PIB Headquarters

కోవిడ్ -19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 04 DEC 2020 5:40PM by PIB Hyderabad

Coat of arms of India PNG images free download

(కోవిడ్ కి సంబంధించి గత 24 గంటలలో జారీచేసిన పత్రికాప్రకటనలు, పిఐబి క్షేత్రస్థాయి అధికారులు సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఇందులో ఉంటాయి)

  • * భారత్ లో ఇంకా చికిత్సలో ఉన్నవారి శాతం ఈ రోజు 4.35% కు చేరింది.
  • *గత 24 గంటలలో 36,595 మందికి కరోనా సోకినట్టు పరీక్షలలో తేలింది.  
  • * ఇదే సమయంలో 42,916 కొత్తగా కరోనా నుంచి బైటపడ్దారు.  
  • * ప్రతి పదిలక్షల జనాభాలో కరోనాబారినపడినవారి సంఖ్య ప్రపంచ స్థాయిలో 6,936కాగా, పశ్చిమార్థ గోళం కంటే భారత్ లో బాగా తక్కువగా ఉంది. 
  • * కోలుకున్నవారి శాతం మెరుగుపడి 94.2% కు చేరింది.
  • *కోవిడ్ వాక్సిన్ పంపిణీ వ్యూహం మీద ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో చర్చ;  ఎనిమిది వాక్సిన్లు చివరి దశ పరీక్షలలో ఉండగా అందులో మూడు స్వదేశీ తయారీ అని వెల్లడి

Image

భారత్ లో మొత్తం కోవిడ్ కేసులలో చికిత్సపొందుతున్నవారు 4.35 శాతానికి తగ్గుదల; వారం రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ; మొత్తం కోలుకున్నవారి 90 లక్షలకు పైమాటే

భారతదేశంలో కోవిడ్ బారిన పడిన మొత్తం జనాభాలో ఇంకా చికిత్సపొందుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. నిన్నటివరకు చికిత్సలో ఉన్న బాధితుల శాతం 4.44 కాగా ఈ రోజు అది 4.35 శాతానికి తగ్గింది. ఈ ధోరణి గత వారం రోజులుగా కొనసాగుతూ వస్తోంది. గత 24 గంటలలో కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 4,16,082 కు చేరింది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తహా 36,595 మందికి కోవిడ్ సోకినట్టు తేలగా, 42,916 మంది కొత్తగా కోలుకున్నారు.  ఆ విధంగా ఈ తేడా అయిన  6,321 నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలకు దోహదం చేసినట్టయింది.   ప్రతి పది లక్షలమంది జనాభాలో కోవిడ్ బారిన పడిన వారు భారత్ లో 6936 మందిగా నమోదుకాగా ఇది అంతర్జాతీయంగా చూస్తే చాలా తక్కువ. పశ్చిమార్థ గోళంలోని అనేక దేశాల్లో ఇది చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది.

కోలుకున్నవారి శాతం మరింత మెరుగుపడి ఈరోజుకు 94.2% అయింది. ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య  90,16,289 కు చేరింది. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం 86,00,207 కు చేరింది. కొత్తగా కోలుకున్న కేసులలో 80.19% మంది పది రాష్ట్రాలకు చెందినవారున్నారు. అందులో మహారాష్టలో  అత్యధికంగా 8,066 మంది, కేరళలో 5,590 మంది, ఢిల్లీలో  4,834 మంది కోలుకున్నారు.  కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో75.76% కేసులు 10 రాష్టాలలో నమోదు కాగా నిన్న కేరళలో కొత్తగా 5,376 కేసులు, మహారాష్టలో  5,182 కేసులుఢిల్లీలో 3,734 కేసులు తేలాయి.  గడిచిన 24 గంటలలో 540 మరణాలు నమోదయ్యాయి. వాటిలో  77.78% కేవలం 10 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లొనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 115 మరణాలు నమోదు కాగా ఢిల్లీలో 82 మంది, పశ్చిమ బెంగాల్ లో 49 మంది చనిపోయినట్టు తేలింది. అంతర్జాతీయంగా చూసినప్పుడు భారత్ లో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు అతి తక్కువగా 101 నమోదయ్యాయి. 

