ప్రధాన మంత్రి కార్యాలయం

కువైట్ ప్రధాని గా తిరిగి నియమితులైన శ్రీ శేఖ్ సబా అల్-ఖాలెద్ అల్-హమద్ అల్-సబా ను అభినందించిన ప్రధాన మంత్రి


प्रविष्टि तिथि: 08 DEC 2020 10:48PM by PIB Hyderabad

కువైట్ ప్రధాని గా తిరిగి నియమితులైన మాన్య శ్రీ శేఖ్ సబా అల్-ఖాలెద్ అల్-హమద్ అల్-సబా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

‘‘డిసెంబర్ 5 న జాతీయ అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన తరువాత, కువైట్ ప్రధాని పదవిలో తిరిగి నియమితులైన మాన్య శ్రీ శేఖ్ సబా అల్-ఖాలెద్ అల్-హమద్ అల్-సబా కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

మన మధ్య గల శ్రేష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు విస్తరిస్తూ ఉండగలవని, అవి కువైట్ అమీర్, గౌరవనీయులు శ్రీ శేఖ్ నవాఫ్ అల్-అహమద్ అల్-జాబెర్ అల్-సబా దార్శనికత తో కూడినటువంటి నాయకత్వం లో వర్ధిల్లుతాయన్న నమ్మకం నాకుది’’ అని వరుస ట్వీట్ లలో శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

 

 

****


(रिलीज़ आईडी: 1679282) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam