ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య తగ్గుతూ

161 రోజుల తరువాత 3.03 లక్షలకు చేరిక

వరుసగా 24వ రోజు కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ

Posted On: 21 DEC 2020 12:03PM by PIB Hyderabad

భారత్ లో కోవిడ్ చికిత్సపొందుతున్నవారి సంఖ్య ఈ రోజు 3.03 లక్షలకు (3,03,639) పడిపోయింది. ఇది గడిచిన 161 రోజులలో అత్యల్పం. సరిగ్గా జులై 13 న బాధితుల సంఖ్య 3,01,609  గా నమోదైంది. ప్రస్తుతమున్న బాధితులు మొత్తం కోవిడ్ కేసుల్లో 3.02% మాత్రమే. దీంతో నికరంగా బాధితుల సంఖ్య 1,705  మంది తగ్గటానికి దారితీసింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012K19.jpg

గడిచిన 24 గంటలలో కోత పాజిటివ్ కెసులకంటే కోలుకున్నవారే ఎక్కువమంది నమోదయ్యారు. ఈ ధోరణి గత 24 రోజులుగా కొనసాగుతూనే ఉంది.  గత 24 గంటలలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 24,337  కాగా 25,709 మంది బాధితులు కోలుకున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YB4E.jpg

కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో కోలుకుంటున్న శాతం పెరుగుతూ నేటికి 95.53% అయింది. ఇప్పటిదాకా మొత్తం కొలుకున్న కోవిడ్ పాజిటివ్ జనాభా  9,606,111 కు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం 93,02,472 కి చేరింది..

కొత్తగా కోలుకున్న వారిలో 71.61% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కేరళలో అత్యధికంగా  ఒకే రోజులో  4,471 మంది కోలుకోగా  పశ్చిమ బెంగాల్ లో 2,627 మంది,  మహారాష్ట్రలో  2,064  మంది కోలుకున్నారు. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00367A2.jpg

కొత్తగా పాజిటివ్ గా తేలినవారిలో 79.20% మంది 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 5,711 కేసులు నమోదు కాగా, మహరాష్ట్రలో 3,811 మంది, పశ్చిమ బెంగాల్ లో  1,978 కొత్త కేసులు వచ్చాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004Z9IY.jpg

గడిచిన 24 గంటలలో 333 మంది మరణించారు. అందులో 81.38%  మరణాలు 10 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో గరిష్ఠ మరణాలు (98) నమోదు కాగా,  పశ్చిమ బెంగాల్ లో 40, కేరళలో 30 నమొదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005DLBY.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ZNLO.jpg

 

ప్రపంచ స్థాయిలో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలను (105.7) పోల్చినప్పుడు భారత్ లో ఇది చాలా తక్కువగా ఉంది.  పరీక్షల సంఖ్య పెంచటం, తొలిదశలొనే బాధితులను గుర్తించటం, సకాలంలో  ఐసొలేషన్ కు పంపటం లేదా ఆస్పత్రిలో చేర్చటం, ప్రామాణిక చికిత్సావిధానం అమలు చేయటం వల్ల రోజువారీ మరణాలు 400 లోపే ఉంచగలిగాం        

***



(Release ID: 1682373) Visitor Counter : 121