకాలు వేయించుకున్నారు.

గత 24 గంటలలో కోలుకున్నవారిలో 86.89% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 6,107 మంది కోలుకోగా, ఆ తరువాత స్థానాల్లో కేరళ (5,692) చత్తీస్ గఢ్ (848) ఉన్నాయి.

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయిన వారిలో 79.87% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారున్నారు.  కేరళలో అత్యధికంగా 5,281 కొత్త కేసులు రాగా ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర (652), తమిళనాడు (481) ఉన్నాయి. గత 24 గంటలలో 87 మంది కోవిడ్ బాధితులు మరణించారు.

వారిలో 75.86% మంది ఆరు రాష్టాలకు చెందినవారే ఉన్నారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 25 మంది చనిపోగా, కేరళలో 16 మంది మరణించారు.

*******



(Release ID: 1697358) Visitor Counter : 184