22. ఇరు దేశాల మధ్య రైల్వే సంబంధాల పునరుద్ధరణకు 1965 సంవత్సరానికి పూర్వం సాధించిన పురోగతిని ఇరువురు ప్రధానమంత్రులు సంతృప్తిగా గుర్తుచేసుకున్నారు. హల్దిబారి (ఇండియా) మరియు చిలహతి (బంగ్లాదేశ్) మధ్య కొత్తగా పునరుద్ధరించబడిన రైల్వే మార్గాన్ని వారు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ రైలు మార్గం, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులు మెరుగుపడిన అనంతరం ఈ మార్గంలో రైళ్ళు నడపాలని నిర్ణయించారు.
23. రెండు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక అనుసంధాన చర్యల పురోగతిని, ఇరువురు నాయకులు సమీక్షించారు. అంతర్గత జల రవాణా మరియు వాణిజ్యానికి సంబంధించిన నియమ నిబంధనల (పి.ఐ.డబ్ల్యు.టి.టి) రెండవ అనుబంధంపై సంతకం చేయడం; కోల్‌కతా నుండి చటోగ్రామ్ ద్వారా అగర్తలాకు భారతీయ వస్తువుల రవాణా కోసం చేసే ట్రయల్ రన్; పి.ఐ.డబ్ల్యు.టి.టి. కింద సోనామురా-దౌడ్కండి ప్రోటోకాల్ మార్గం యొక్క కార్యాచరణ; తో సహా, ఇటీవలి కార్యక్రమాలను వారు స్వాగతించారు. ఛటో గ్రామ్ మరియు మొంగ్లా నౌకాశ్రయాల ద్వారా భారతీయ వస్తువుల రవాణాను వేగంగా అమలు చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు.
24. మెరుగైన కనెక్టివిటీని సులభతరం చేయడంతో పాటు, దేశాల మధ్య ప్రయాణీకులు, వస్తువుల కదలికను సులభతరం చేయడానికి, బంగ్లాదేశ్, భారత్, నేపాల్ దేశాలకు ఉపయోగపడే విధంగా, వస్తువులు మరియు ప్రయాణీకుల కదలికలను ప్రారంభించడానికి వీలుగా, భూటాన్ కొన్ని రోజుల తర్వాత ఈ ఒప్పందంలో చేరడానికి అవకాశం కల్పిస్తూ, అవగాహనా ఒప్పందంపై, వెంటనే సంతకాలు చేయడం ద్వారా, బి.బి.ఐ.ఎన్. మోటారు వాహనాల ఒప్పందాన్ని తొందరగా కార్యాచరణలో పెట్టడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.
25. ప్రస్తుతం కొనసాగుతున్న భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టుపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, తీవ్ర ఆసక్తిని వ్యక్తం చేశారు. దక్షిణ మరియు ఆగ్నేయాసియా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ ని పెంచే ఉద్దేశ్యంతో బంగ్లాదేశ్ కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానం కావడానికి, ఆమె, భారతదేశం యొక్క మద్దతు కోరారు. అదే స్ఫూర్తితో, పశ్చిమ బెంగాల్ (హిల్లి) నుండి మేఘాలయ (మహేంద్రగంజ్) వరకు బంగ్లాదేశ్ మీదుగా కనెక్టివిటీ ని అనుమతించాలని భారతదేశం తరఫున బంగ్లాదేశ్‌ను కోరడం జరిగింది.
26. అగర్తాలా-అఖౌరాతో ప్రారంభించి, భారతదేశం మరియు బంగ్లాదేశ్ లకు చెందిన ప్రతి పొరుగు రాష్ట్రానికీ మధ్య కనీస ప్రతికూల జాబితాతో కనీసం ఒక ల్యాండ్ పోర్టును కలిగి ఉండాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను, భారతదేశం, పునరుద్ఘాటించింది. ఛటోగ్రామ్ నౌకాశ్రయం నుండి ఈశాన్య భారతదేశానికి సరుకుల రవాణా కోసం, ఫెని వంతెన నిర్మాణం పూర్తియైన తర్వాత బంగ్లాదేశ్ ట్రక్కులను అనుమతించాలని, బంగ్లాదేశ్ ప్రతిపాదించింది.
27. ఇరు దేశాల మధ్య ఉత్సాహభరితమైన అభివృద్ధి భాగస్వామ్యాన్ని అంగీకరించి, ఎల్.ఓ.సి. ప్రోజెక్టులు త్వరగా పూర్తికావడానికి వీలుగా, వాటి పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడానికి, బంగ్లాదేశ్ కు చెందిన ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి, ఢాకాలోని భారత హైకమిషనర్ ల నేతృత్వంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ చురుకుగా పనిచేయాలని, ఇరు పక్షాలు నొక్కిచెప్పాయి.
28. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇరువైపుల ప్రయాణికుల అత్యవసర అవసరాలను సులభతరం చేయడానికి రెండు వైపుల మధ్య తాత్కాలిక ఎయిర్ ట్రావెల్ బబుల్ ప్రారంభించడాన్ని ఇరుపక్షాలు సంతృప్తిగా గుర్తించాయి. ల్యాండ్ పోర్టుల ద్వారా బంగ్లాదేశ్ వైపు నుంచి రెగ్యులర్ ప్రయాణాలను, త్వరగా ప్రారంభించాలని భారతదేశం కోరింది
నీటి వనరులు, విద్యుత్తు మరియు ఇంధనంలో సహకారం:
29. రెండు ప్రభుత్వాలు, 2011 సంవత్సరంలో అంగీకరించినట్లుగా, తీస్తా జలాలను పంచుకోవడానికి మధ్యంతర ఒప్పందంపై ముందస్తు సంతకం చేయవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి షేక్ హసీనా ఎత్తిచూపారు. ఆ విషయంలో, భారతదేశ హృదయపూర్వక నిబద్ధతనూ, నిరంతర కృషినీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పునరుద్ఘాటించారు.
30. మను, ముహూరి, ఖోవై, గుమ్తి, ధర్లా, దుధ్ కుమార్ అనే ఆరు ఉమ్మడి నదుల జలాలను పంచుకోవడంపై మధ్యంతర ఒప్పందం ముసాయిదాను వెంటనే రూపొందించాల్సిన అవసరాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారు.
31. కుషియారా నదీ జలాలను నీటిపారుదల అవసరాల కోసం ఉపయోగించుకోవటానికి రహీంపూర్ ఖల్ యొక్క మిగిలిన భాగాన్ని తవ్వకం పనులను అనుమతించాలని, తమ సంబంధిత సరిహద్దు అధికారులకు తెలియజేయాలని, బంగ్లాదేశ్, భారతదేశాన్ని కోరింది. కుషియారా నది నీటిని పంచుకోవటానికి సంబంధించిన ఒప్పందం / ఒప్పందంపై సంతకం పెండింగ్‌లో ఉన్నందువల్ల, కుషియారా నది నుండి నీటిని రెండు వైపులా ఉపసంహరించుకోవడాన్ని పర్యవేక్షించడానికి ఇరు దేశాల మధ్య సంతకం చేయబోయే ప్రతిపాదిత అవగాహన ఒప్పందంపై ముందస్తు అనుమతినివ్వాలని కూడా భారతదేశం కోరింది. ఉమ్మడి నదుల కమిషన్ సానుకూల సహకారాన్ని ఇరువురు నాయకులు గుర్తుచేసుకున్నారు. తదుపరి విడత కార్యదర్శుల స్థాయి జె.ఆర్.సి. సమావేశం సాధ్యమైనంత త్వరగా జరగాలని వారు ఎదురు చూశారు.
32. ప్రైవేటు రంగానికి మధ్య విద్యుత్, ఇంధన రంగంలో బలమైన సహకారం పట్ల ఇరువర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్‌లైన్, మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి అంగీకారం కుదిరింది. జీవ ఇంధనాలతో సహా విద్యుత్తు సామర్థ్యం మరియు స్వచ్ఛమైన విద్యుత్తు సహకారాన్ని పెంచడానికి కూడా అంగీకరించబడింది. హరిత, పరిశుభ్రమైన, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వెళ్ళడానికి ఇరు దేశాల నిబద్ధతకు అనుగుణంగా, నేపాల్ మరియు భూటాన్లతో సహా ఉప ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించబడింది. విద్యుత్ మరియు శక్తి అనుసంధాన రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
మయన్మార్ లోని రాఖైన్ రాష్ట్రం నుండి బలవంతంగా నిర్వాశితులైన వ్యక్తులు
33. మయన్మార్ రాఖైన్ రాష్ట్రం నుండి బలవంతంగా నిర్వాశితులైన 1.1 మిలియన్ల మందికి ఆశ్రయం కల్పించడంలోనూ, మానవతా సహాయం అందించడంలోనూ, బంగ్లాదేశ్ చూపిన ఔదార్యాన్ని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. తమ సురక్షితమైన, వేగవంతమైన, స్థిరమైన రాబడి యొక్క ప్రాముఖ్యతను ప్రధానమంత్రులిద్దరూ, పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశంగా భారత్ ఎన్నికైనందుకు బాంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అభినందించారు. బలవంతంగా నిర్వాశితులైన రోహింగ్యాలను మయన్మార్ కు తిరిగి రప్పించడానికి ఇండియా సహాయం చేయాలని, బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు, ఆమె తెలియజేశారు.
ప్రాంతం మరియు ప్రపంచంలోని భాగస్వాములు
34. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికలలో భారతదేశానికి సహకరించినందుకు, బాంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి చెందిన ప్రారంభ సంస్కరణలను సాధించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, సుస్థిరాభివృధి లక్ష్యాలను (ఎస్.డి.జి.లను) సాధించడంతో పాటు వలసదారుల హక్కుల పరిరక్షణ కోసం కలిసి పనిచేయాలని ఇరుదేశాలు అంగీకరించాయి. 2020-ఎజెండా లో పేర్కొన్న విధంగా ఎస్.డి.జి. లను అమలు చేసే మార్గాలను నిర్ధారించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యం కింద అభివృద్ధి చెందిన దేశాలు తమ కట్టుబాట్లను నెరవేర్చాల్సిన అవసరాన్ని ఇద్దరు ప్రధానమంత్రులూ, పునరుద్ఘాటించారు.
