ప్రధాన మంత్రి కార్యాలయం

కొవిడ్‌-19 కి వ్య‌తిరేకం గా టీకాల ‌ను ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం గా ప్రారంభించినందుకు భార‌త ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాన మంత్రి ని అభినందించిన ఇరుగు పొరుగు దేశాల నేత‌ లు

Posted On: 18 JAN 2021 5:22PM by PIB Hyderabad

కొవిడ్‌-19 కి వ్య‌తిరేకం గా గ‌త శ‌నివారం, అంటే జ‌న‌వ‌రి 16 టీకా మందు ను ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా ప్రారంభించినందుకు గాను భార‌త ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఇరుగు పొరుగు దేశాల నేత‌ లు అభినందించారు.  


‘‘#కొవిడ్‌-19 టీకా మందు ను ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని స‌ఫ‌ల‌త పూర్వ‌కం గా ప్రారంభించినందుకు, అలాగే పొరుగు దేశాల ప‌ట్ల క‌న‌బ‌ర‌చిన ఔదార్యానికి గాను PM @narendramodi కి ఇవే నా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు’’ అని శ్రీ లంక అధ్య‌క్షుడు మాన్య‌శ్రీ గోట్ బాయా రాజ‌ప‌క్స ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.


— Gotabaya Rajapaksa (@GotabayaR)
My heartiest congratulations to Prime Minister Shri @narendramodi on the successful roll out of the #COVID19 vaccine & his generosity towards friendly neighbouring countries. #COVID19Vaccination #india #SriLanka pic.twitter.com/ToscTxwge6
 


‘‘భారీ ఎత్తున #కొవిడ్‌-19 టీకా మందును ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినందుకు గాను, భార‌త ప్ర‌భుత్వానికి, PM @narendramodi కి ఇవే అభినంద‌న ‌లు.  ఈ విధ్వంస‌క‌ర మ‌హ‌మ్మారి అంతాని కి ఆరంభాన్ని మనం చూడ‌టం మొదలుపెట్టాం’’ అని శ్రీ లంక ప్ర‌ధాని శ్రీ మ‌హిందా రాజ‌ప‌క్స ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.


-Mahinda Rajapaksa
@PresRajapaksa
Congratulations PM @narendramodi and the Government of India on taking this very important step with this massive #COVID19Vaccination drive. We are starting to see the beginning of the end to this devastating pandemic. @IndiainSL


మాల్దీవ్స్ గ‌ణ‌తంత్రం అధ్య‌క్షుడు మాన్య‌శ్రీ  ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ ఒక ట్వీట్ లో ‘‘భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌ కు కొవిడ్‌-19 నిరోధ‌క టీకా మందును ఇప్పించే చ‌రిత్రాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినందుకు గాను భార‌త ప్ర‌భుత్వానికి, PM @narendramodi కి ఇవే అభినంద‌న‌లు.  ఈ ప్ర‌య‌త్నం లో మీరు స‌ఫ‌ల‌త సాధిస్తార‌ని, మ‌నం కొవిడ్‌-19 భూతాన్ని ఎట్ట‌కేల‌కు నిర్మూలంచ ‌గ‌లుగుతున్నామ‌న్న విశ్వాసం  నాలో మెండు గా ఉంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

— Ibrahim Mohamed Solih (@ibusolih)
Congratulations to PM @narendramodi and the Indian government for its landmark program to vaccinate India’s population against COVID-19. I’m highly confident that you’ll be successful in this endeavor and that we are finally seeing an end to the COVID-19 scourge.



భూటాన్ ప్ర‌ధాని డాక్ట‌ర్ లోటె శెరింగ్ ఒక ట్వీట్ లో ‘‘నేను ఈ రోజు న కొవిడ్‌-19 తాలూకు టీకా మందు ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని దేశ‌వ్యాప్తం గా ప్రారంభించిన ఈ చ‌రిత్రాత్మ‌కన సంద‌ర్భం లో భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు, PM @narendramodi కి అభినంద‌న‌ల‌ను తెలిజేయాల‌నుకొంటున్నాను.  ఇది ఈ మ‌హ‌మ్మారి కి ఎదురొడ్డి నిల‌వ‌డం లో ఇన్నాళ్ళు గా మ‌న‌మంతా ప‌డ్డ అవ‌స్థ‌ల‌ను తీర్చే ఒక స‌మాధానం గా మ‌న ముందుకు వ‌స్తుంది అ‌ని నేను ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


— PM Bhutan (@PMBhutan)
I would like to congratulate PM @narendramodi and the people of India for the landmark launch of nationwide COVID-19 vaccination drive today. We hope it comes as an answer to pacify all the sufferings we have endured this pandemic. https://t.co/f921VupuJn pic.twitter.com/M9q3KKLFo3



 

***



(Release ID: 1689754) Visitor Counter : 190