ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ స్థాయి లో టీకాకరణ కార్యక్రమాన్ని చేపట్టడం మానవజాతి చరిత్ర లో ఇదివరకు ఎన్నడూ జరుగనిది:  ప్ర‌ధాన మంత్రి

భారతదేశం లో తయారు చేసిన టీకామందులను వాటి ప్రభావశీలత్వం పట్ల, వాటి భద్రత పట్ల శాస్త్రవేత్తలకు, నిపుణులకు పూర్తి నమ్మకం కుదిరాకే అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపడమైంది:  ప్ర‌ధాన మంత్రి

ప్రపంచ వ్యాప్తం గా 60 శాతం మంది బాలలు భారతదేశం లో తయారు అయిన ప్రాణరక్షక టీకామందులనే అందుకొంటున్నారు:  ప్ర‌ధాన మంత్రి

Posted On: 16 JAN 2021 1:46PM by PIB Hyderabad

దేశ వ్యాప్తం గా కోవిడ్-19 టీకామందు ను  ఇప్పించే కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం, అంటే జనవరి 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.  దేశం నలుమూలల సాగే ఈ టీకాకరణ ప్రపంచం లోనే అతి పెద్ద టీకాకరణ కార్యక్రమం గా ఉంది.
 
ఒకటో దశ లోనే 3 కోట్ల మంది కి టీకామందు ను ఇప్పించడం జరుగుతోందని తెలియజేయడం ద్వారా, ఈ టీకాకరణ అపూర్వమైనటువంటి స్థాయి లో చోటు చేసుకొంటున్నదిగా ప్రధాన మంత్రి విశదీకరించారు.  3 కోట్ల మంది అంటే- అది ప్రపంచం లో కనీసం 100 దేశాల జనాభా కంటే ఎక్కువ అని- చెప్పుకోవచ్చును.  రెండో దశ లో, దీనిని 30 కోట్ల సంఖ్య కు చేర్చవలసిన అవసరం ఉంది; రెండో దశ లో వయోవృద్ధులకు, గంభీరమైన వ్యాధిగ్రస్తులకు టీకామందు ను ఇప్పించడం జరుగుతుందన్నారు.  30 కోట్ల కంటే ఎక్కువ జనాభా ను కలిగివున్న దేశాలు మూడే ఉన్నాయి.. అవి భారతదేశం, యుఎస్ఎ (అమెరికా), చైనా లు అని ఆయన చెప్పారు.  ఈ స్థాయి లో టీకామందు ను ఇప్పించే కార్యక్రమం చరిత్ర లో ఎన్నడూ జరిగిన దాఖలా లేదని, ఇది భారతదేశం సత్తా ను చాటిచెప్తోందని శ్రీ మోదీ అన్నారు.

భారతదేశం లో తయారు చేసిన ఈ టీకామందు ల ప్రభావశీలత్వం పట్ల, భద్రత పట్ల శాస్త్రవేత్తలకు, నిపుణులకు పూర్తి నమ్మకం కుదిరిన తరువాత మాత్రమే అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపడం జరిగిందని, కాబట్టి వదంతుల బారిన పడకుండాను, ప్రచారం బారిన పడకుండాను ఉండవలసిందిగా ప్రజలను   ప్ర‌ధాన మంత్రి కోరారు.  ఈ విషయం లో భారతీయ టీకామందు శాస్త్రవేత్తలను, భారతీయ వైద్య వ్యవస్థ ను, భారతీయ ప్రక్రియ ను, భారతీయ సంస్థాగత యంత్రాంగాన్ని ప్రపంచ స్థాయి లో విశ్వసించడం జరుగుతోందని, మరి ఈ విశ్వాసాన్ని ఒక స్థిరమైన ట్రాక్ రికార్డ్ ద్వారా సంపాదించుకోవడం జరిగిందని ఆయన అన్నారు.  ప్రపంచం అంతటా 60 శాతం మంది బాలలు భారతదేశం లో తయారు అయినటువంటి, ఖచ్చితమైన భారతీయ విజ్ఞానశాస్త్ర సంబంధి పరీక్షల  లో ఉత్తీర్ణత ను సాధించినటువవంటి ప్రాణరక్షక టీకామందులను అందుకొంటున్నారంటూ ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

భారతదేశ టీకామందు ప్రావీణ్యం పైన, భారతదేశ టీకామందు శాస్త్రవేత్తల పైన పెట్టుకొన్న ఈ నమ్మకం భారతదేశం లో తయారు అయిన కరోనా టీకామందు ద్వారా మరింత బలోపేతం అయింది అని ప్రధాన మంత్రి అన్నారు.  భారతదేశం టీకామందులు విదేశీ టీకామందుల కంటే చాలా చౌక అయినవే కాక వాటిని ఇవ్వడం కూడా సులభతరం అని ఆయన చెప్పారు.  విదేశీ టీకామందుల లో కొన్ని టీకామందుల ధర అయితే ఒక మోతాదు కు ఐదువేల రూపాయల వరకు ధర పలుకుతోందని, వాటిని మైనస్ 70 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద నిలవ ఉంచవలసివస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.  అదే భారతదేశం టీకామందులు ఎన్నో ఏళ్ల  పాటు భారతదేశం లో పరీక్షలు జరిపి, అనేకమైన ప్రయోగాలు పూర్తి చేసిన సాంకేతిక విజ్ఞానం పైన ఆధారపడినటువంటివి అని ఆయన అన్నారు.  నిలవ మొదలుకొని రవాణా వరకు చూస్తే ఈ టీకామందులు భారతదేశం లోని పరిస్థితులకు అనువైనవి, ఇవి కరోనా కు వ్యతిరేకంగా మనం జరుపుతున్నటువంటి పోరాటం లో ఒక అంతిమ విజయాన్ని సాధించడంలో మనకు సాయపడతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

కరోనా కు భారతదేశం లో వ్యక్తం అయిన ప్రతిస్పందన ఆత్మవిశ్వాసం తోను, ఆత్మనిర్భరత తోను కూడుకొన్నది అని శ్రీ మోదీ అభివర్ణించారు.  భారతదేశం లో ప్రతి ఒక్కరి లో విశ్వాసాన్ని సన్నగిలకుండా చూడాలన్న సంకల్పం వ్యక్తం అయింది అని ఆయన చెప్పారు.  ఒకే కరోనా ప్రయోగశాల నుంచి 2300 ప్రయోగశాలల తో కూడిన ఒక బలమైన నెట్ వర్క్ వరకు సాగిన ప్రయాణాన్ని గురించి, మాస్క్ లు, పిపిఇ  కిట్ లు, వెంటిలేటర్ ల కోసం ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి స్వయంసంవృద్ధి ని సాధించేవరకు సాగిన ప్రయాణాన్ని గురించి ఆయన గుర్తు కు తెచ్చారు.  ఇదే తరహా ఆత్మవిశ్వాస భావన ను, స్వావలంబి భావన ను టీకాకరణ తదుపరి దశ లలో సైతం కనబరచండి అంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

Our #LargestVaccineDrive celebrates @makeinindia, at a scale that is unparalleled. pic.twitter.com/QYYiJZ5cPW
https://twitter.com/i/status/1350350795653476353

— Narendra Modi (@narendramodi) January 16, 2021

***

(Release ID: 1689070) Visitor Counter : 268