35. కోవిడ్-19 వ్యాప్తి తరువాత ప్రాంతీయ పరిస్థితులతో పాటు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను బట్టి, సార్క్ మరియు బిమ్స్టెక్ వంటి ప్రాంతీయ సంస్థలకు ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉందని ఇరువురు నాయకులు ప్రధానంగా పేర్కొన్నారు. కోవిడ్-19 వ్యాప్తి చెందిన నేపథ్యంలో, 2020 మార్చి నెలలో సార్క్ సభ్య దేశాల నాయకుల వీడియో కాన్ఫరెన్సు ను ఏర్పాటు చేసినందుకు, భారత ప్రధానమంత్రి కి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ మహమ్మారి ప్రభావాలను ఎదుర్కోవడానికి సార్క్ అత్యవసర ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినందుకు, ఆమె, భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సార్క్ వైద్య, ప్రజారోగ్య పరిశోధనా సంస్థ ఏర్పాటు ప్రతిపాదనను బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పునరుద్ఘాటిస్తూ, ఈ విషయంలో భారత్ మద్దతును కోరారు. బంగ్లాదేశ్ 2021 సంవత్సరంలో ఐ.ఓ.ఆర్.ఏ. చైర్మన్ పదవిని చేపట్టనున్న నేపథ్యంలో, మరింతగా సముద్ర భద్రత మరియు రక్షణ కోసం కృషి చేయడానికి వీలుగా భారతదేశం యొక్క మద్దతును అభ్యర్థించారు. ప్రస్తుత పదవీకాలంలో పర్యావరణ ప్రభావిత వేదిక లో బంగ్లాదేశ్ అధ్యక్ష పదవిని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు.
36. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు కృషిని ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రశంసించారు. ఈ సంస్థలో చేరవలసిందిగా బంగ్లాదేశ్ ను ఆహ్వానించినందుకు, ఆమె, భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా పలు రంగాల్లో బ్యాంకు చేసిన కృషిని ఆమె స్వాగతిస్తూ, ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవడానికి బంగ్లాదేశ్ తమ సుముఖతను వ్యక్తం చేసింది.
ద్వైపాక్షిక పత్రాలపై సంతకాలు మరియు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు
37. ఈ సందర్భంగా, భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు చెందిన అధికారులు ఈ క్రింది ద్వైపాక్షిక పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు:
* హైడ్రోకార్బన్ రంగంలో సహకారం కోసం కార్యాచరణ తో కూడిన అవగాహన (ఎఫ్.ఓ.యు);
* ఇరుదేశాల సరిహద్దుల వెంబడి ఏనుగుల సంరక్షణ పై నియమ,నిబంధనలు;
* స్థానిక సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు (హెచ్.ఐ.సి.డి.పి.లు) అమలు కోసం భారత ఆర్ధిక సహాయానికి సంబంధించిన అవగాహనా ఒప్పందం;
* బారిషల్ నగర కార్పొరేషన్ కోసం పరికరాల సరఫరా మరియు లామ్ చోరీ ప్రాంతంలోని చెత్త, ఘన వ్యర్ధ పదార్ధాల నిర్మూలన మైదానం మెరుగుదలపై అవగాహన ఒప్పందం;
* భారత-బంగ్లాదేశ్ సి.ఈ.ఓ. ల సంఘం నిబంధనలు;
* బాంగ్లాదేశ్, ఢాకా లోని జాతిపిత, బంగాబందు షేక్ ముజిబుర్ రెహ్మాన్ మెమోరియల్ మ్యూజియం, మరియుభారతదేశం, న్యూ ఢిల్లీ లోని, జాతీయ మ్యూజియం మధ్య అవగాహన ఒప్పందం;
* వ్యవసాయ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం.
ఈ సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టులు :
* రాజా షాహి నగరంలో సుందరీకరణ మరియు నగర అభివృద్ధి ప్రాజెక్టు;
* ఖుల్నాలో ఖలీష్పూర్ కాలేజియేట్ బాలికల పాఠశాల నిర్మాణం;
38. ప్రస్తుతం నెలకొన్న నూతన అసాధారణ పరిస్థితుల మధ్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రులు ఇద్దరూ ఒకరికొకరు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
39. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవ 50వ వార్షికోత్సవం మరియు బంగ్లాదేశ్-భారతదేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలలో పాల్గొనడానికి, 2021 మార్చి నెలలో తమ దేశాన్ని సందర్శించాలన్న తమ ఆహ్వానాన్ని అంగీకరించినందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి కృతజ్ఞతలు తెలిపారు.
*****