ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు అధికం,

తగ్గుదల బాటలో చికిత్సపొందుతున్నవారు

గత 24 గంటలలో కొత్త కేసులు 16,375

కొత్త యుకె వైరస్ సోకినవారు 58 మంది

Posted On: 05 JAN 2021 11:32AM by PIB Hyderabad

భారత దేశంలో కోవిడ్ తో బాధపడుతూ చికిత్సపొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 2,31,036 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  2.23% మాత్రమే.

వరుసగా 39 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది.  గత 24 గంటలలో 29,091 మంది కొలుకోగా, కొత్తగా నమోదైన కేసులు  16,375 మాత్రమే.   ఎక్కువ పరీక్షలు జరపటం వలన ఇది సాధ్యమైంది. గత 24 గంటలలో  8,96,236 శాంపిల్స్ పరీక్షించారు.  గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 12,917 తగ్గింది.

రోజువారీ కొత్త కేసులు కూడా దేశంలో తగ్గుదలబాటలో ఉన్నాయి.

యుకె వైరస్ గా కలకలం రేపిన కొత్త వైరస్ సోకిన వారి సంఖ్య 58 కి చేరింది. ఒక్క పూణె లోని ఎన్ ఐ వి లోనే 20 కేసుల నిర్థారణ జరిగింది. ప్రభుత్వం గుర్తించి నిర్దేశించిన మొత్తం 10 లాబ్ లలో పరీక్షలు జరుగుతుండగా  బెంగళూరులోని ఎన్ సి బి ఎస్, ఇన్ స్టెమ్, హైదరాబాద్ లోని సిడి పెహ్ డి, భువనేశ్వర్ లోని ఐ ఎల్ ఎస్,  పూణె లొని ఎన్ సి సి ఎస్ లో మాత్రం ఇప్పటివరకు ఈ కొత్త వైరస్ కనబడలేదు. 

సంఖ్య

సంస్థ/ ప్రయోగ శాల

పరిధి

కొత్త కోవిడ్ బైటపడ్ద వ్యక్తుల సంఖ్య

1

ఎన్ సి డిన్ ఎస్, న్యూ ఢిల్లీ

ఆరోగ్య మంత్రిత్వశాఖ

8

2

ఐజిఐబి న్యూ ఢిల్లీ

సి ఎస్ ఐ ఆర్

11

3

ఎన్ ఐ బి ఎం జి కల్యాణి (కోల్ కతా)

బయో టెక్నాలజీ విభాగం

1

4

ఎన్ ఐ వి, పూణె

 సి ఎం ఆర్

25

5

సిసిఎంబి హైదరాబాద్

సి ఎస్ ఐ ఆర్

3

6

నిమ్హాన్స్, బెంగళూరు

అరోగ్య మంత్రిత్వశాఖ

10

మొత్తం

58

 

పాజిటివ్ గా తేలిన శాంపిల్స్ ను దేశవ్యాప్తంగా కేంద్రం నిర్దేశించిన 10 ప్రత్యేక లాబ్ లకు ( ఎన్ సి డిన్ ఎస్, న్యూ ఢిల్లీ; ఐజిఐబి న్యూ ఢిల్లీ; ఎన్ ఐ బి ఎం జి కల్యాణి (కోల్ కతా); ఎన్ ఐ వి, పూణె; సిసిఎంబి హైదరాబాద్; నిమ్హాన్స్, బెంగళూరు) పంపటం ద్వారా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తున్నారు.

ఇలా నిర్థారణ అయిన వారందరినీ ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆరోగ్య కేంద్రాల్లోని ప్రత్యేక గదుల్లో ఒంటరిగా ఉంచుతున్నాయి. వాళ్లతో అత్యంత సన్నిహితంగా మెలిగినవారిని, సహ ప్రయాణీకులను, కుటుంబ సభ్యులను కూడా గుర్తించి జీనోమ్ సీక్వెన్సింగ్ కి శాంపిల్స్ పంపుతున్నారు.

రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు తగిన సూచనలిస్తూ ఉండగా ప్రస్తుతం పరిస్థితి పూర్తి అదుపులో ఉంది. నిఘా పెంచటానికి, నియంత్రించటానికి, పరీక్షల సంఖ్య పెంచటానికి, శాంపిల్స్ ను ఎప్పటికప్పుడు కేంద్రం నిర్దేశించిన పది లాబ్స్ కు పమ్పటానికి తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్రాలకు కేంద్రం సూచనలిస్తోంది.  

భారత దేశంలో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ కోటికి దగ్గరవుతోంది. ఇప్పటివరకు కోలుకున్నవారు 99,75,958 కు చేరారు.  దీనివలన కోలుకున్న శాతం  96.32% కు చేరింది. గడిచిన 24 గంటలలో  29,091మంది కోవిడ్ నుంచి బైటపడ్దారు.

కొత్తగా కోలుకున్నవారిలో 82.62% మంది పది రాష్ట్రాలకు చెందినవారు. మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న 10,362 మంది కోలుకోగా కేరళలో 5,145 మంది, చత్తీస్ గఢ్ లో1,349 మంది కోలుకున్నారు.

కొత్తగా గుర్తించిన కేసులలో 80.05%  కేవలం పది రాష్ట్రాలకు పరిమితం కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా  4,875 కేసులు, కేరళలో 3,021 కెసులు, చత్తీస్ గఢ్ లో  1,147 కేసులు నిన్న వెలుగు చూశాయి.

గత 24 గంటలలో 201 మంది మరణించగా, వారిలో 70.15% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  తాజా మరణాలలో 14.42% (29మంది)మహారాష్ట్రకు చెందినవారు కాగా, పశ్చిమ బెంగాల్ లో   25 మంది, పంజాబ్ లో 24 మంది చనిపోయారు.

***(Release ID: 1686234) Visitor Counter : 131