ప్రధాన మంత్రి కార్యాలయం

భార‌త ర‌త్న ఎంజిఆర్‌కు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 17 JAN 2021 2:12PM by PIB Hyderabad

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త డాక్ట‌ర్ ఎం.జి.రామ‌చంద్ర‌న్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రిశ్రీ న‌రేంద్ర మోదీ, ఈరోజు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  సినిమారంగం నుంచి రాజ‌కీయ రంగం వ‌ర‌కు ఎం.జి.ఆర్ ప్ర‌జ‌ల హృద‌యాల‌లో నిలిచిపోయార‌ని ఆయ‌న అన్నారు. గుజ‌రాత్‌లోని కెవాడియాకు దేశంలోని వివిధ ప్రాంతాల‌నుంచి రైలు స‌ర్వీసుల‌ను జండా ఊపి వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించిన అనంత‌రం మాట్లాడుతూ ఆయ‌న ఈ మాట‌లు అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుజ‌రాత్‌లో ప‌లు రైల్వే ప్రాజెక్టుల‌ను ప్రారంభించారు.


కెవాడియా వ‌చ్చే రైళ్లలో ఒక రైలు పుర‌చ్చి త‌లైవ‌ర్ డాక్ట‌ర్ ఎం.జి.రామ‌చంద్ర‌న్ సెంట్ర‌ల్‌రైల్వే స్టేష‌న్ నుంచి ప్రారంభం అవుతుండ‌డాన్ని ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు.  ఎం.జిఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  రాజ‌కీయ రంగంలో, చ‌ల‌న చిత్ర రంగంలో ఎం.జి.ఆర్  సాధించిన విజ‌యాల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఎం.జి.ఆర్  రాజ‌కీయ జీవితం పేద‌ల‌కు అంకిత‌మ‌ని,  నిరుపేద‌లు గౌర‌వ‌ప్రదంగా బ‌తికేందుకు నిరంత‌రం శ్ర‌మించార‌ని ఆయ‌న కొనియాడారు. ఎంజిఆర్ ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.  చెన్నై సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్ కు ఈ గొప్ప దేశం ఎలా ఎంజిఆర్ పేరు పెట్టిన‌దీ
ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

***


(Release ID: 1689564) Visitor Counter : 134