ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో తగ్గుదలబాటలోనే చికిత్సలో ఉన్న కేసులు; నేటికి 3.32 లక్షలు

17 రోజులుగా రోజువారీ కేసులు 40 వేల లోపే

11 రోజులుగా రోజువారీ మరణాలు 500 లోపు

Posted On: 16 DEC 2020 12:55PM by PIB Hyderabad

చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య భారీగా తగ్గుదలబాటలో సాగుతూ ఉంది. ప్రస్తుతం దేశంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య  3,32,002 కు తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా 3.34% కు తగ్గింది. గడిచిన 24 గంటలలో  కేవలం 26,382 మంది మాత్రమే తాజాగా పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు.   అదే సమయంలో  33,813 మంది కోలుకోవటంతో నికరంగా చికిత్స పొందుతున్నవారిలో 7,818 కెసులు తగ్గినట్టయింది. గత 17 రోజులుగా భారత్ లో కొత్త కెసుల సంఖ్య 40 వేల లోపే ఉంటోంది.

గత వారం రోజులుగా వస్తున్న కొత్త కోవిడ్ కేసులు చూస్తే, అవి ప్రతి పది లక్షల జనాభాలో ప్రపంచంలోనే అతి తక్కువగా 147 గా నమోదయ్యాయి. 

 

మొత్తం కోలుకున్నవారి సంఖ్య 94.5 లక్షలు దాటి 9,456,449 కు చేరింది. కోలుకున్నవారి శాతం కూడా 95.21% కు పెరిగింది. కోలుకున్నవారిలో 76.43% మంది కేవలం 10 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే. క్రళలో అత్యధికంగా ఒక్క రోజులో  5,066 మంది కోలుకోగా ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర ( 4,395 మంది), పశ్చిమ బెంగాల్ లో (2,965 ) మంది నమోదయ్యారు. 

 

కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులలో 75.84%  కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. అత్యధిక కొత్త కేసుల నమోదులో కేరళ ముందుండగా అక్కడ 5,218 కేసులు వచ్చాయి. ఆ తరువాత స్థానాల్లో ఉన్న మహారాష్టలో 3,442, పశ్చిమబెంగాల్ లో 2,289 కేసులు వచ్చాయి.

గడిచిన 24 గంటలలో 387 మంది కొవిడ్ బాధితులు మరణించారు.  అందులో  75.19% మరణాలు 10 రాష్ట్రాలలోనే నమొదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 70 మంది చనిపోగా, పశ్చిమ బెంగాల్ లో 45 మంది, ఢిల్లీలో 41 మంది చనిపొయారు.  

రోజువారీ కోవిడ్ మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. గత 11 రోజులలో ప్రతి రోజూ 500 లోపే ఉంటూ వచ్చాయి. 

 

ప్రతి పది లక్షలమందిలో కోవిడ్ మరణాలు గత వారం రోజుల్లో సగటున 2. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్య.

***



(Release ID: 1681056) Visitor Counter : 182