ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

#LargestVaccineDrive

భారత్ లో చరిత్రాత్మక ఘట్టం : ప్రపంచంలోనే

అతిపెద్ద టీకాల కార్యక్రమానికి శ్రీకారం

మొత్తం కేసుల్లో 2 శాతానికి పడిపోయిన చికిత్సలో ఉన్న కేసులు

Posted On: 16 JAN 2021 11:37AM by PIB Hyderabad

కోవిడ్ నియంత్రణ కార్యక్రమంలో భారత్ ఈ రోజు చరిత్రాత్మక మైలురాయి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఈ రోజు ఉదయం 10.30 కి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ దేశవ్యాప్త టీకాల కార్యక్రమాన్ని వీడియో కనఫరెన్స్ ద్వారా పారంభించారు. అదే సమయంలో దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య . 2,11,033 కు తగ్గిపోయి మొత్తం కేసుల్లో 2 శాతానికి పరిమితమైంది.  2021 జూన్ 29 న మాత్రమే ఈ సంఖ్యలో కోవిడ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లొ కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 96.56% కు పెరిగింది.

 

ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్ పాజిటివ్ కేసులు  2,11,033. వీరిలో కొందరు ఆస్పత్రులలోను, కొందరు ఇళ్లలోను చికిత్సలో ఉన్నారు.   కోలుకున్నవారి సంఖ్య కోటి దాటి  1,01,79,715 కి చేరాయి.

కోలుకున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం  99,68,682  కి చేరింది. 

 

చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ఉండగా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 5,000 లోపే ఉంది.  ఈ రాష్ట్రాలలో కేసుల సంఖ్య మొత్తం చికిత్సలో ఉన్నవారిలో 15% మాత్రమే ఉంది. 

 

వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఈ విధంగా ఉంది:

 

గత 24 గంటలలో  కోలుకున్నవారిలో 81.94% మంది కేవలం 10 రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉన్నారు.  కేరళలో అత్యధికంగా  4,603 మంది కోలుకోగా, మహారాష్టలో   3,500 మంది, చత్తీస్ గడ్ లో 1009 మంది కోలుకున్నారు.   

 

కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 80.81% మంది కేవలం 8 రాష్టాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా  5,624 కొత్త కే సులు వచ్చాయి. మహారాష్ట్రలో 3145 మంది, పశ్చిమ బెంగాల్ లో 708 మంది కొత్తగా కరోనాబారిన పడ్దారు.

 

గడిచిన 24 గంటలలో 175 మంది కోవిడ్ కారణంగా మరణించారు. వీరిలో 69.14% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారు. మహారాష్ట్రలో గరిష్ఠంగా 45 మంది చనిపోగా, కేరళలో 23 మంది, పశ్చిమ బెంగాల్ లో 16 మంది చనిపోయారు.

 

****


(Release ID: 1689040) Visitor Counter : 233