ప్రధాన మంత్రి కార్యాలయం

శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన - ప్రధానమంత్రి

విశ్వ భారతి ప్రయాణం ప్రతి భారతీయునికీ గర్వకారణం: ప్రధానమంత్రి

విశ్వ భారతి కోసం గురుదేవుల ఆలోచన కూడా స్వావలంబన భారతదేశం యొక్క సారాంశమే : ప్రధానమంత్రి

Posted On: 24 DEC 2020 2:02PM by PIB Hyderabad

శాంతినికేతన్ లోని విశ్వ-భారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలనుద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా  ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, వంద సంవత్సరాల విశ్వభారతి ప్రయాణం చాలా ప్రత్యేకమైనదనీ, ప్రతి భారతీయునీకీ గర్వకారణమనీ, పేర్కొన్నారు.  భరతమాత కోసం గురుదేవుల ధ్యానం, దృష్టి, కృషికి ఈ విశ్వవిద్యాలయం నిజమైన ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు.  గురుదేవులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి విశ్వభారతి, శ్రీనికేతన్, శాంతినికేతన్ సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని, ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

విశ్వభారతి నుండి వెలువడే సందేశాలను, మన దేశం,  విశ్వవ్యాప్తం చేస్తోందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా పర్యావరణ పరిరక్షణలో భారతదేశం, ఈ రోజున, ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందని,  ఆయన అన్నారు.  పారిస్ ఒప్పందం యొక్క పర్యావరణ లక్ష్యాలను సాధించడం కోసం, సరైన మార్గంలో పయనిస్తున్న ఏకైక ప్రధాన దేశం భారతదేశం అని ఆయన చెప్పారు.

ఈ విశ్వవిద్యాలయ స్థాపనకు దారితీసిన పరిస్థితులను గుర్తుచేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. స్వాతంత్య్ర ఉద్యమ లక్ష్యాలు,  ఈ విశ్వవిద్యాలయ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, ఈ రెండు ఉద్యమాలు, చాలా కాలం క్రితమే ప్రారంభమయ్యాయన్నది వాస్తవం.  శతాబ్దాల నుండి కొనసాగుతున్న అనేక ఉద్యమాల నుండి భారత స్వాతంత్య్ర ఉద్యమం శక్తి పొందిందని, ప్రధానమంత్రి అన్నారు.  భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఐక్యతను,  భక్తి ఉద్యమం బలపరిచిందని, ఆయన పేర్కొన్నారు.  భక్తి యుగంలో, భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన సాధువులు దేశ స్పృహను మేల్కొల్పడానికి ప్రయత్నించారని ఆయన తెలియజేశారు.  శతాబ్దాలుగా పోరాడుతున్న భారతదేశానికి, సమిష్టి చైతన్యం, విశ్వాసంతో నిండిన ప్రవేశ ద్వారం వంటిది భక్తి ఉద్యమం అని, ప్రధానమంత్రి మోదీ అభివర్ణించారు. 

శ్రీ రామకృష్ణ పరమహంస వల్లనే, స్వామి వివేకానంద వంటి మేధావి భారతదేశానికి లభించారని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  భక్తి, జ్ఞానం, చర్యలలో, మూడింటినీ, స్వామి వివేకానంద గ్రహించారు.  భక్తి యొక్క పరిధిని విస్తరించే క్రమంలో, స్వామి వివేకానంద, ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడటం ప్రారంభించారనీ, వ్యక్తి మరియు సంస్థల సృష్టిపై దృష్టి కేంద్రీకరిస్తూ, కర్మకు కూడా వ్యక్తీకరణ ఇచ్చారనీ, శ్రీ మోదీ వివరించారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి భక్తి ఉద్యమానికి చెందిన మేధావులైన సాధువులు బలమైన పునాది వేశారు.

