ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొత్త కేసులను మించి కోలుకుంటున్నవారు:
పెరుగుతున్న కోలుకున్నవారి శాతం
Posted On:
17 DEC 2020 11:11AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వంతోబాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వ్యూహాత్మకంగా ప్రత్యేకంగా దృష్టి సారించిన ఫలితంగా భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకొని బైటపడుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య, మరణాల సంఖ్య కూడా వేగంగా తగ్గుతూ వస్తున్నాయి. .
కొత్తగా నమోదవుతున్న కోవిడ్ పాజిటివ్ కెసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉందటం వల్ల కోలుకున్నవారి శాతం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 95 లక్షలకు చేరువలో 94, 89,740 గా నమోదైంది. కోలుకున్నవారి శాతం మెరుగుపడి 95.31% కి చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్యతేడా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 91,67,374 కి చేరింది. కోలుకునేవారు పెరుగుతున్నకొద్దీ చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య తగ్గుతూ ఉంది. దీంతో ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్నవారు 3,22,366 కి తగ్గారు. వీరు మొత్తం పాజిటివ్ కేసులలో 3.24% మాత్రమే.
భారత్ లో కోలుకుంటున్నవారి శాతం అంతర్జాతీయంగా పోల్చినప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 70.27% కాగా భారత్ లో 95.31% నమోదైంది, అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇటలీ లాంటి దేశాల్లో భారత్ కంటే తక్కువశాతం కోలుకున్నారు.
జాతీయ స్థాయిలో నమోదవుతున్న పరిస్థితికి అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా కోలుకుంటున్నవారి శాతం నమోదైంది.
భారత్ లో గడిచిన 24 గంటలలో కోలుకున్నవారి సంఖ్య 33,291 కాగా వారిలో 75.63% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు. అత్యధికంగా కేరళలో 5,728 మంది కోలుకోగా, మహారాష్ట్రలో 3887 మంది, పశ్చిమ బెంగాల్ లో 2,767 మంది కోలుకున్నారు.
గడిచిన 24 గంటలలో 24,010 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 78.27% కేసులు పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచే వచ్చాయి. కేరళలో అత్యధికంగా 6,185 కొత్త కెసులు నమోదు కాగా, ఆ తరువాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (2,293), చత్తీస్ గఢ్ (1,661) ఉన్నాయి.
గత 24 గంటలలో 355 మరణాలు నమోదు కాగా అందులో 79.15% మరణాలు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి. 26.76% (95) మరణాలు ఒక్క మహారాష్ట్రలోనే సంభవించగా పశ్చిమ బెంగాల్ లో 45 మంది, ఢిల్లీలో 32 మంది చనిపోయారు. .
రోజువారీ మరణాల సంఖ్య భారత్ లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం కోవిడ్ కేసులలో మరణాలు 1,45% గా నమోదయ్యాయి. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు భారత్ లో మరణాల శాతం చాలా తక్కువగా ఉంది.
****
(Release ID: 1681408)
Visitor Counter : 190
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam