ప్రధాన మంత్రి కార్యాలయం

డిసెంబర్, 19వ తేదీన అసోచామ్ వ్యవస్థాపక వారోత్సవాలు-2020 లో కీలకోపన్యాసం చేయనున్న - ప్రధానమంత్రి

Posted On: 17 DEC 2020 8:04PM by PIB Hyderabad

అసోచామ్ వ్యవస్థాపక వారోత్సవాలు - 2020 సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, డిసెంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటల 30 నిముషాలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కీలకోపన్యాసం చేయనున్నారు.   ‘ఈ శతాబ్ధతపు అసోచామ్ వ్యాపార సంస్థ అవార్డు’ ను, టాటా గ్రూప్ సంస్థ తరపున శ్రీ రతన్ టాటా కు, ప్రధానమంత్రి,  ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు.

"అసోచామ్" గురించి :

భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమోటర్ ఛాంబర్స్ 1920 లో "అసోచామ్" ను స్థాపించారు. 400 కు పైగా ఛాంబర్లు, వాణిజ్య సంఘాలతో కూడిన ఈ సంస్థ, భారతదేశం అంతటా విస్తరించి ఉన్న 4.5 లక్షలకు పైగా సభ్యులకు సేవలు అందిస్తోంది.  భారతీయ పరిశ్రమకు చెందిన విజ్ఞాన విషయాలకు "అసోచామ్"  ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది. 

 

*****


(Release ID: 1681619) Visitor Counter : 112