వందల సంవత్సరాల భక్తి ఉద్యమ కాలంతో పాటు, కర్మ ఉద్యమం కూడా దేశంలోనే ప్రారంభమైందని ప్రధానమంత్రి చెప్పారు.  ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, ఝాన్సీరాణి, రాణి చిన్నెమ్మ, భగవాన్ బిర్సా ముండాతో సహా అనేక ఉదాహరణలను ప్రధానమంత్రి ఇచ్చారు.  భారత ప్రజలు బానిసత్వం మరియు సామ్రాజ్యవాదంతో పోరాడారు.  అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా సాధారణ పౌరుల చిత్తశుద్ధి, త్యాగం చేసే కర్మ-కఠినమైన అభ్యాసం తారాస్థాయికి చేరుకుందనీ, అదే, భవిష్యత్తు లో మన స్వాతంత్య్ర పోరాటానికి ప్రధాన ప్రేరణగా మారిందనీ, ఆయన పేర్కొన్నారు. 

భక్తి త్రిమూర్తి స్వరూపమనీ,  కర్మ, జ్ఞానం, స్వాతంత్రోద్యమ స్పృహను పెంచి, పోషించాయనీ, ప్రధానమంత్రి అన్నారు.  విజ్ఞాన స్థాపనపై  స్వాతంత్రోద్యమంలో విజయం సాధించడానికి సైద్ధాంతిక విప్లవాన్ని సృష్టించడం, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా  అవసరమనీ, అదే సమయంలో భారతదేశ ఉజ్వల భవిష్యత్తును సృష్టించడానికి వీలుగా  కొత్త తరాన్ని సిద్ధం చేయవలసిన అవసరం కూడా ఉందనీ, ఆయన పేర్కొన్నారు.  అనేక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఈ విషయంలో, చాలా పెద్ద పాత్ర పోషించాయని, ఆయన అన్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సైద్ధాంతిక ఉద్యమానికి, ఈ విద్యాసంస్థలు, నూతన శక్తిని, నూతన దిశను, నూతన శిఖరాలను ఇచ్చాయి.

మనం భక్తి ఉద్యమంతో ఐక్యంగా ఉన్నామని,  జ్ఞాన ఉద్యమం మేధో బలాన్ని ఇచ్చిందనీ, అలాగే, కర్మ ఉద్యమం, మన హక్కుల కోసం పోరాడ్డానికి ధైర్యాన్నిచ్చిందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు. వందల సంవత్సరాల పాటు కొనసాగిన స్వాతంత్య్ర ఉద్యమం త్యాగం, తపస్సు, భక్తికి ఒక అసమానమైన ఉదాహరణగా నిలిచిందని, ఆయన అభివర్ణించారు.  ఈ ఉద్యమాలతో ఆకర్షితులైన వేలాది మంది ప్రజలు,  స్వాతంత్య్ర సంగ్రామంలో త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు.

గురుదేవుల జాతీయవాదం గురించి ఆలోచిస్తే, అది, వేదాల నుంచి వివేకానందకు వరకు జాతీయ చైతన్యంలా  ప్రవహించినట్లు భావించవచ్చునని,  ప్రధానమంత్రి పేర్కొన్నారు.   "ఈ  ప్రవాహం, అంతర్ముఖం లేదా సంకీర్ణం కాదు, అలాగని, భారతదేశం ప్రపంచం నుండి ఒంటరిగా ఉండటమూ కాదు. భారతదేశంలో ఉత్తమమైన వాటి నుండి ప్రపంచం ప్రయోజనం పొందాలన్నదే, దీని ఉద్దేశ్యం. అదేవిధంగా, ప్రపంచంలో ఏది మంచిగా ఉంటే, భారతదేశం కూడా దాని నుండి మంచిని నేర్చుకోవాలి.  ‘విశ్వ భారతి’ అనే పేరు భారతదేశం మరియు ప్రపంచం మధ్య సంబంధాన్ని కలుపుతుంది.  విశ్వ భారతి కోసం గురుదేవుల దృష్టి కూడా స్వావలంబన భారతదేశం యొక్క సారాంశమే.  ప్రపంచ సంక్షేమం కోసం భారతదేశ సంక్షేమానికి మార్గమే, స్వావలంబన భారత్ ప్రచారం.  ఇది భారతదేశానికి సాధికారత కల్పించే ప్రచారం. ఇది భారతదేశ శ్రేయస్సు నుండి ప్రపంచ శ్రేయస్సును కాంక్షించే ప్రచారం." అని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. 

*****


(Release ID: 1683423) Visitor Counter : 177