ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో 95 లక్షల మైలురాయి దాటిన కోలుకున్నకోవిడ్ బాధితుల సంఖ్య

ప్రపంచంలోనే అత్యధికంగా 95.40% చేరిన కోలుకున్నవారి శాతం

చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3.13 లక్షలకు తగ్గుదల

Posted On: 18 DEC 2020 11:25AM by PIB Hyderabad

ప్రపంచాన్ని వణికిస్తూ వస్తున్న కోవిడ్ మహమ్మారి మీద జరుగుతున్న పోరులో భారతదేశం ఈ రోజు మరో మైలురాయి లాంటి విజయాన్ని నమోదు చేసుకుంది.  కోలుకుంటున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూనే ఉంది. ఇప్పటివరక్కు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 95 లక్షలు దాటి నేటికి 95,20,827 అయింది.

కోలుకున్నవారి సంఖ్యకూ, ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్యకూ మధ్య తేడా విస్తృతమవుతూనే ఉంది. చికిత్సపొందుతూ ఉన్నవారికంటే కోలుకున్నవారు 92 లక్షలకు పైబడి 92,06,996 మంది అయ్యారు.  కోలుకున్నశాతం 95.40% చేరుకుంది. ఇంత పెద్ద శాతంలో కోవిడ్ బాధితులు కోలుకున్న కొద్ది దేశాలలో భారత్ ఒకటి. మొత్తం కోలుకున్నవారు ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికి 30 రెట్లు కావటం మరో విశేషం. దేశంలో ప్రస్తుతం 3,13,831 మంది చికిత్స పొందుతూ ఉండగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో వీరి వాటా  కేవలం 3.14% మాత్రమే.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BEWV.jpg

రోజూ నమోదవుతున్న కొత్త కేసులకంటే రోజూ కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24గంటలలో కొత్తగా  22,890  మంది మాత్రమే కోవిడ్ బారినపడ్డారు. అదే సమయంలో దేశంలో 31,087 మంది కోలుకున్నారు. ఇలా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులకంటే  కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం గత 21 రోజులుగా సాగుతూ ఉంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021UXM.jpg

దేశంలో మొత్తం కోలుకున్నవారిలో 52% (51.76%) మంది కేవలం ఐదు రాష్టాలకు చెందినవారే.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WHEL.jpg

కొత్తగా కోలుకున్నవారిలో 75.46% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు. వీరిలో కేరళలో గరిష్ఠంగా  4,970  మంది కోలుకోగా,  4,358 మంది మహారాష్టలోను, 2,747 మంది పశ్చిమ బెంగాల్ లోను  కోలుకున్నట్టు తేలింది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004T02Y.jpg

కొత్త కేసులలో 76.43% మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా 4,969 కొత్త కేసులు రాగా, ఆ తరువాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (2245), చత్తీస్ గఢ్ (1584) ఉన్నాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005UR9I.jpg

గత 24 గంటలలో 338 మంది కోవిడ్ బాధితులు మరణించారు. అందులో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 75.15% మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 65 మరణాలు నమోదు కాగా పశ్చిమ బెంగాల్ లో 44మంది,  ఢిల్లీలో 35మంది చనిపోయారు.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0064J7V.jpg

భారత దేశంలో రోజువారీ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 13 రోజులుగా మరణాల సంఖ్య 500 లోపే ఉంటూ వస్తోంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007HRXM.jpg

***

 

                                                                                                                                            

 


(Release ID: 1681672) Visitor Counter : 205