ప్రధాన మంత్రి కార్యాలయం
దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఐక్యతా విగ్రహం వద్దకు నిరంతరాయప్రయాణానికి వీలుకల్పిస్తూ 8 రైళ్లను జనవరి 17న జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
గుజరాత్‌లో రైల్వే రంగానికి సంబంధించి పలు ఇతర ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
Posted On:
15 JAN 2021 4:50PM by PIB Hyderabad
గుజరాత్‌లోని కెవాడియాకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 8 రైళ్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 జనవరి 17 ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు ఐక్యతా ప్రతిమ వద్దకు నిరంతరాయ ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తాయి. ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుజరాత్‌లో రైల్వే రంగానికి సంబంధించి పలు ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధానమంత్రి దబోయి- చందోడ్ గేజ్ మార్పిడి చేసిన బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ ను, చందోడ్- కేవడియా కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్, కొత్తగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్-కెవాడియా సెక్షన్ , దభోయి, చందోడ్,కెవడియా కొత్త రైల్వే స్టేషన్ భవనాలను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.ఈ భవనాలను స్థానికత మేళవింపుతో రమణీయమైన డిజైన్లతో రూపొందించారు. వీటిలో ఆధునిక రీతిలో ప్రయాణికుల సదుపాయాలు కల్పించారు దేశంలోగ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కలిగిన తొలి రైల్వేస్టేషన్ కెవాడియా స్టేషన్. ఈ ప్రాజెక్టులు సమీపంలోని గిరిజన ప్రాంతాలలో అభివృద్ధికి అవకాశం కలిగిస్తాయి. ఇవి ఆ ప్రాంతంలోని ప్రధాన మతపరమైన ప్రాంతాలు, నర్మదా నదీతీరంలోని ప్రాచీన యాత్రా స్థలాలను అనుసంధానం చేస్తాయి. ఇవి దేశీయ అంతర్జాతీయ పర్యాటకాన్ని పెంపొందించనున్నాయి. అలాగే మొత్తంగా ఈ ప్రాంత సామాజిక ఆర్ధిక అభివృద్ధికి వ్యాపార అవకాశాలకు ఇది దోహదం చేయనుంది
ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించ నున్న 8 రైళ్ల కు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
క్రమ
సంఖ్య
|
రైలు నెం.
|
నుంచి
|
వరకు
|
రైలుపేరు / ఫ్రీక్వెన్సీ
|
1
|
20903/04
|
కేవడియా
|
వారణాశి
|
మహామన ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
|
2
|
12927/28
|
దాదర్
|
కెవాడియా
|
దాదర్-కెవాడియా ఎక్స్‌ప్రెస్ (డెయిలీ)
|
3
|
20947/48
|
అహ్మదాబాద్
|
కెవాడియ |
జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ (డైలీ) |
4
|
20945/46
|
కేవడియా |
హజరత్‌నిజాముద్దీన్
|
నిజాముద్దీన్-కేవడియా సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ)
|
5
|
20905/06
|
కేవడియా
|
రేవా
|
కేవడియా-రేవా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
|
6
|
20919/20
|
చెన్నై
|
కేవడియా
|
చెన్నై -కేవడియా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
|
7
|
69201/02
|
ప్రతాప్‌నగర్
|
కేవడియా
|
మెము ట్రెయిన్ (డెయిలీ)
|
8
|
69203/04
|
ప్రతాప్‌నగర్
|
కేవడియా
|
మెము ట్రెయిన్ (డెయిలీ)
|
జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు అత్యధునాతన విస్టా డోమ్ టూరిస్ట్ కోచ్‌ను ఏర్పాటుచేస్తారు. ఇది ఆకాశపు అంచులవరకూ అందాలను తిలకించే అద్భుత అవకాశం కలిగిస్తుంది.
***
(Release ID: 1688935)
Visitor Counter : 228
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam