ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

19 రోజుల్లో దాదాపు 45 లక్షలమందికి కోవిడ్ టీకాలు

18 రోజుల్లో 40 లక్షల టీకాలిచ్చిన వేగవంతమైన దేశం భారత్

చికిత్సలో కోవిడ్ బాధితులు స్థిరంగా తగ్గుతూ 1.55 లక్షల దిగువకు

Posted On: 04 FEB 2021 11:27AM by PIB Hyderabad

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మీద పోరులో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది. ఇప్పటివరకు దాదాపు 45 లక్షలమంది (44,49,552) కోవిడ్ టీకాలు అందుకున్నారు. ఈ సంఖ్య చేరుకోవటానికి కేవలం 19 రోజుకు పట్టింది.  18 రోజుల్లో 40 లక్షలమందికి టీకాలివ్వటం ద్వారా భారతదేశం అత్యంత వేగంగా ఈ లక్ష్యం చేరుకున్న దేశంగా నిలిచింది. చాలా దేశాలకు ఇలాంటి ఆరంభాన్ని అందుకోవటానికి 65 రోజులు పట్టింది. భారతదేశం 2021 జనవరి 16న  దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే.    

 

ప్రతి రోజూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య  పురోగతి కనబరుస్తూనే ఉంది.

 

 

గత 24 గంటలలో 3,10,604  మంది 8,041 శిబిరాలలో టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు 84,617 శిబిరాలు నిర్వహించారు.

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2,772

2

ఆంధ్రప్రదేశ్

2,15,171

3

అరుణాచల్ ప్రదేశ్

9,846

4

ఆస్సాం

43,607

5

బీహార్

2,64,097

6

చండీగఢ్

4,399

7

చత్తీస్ గఢ్

1,01,564

8

దాద్రా, నాగర్ హవేలి

926

 9

డామన్, డయ్యూ

561

10

ఢిల్లీ

81,433

11

గోవా

6,326

12

గుజరాత్

3,11,251

13

హర్యానా

1,29,866

14

హిమాచల్ ప్రదేశ్

43,926

15

జమ్మూ కశ్మీర్

26,634

16

జార్ఖండ్

67,970

17

కర్నాటక

3,16,638

18

కేరళ

2,46,043

19

లద్దాఖ్

1,511

20

లక్షదీవులు

807

21

మధ్యప్రదేశ్

3,30,722

22

మహారాష్ట్ర

3,54,633

23

మణిపూర్

5,872

24

మేఘాలయ

4,806

25

మిజోరం

9,995

26

నాగాలాండ్

4,244

27

ఒడిశా

2,11,346

28

పుదుచ్చేరి

3,222

29

పంజాబ్

63,663

30

రాజస్థాన్

3,63,521

31

సిక్కిం

3,425

32

తమిళనాడు

1,33,434

33

తెలంగాణ

1,76,732

34

త్రిపుర

32,340

35

ఉత్తరప్రదేశ్

4,63,793

36

ఉత్తరాఖండ్

54,153

37

పశ్చిమ బెంగాల్

3,01,091

38

ఇతరములు

57,212

                             మొత్తం

44,49,552

ఇప్పటివరకు టీకాలు వేయించుకున్నవారిలో 54.87% మంది కేవలం 7 రాష్ట్రాలకు చెందినవారే.


భారత్ లో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ నేటికి  1,55,025 కు చేరింది. దేశమంతటా ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ లలో వీరు కేవలం 1.44%ప్రతి రోజూ అంతకుముందు రోజుకంటే కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ రావటం స్పష్టంగా కనబడుతోంది.

 

 

భారతదేశపు రోజువారీ పాజిటివ్ శాతం నేటికి 1.82% అయింది. గడిచిన 19 రోజులుగా పాజిటివ్ శాతం 2% లోపే ఉంటూ వస్తోంది.

 

ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,04,80,455 కాగా,  కొత్త  కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కోలుకున్నవారి శాతం  97.13% కి చేరింది.  చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 67.6 రెట్లు ఎక్కువ. గత 24 గంటలలో కోలుకున్నవారిలో  86.04% మంది కేవలం 6 రాష్ట్రాల్లోనే నమొదయ్యారు. గత 24 గంటలలో మహారాష్ట్రలో అత్యధికంగా 7,030 మంది, కేరళలో  6,380 మంది, తమిళనాడులో  మంది కోలుకున్నారు.  

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 84.67% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారు కాగా  కేరళలో అత్యధికంగా  6,356 కేసులు, మహారాష్ట్రలో 2,992, తమిళనాడులో  514 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటలలో నమోదైన మరణాలలో 71.03% ఆరు రాష్టాలలోనే సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 30 మంది మరణించగా కేరళలో 20 మంది, చత్తీస్ గఢ్ లో ఏడుగురు చనిపోయారు..

 

***



(Release ID: 1695111) Visitor Counter : 195