ప్రధాన మంత్రి కార్యాలయం

అమెరికా నుండి "లీజియన్ ఆఫ్ మెరిట్" అవార్డును స్వీకరించడం - భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పై ఏకాభిప్రాయం పెరగడానికి గుర్తింపని పేర్కొన్న - ప్రధానమంత్రి

Posted On: 22 DEC 2020 8:59PM by PIB Hyderabad

అమెరికా ప్రభుత్వం "లీజియన్ ఆఫ్ మెరిట్" అవార్డు ప్రదానం చేయడం, తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

ఈ విషయమై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, సామాజిక మాధ్యమం ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ,  "@పోటస్@రియల్ డోనాల్డ్ ట్రంప్ (@POTUS @realDonaldTrump) ద్వారా "లీజియన్ ఆఫ్ మెరిట్" అవార్డును పొందడం నాకు చాలా గౌరవంగా ఉంది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడానికి భారత-అమెరికా ప్రజలు చేస్తున్న ప్రయత్నాలను ఇది గుర్తించింది. భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు దేశాలకు గల ద్వైపాక్షిక ఏకాభిప్రాయాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. 

21 వ శతాబ్దం అపూర్వమైన సవాళ్లతో పాటు అవకాశాలను కూడా అందిస్తోంది. మొత్తం మానవాళి యొక్క ప్రయోజనం కోసం ప్రపంచ నాయకత్వాన్ని అందించడానికి మన ప్రజల ప్రత్యేక బలాల విస్తారమైన సామర్థ్యాన్ని, భారత-అమెరికా సంబందాలు ప్రభావితం చేస్థాయి. 

భారత-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ప్రభుత్వంతో పాటు, ఇరు దేశాలలోని, భాగస్వాములందరితో కలిసి పనిచేయడానికి నా ప్రభుత్వ దృక్ఫదాన్నీ, నిబద్ధతనూ, భారతదేశంలోని 1.3 బిలియన్ల ప్రజల తరపున, నేను పునరుద్ఘాటిస్తున్నాను." అని పేర్కొన్నారు. 

*****


(Release ID: 1682816) Visitor Counter : 156