ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

140 రోజుల తరువాత చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4 లక్షల దిగువకు

ప్రతి పది లక్షల్లో కేసులు, మరణాలు ప్రపంచంలోనే అతి తక్కువ

157 రోజుల తరువాత రోజువారీ మరణాలు 400 లోపు

Posted On: 07 DEC 2020 11:06AM by PIB Hyderabad

భారతదేశం ఈ రోజు కీలకమైన మైలురాయిని చేరుకుంది. దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 4 లక్షలకంటే తక్కువకు ( 3,96,729) చేరింది. ఇది మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో 4.1% మాత్రమే. 140 రోజుల తరువాత ఈ తక్కువ స్థాయికి చేరింది. గత జులై 20న చికిత్సలో ఉన్న వారు 3,90,459 కాగా ఇప్పుడు ఇంకా తగ్గింది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZHQY.jpg

గత 10 రోజులుగా సాగుతున్న ధోరణినే కొనసాగిస్తూ, కొత్తగా వస్తున్న పాజిటివ్ కేసులకంటే ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నారు. గడిచిన 24 గంటలలో కొత్తగా 32,981 పాజిటివ్ కేసులు నమోదు కాగా 39,109 మంది కోలుకున్నారు. దీంతో తేడా  6,128 కేసుల వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 6,519 తగ్గింది.  ప్రతి పది లక్షల జనాభాలో వస్తున్న కొత్త కేసులు గత వారం రోజులుగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులకంటే తక్కువగా ఉంది. గత వారం రోజుల కొత్త కేసులు ప్రతి పది లక్షలకు 182 గా నమోదయ్యాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002M42I.jpg

ప్రతి పది లక్షల జనాభాలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య  కూడా భారత్ లో చాలా తక్కువగా ఉంది. అంతర్జాతీయ సగటు 8,438 కాగా భారత్ లో అది  6,988 గా నమోదైంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034KWW.jpg

కొత్తగా నమోదవుతున్న కేసులకంటే కోలుకుంటున్నవారు అధికంగా ఉంటున్నారు. దీనివలన కూడా కోలుకున్నవారి శాతం పెరిగి  ప్రస్తుతం అది 94.45% అయింది. ఐప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల మొత్తం సంఖ్య 91,39,901 అయింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా 87 లక్షలు దాటి 87,43,172 కు చేరింది.

కొత్తగా కోలుకున్నవారిలో 81.20% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక రోజులో  7,486 మంది కోలుకున్నారు. ఆ తరువాత స్థానాల్లో ఉన్న కేరళలో  5,217 మంది, ఢిల్లీలో  4,622 మంది కోలుకున్నట్టు నమోదైంది.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IJGM.jpg

గత 24 గంటలలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 76.20%  కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. ఇందులో కేరళలో అత్యధికంగా 4,777 కొత్త కేసులు రాగా, మహారాష్ట్రలో  4,757, పశ్చిమ బెంగాల్ లో  3,143 నమోదయ్యాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0052MCK.jpg

గత 24 గంటలలో 391 మరణాలు నమోదయ్యాయి. అందులో 10 రాష్టాలలోనే 75.07% మరణాలున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 69 మంది మరణించగా  పశ్చిమ బెంగాల్ లో 46 మంది, మహారాష్ట్రలో 40 మంది చనిపోయారు.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006DZX2.jpg

ప్రతి రోజూ నమోదవుతున్న కోవిడ్ మరణాలను ప్రతి 10 లక్షల జనాభాకు లెక్కించి చూస్తే, అంతర్జాతీయంగా పోల్చి చూసినపుడు కూడా భారత్ లో అతి తక్కువగా పది లక్షల జనాభాకు మూడు మాత్రమే ఉన్నాయి.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007S5VU.jpg

ఎప్పటికప్పుడు మొత్తం మరణాల జాబితా చూసినా, దేశంలో ప్రతి పది లక్షలమందిలో నమోదైన మరణాలు 101 కాగా  అది ప్రపంచంలోనే అతి తక్కువ. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008FIEK.jpg         

 

****



(Release ID: 1678789) Visitor Counter : 215