 

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678251

కోవిడ్ వాక్సిన్ పంపిణీ వ్యూహాన్ని చర్చించటానికి ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం: మూడు స్వదేశీ వాక్సిన్లతో సహా మొత్తం ఎనిమిది వాక్సిన్ల ప్రయోగాలు భారత్ లో జరుగుతున్నట్టు ప్రధాని వెల్లడి

 

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం జరిగింది. కోవిడ్-19 వాక్సిన్ ఇచ్చే వ్యూహం మీద ఈ సమావేశం చర్చించింది. ప్రభుత్వం ఈ విషయంలో ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నదని ప్రధాని ఈ సందర్భంగా తెలియజేశారు. సురక్షితమైన, అందుబాటు ధరలో దొరికే వాక్సిన్ రూపకల్పన కోసం యావత్ ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నదన్నారు. అహమ్మదాబాద్, పూణె, హైదరాబాద్ నగరాలలో వాక్సిన్ తయారవుతున్న కేంద్రాలను తాను సందర్శించిన విషయాలను ప్రధాని ఈ అఖిలపక్ష సమావేశంలో పంచుకున్నారు. తగిన సామర్థ్యమున్న ఎనిమిది వాక్సిన్లు ఇప్పుడు వివిధ దశల ప్రయోగాలలో ఉన్నాయన్నారు. అందులో మూడు స్వదేశీ వాక్సిన్లు అని కూడా వెల్లడించారు.  వీటన్నిటి తయారీ భారత్ లోనే ఉంటుందని చెబుతూ మరికొద్ది వారాల్లోనే వాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. శాస్త్రవేత్తలు ఆమోదముద్ర వేసిన వెంటనే వాక్సిన్ పంపిణీ మీద పెద్ద ఎత్తున ప్రచారం మొదలవుతుందని చెప్పారు. వాక్సినేషన్ లో ఎవరెవరికి ప్రాధాన్యమివ్వాలనే విషయంలో ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా రాష్టాలను కోరామని, రాష్ట్రప్రభుత్వాలతో కలసి వ్యూహరచన చేస్తున్నామని ప్రధాని వివరించారు. ఇప్పటికే టీకాల విషయంలో విస్తృతమైన నెట్ వర్క్ ఉన్నందున భారత్ లో పంపిణీ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రవానా, శీతల గిడ్డంగులలో నిల్వ వంటి విషయాలలో రాష్ట్రాలతో సమన్వయం సాధిస్తున్నామన్నారు.

 

వివరాలకోసం : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678345

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని ముగింపు పలుకుల పాఠం కోసం: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678314

 

మాజీ ప్రధాని స్వర్గీయ ఐకె గుజ్రాల్ స్మారక తపాలాబిళ్ళను విడుదలచేసిన ఉపరాష్టపతి 

 

భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు ఈ రోజు మాజీ ప్రధాని శ్రీ ఐకె గుజ్రాల్ కు ఘనంగా నివాళులర్పించారు. వర్చువల్ రూపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన శ్రీ గుజ్రాల్ గౌరవార్థం తపాలా శాఖ రూపొందించిన స్మారక  తపాలా బిళ్లను విడుదల చేశారు. విజ్ఞానవంతుడైన శ్రీ గుజ్రాల్ మితభాషి అని, హుందాతనం కలిగిన రాజకీయ నాయకుడని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా శ్రీ గుజ్రాల్ ను గుర్తుచేసుకున్నారు. ఎన్నో కష్టాలు,  సవాళ్లు ఎదురైనా, విలువలకు కట్టుబడి రాజీలేని రాజకీయ జీవితం గడిపారన్నారు. అందరితో సత్సంబంధాలు నెరపుతూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి గురించి ప్రస్తావిస్తూ, ఎవరూ ఎట్టిపరిస్థితుల్లోనూ  నిర్లక్ష్యం వహించకుండా మాస్క్ ధరించటం, చేతులు శుభ్రపరచుకోవటం, భౌతిక దూరం పాటించటం సహా అన్ని విధాలా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.

 

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678477

 

 

పిఐబి క్షేత్ర స్థాయి అధికారులు అందించిన సమాచారం

  • అస్సాం: అస్సాం లో నిన్న 28,008 కోవిడ్ పరీక్షలు జరపగా 165 పాజిటివ్ కేసులు బైటపడ్దాయి. దీంతో పాజిటివ్ శాతం  0.59% గా నమోదైంది.  గత 24 గంటలలో177 మంది బాధితులు కోలుకున్నారు. . ఇప్పటిదాకా మొత్తం కేసులు  2,13,336 కాగా వారిలో 97.89% కోలుకున్నారు. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు  1.64% మాత్రమేనని రాష్ట ఆరోగ్యశాఖామంత్రి ట్వీట్ చేశారు. 
  • మణిపూర్: మరో మూడు మరణాలు నమోదు కావటంతో మొత్తం మరణాల సంఖ్య 296 కు చేరింది. మరో రెండు మరణాలను అధికారికంగా ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. 
  • మేఘాలయ: మేఘాలయలో గత 24 గంటలలో మరో రెండు మరణాలు నమోదై మొత్తం మరణాల సంఖ్యను 116కు చేర్చింది.  52 కొత్త పాజిటివ్ కేసులు రాగా  ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 648 కి చేరింది. .
  • సిక్కిం: కొత్తగా 27 కేసులు రావటంతో చికిత్సలో ఉన్నవారి సంక్య  320 అయింది.
  • మహారాష్ట్ర: వాక్సిన్ కు ఆమోదముద్ర పడిన వెంటనే నెల రోజుల్లో కోటిమందికి  కోవిడ్ వాక్సిన్ వేయటానికి బృహన్ ముంబయ్ నగరపాలక సంస్థ సిద్ధమైంది. ఇందుకోసం వాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించింది.  ముందుగా ముంబయ్ వాసులకు వాక్సిన్ ఇస్తారు. వైద్య సిబ్బందికి, ఘనరూప వ్యర్థాల నిర్వహణ సిబ్బందికి, పోలీసులకు, 50 ఏళ్ళు పైబడ్డ ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో వాక్సిన్ ఇస్తారు.  
  • గుజరాత్:  గుజరాత్ లో తాజాగా 1,540 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  13 మరణాలు సంభవించాయి.  దీంతో రాష్ట్రంలో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 2,14,309 కి పెరిగింది.  మృతుల సంఖ్య  4,031 కి చేరింది. నిన్న 1,427 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇలా ఉండగా మాస్క్ ధరించని వారితో తప్పనిసరిగా కోవిడ్ కేంద్రాలలో సమాజ సేవ చేయించాలని గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలమీద సుప్రీం కోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. గుజరాత్ లో చికిత్సలో ఉన్న వారి సంఖ్య  14,913 కు చేరింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో తాజాగా మరో 2,086 కోవిడ్ కేసులు నమోదు కాగా  20 మంది చనిపోయారు.  దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య  2,74,486 కు చేరింది.  మొత్తం మరణాలు2,370 కి పెరిగాయి.  గరిష్ఠంగా జైపూర్ నుంచి 590 కొత్త కేసులు రాగా, జోధ్ పూర్ లో 201,  కోటలో149 నమోదయ్యాయి. రాష్ట్రంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య  25,544 కు చేరింది.
  • మధ్యప్రదేశ్:  గురువారం నాడు మధ్య ప్రదేశ్ లో  1,450 తాజా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,374 కు చేరింది.  కొత్తగా13 మరణాలు నమొదు కాగా మొత్తం మృతుల సంఖ్య  3,300 కి చేరింది. 1,450 కొత్త కెసులలో ఒక్క ఇండోర్ జిల్లాలోనే 560, భోపాల్ లో 375  నమోదయ్యాయి.
  • కేరళ:  కేరళకు చెందిన వామపక్ష ఎంపీలు ఈరోజు ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. కోవడ్ వాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విధంగా డోసుకు రూ.2500 సామాన్యులకు అందుబాటులో ఉండదన్నారు.   ఇల ఉండగా రాష్ట్రంలో ఒకరోజు మరణాలలో రికార్డు సృష్టిస్తూ  31 మరణాలు నమోదు చేసుకుంది.  కొత్తగా 5,376 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రోజువారీ పాజిటివ్ శాతం 8.89 కి తగ్గింది.  అదే సమయంలో వ్యాధి నియంత్రణలో భాగంగా రద్దీగా ఉండే మార్కెట్ల దగ్గర జాగ్రత్తలు పెంచటం కోసం ప్రతి మార్కెట్ దగ్గర కేంద్రం ప్రతిపాదించిన ప్రామాణిక ఆచరణావిధానాలు అమలు చేసేలా ఒక ఉప సంఘాన్ని నియమించాలని నిర్ణయించింది.  
  • తమిళనాడు:  తమిళనాడులోని దక్షిణ రాష్ట్రాలలో తుపాని బురెవి వలన భారీవర్షాలు పడతాయని భయపడినా, అంచనా వేసినంత భారీ వర్షాలు కురవలేదు. కొత్త వ్యవసాయ చట్టాలు తమిళనాడు రైతులను ఎంతమాత్రమూ ఇబ్బంది పెట్టబోవని ముఖ్యమంత్రి ఎదప్పాడి పళనిస్వామి అన్నారు. పైగా, రైతులను నష్టాల బారినుంచిచి కాపాడతాయన్నారు. హస్తంపట్టిలోని సర్క్యూట్ హౌస్ లో అధికారులతో జరిగిన సమీక్షాసమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.  వ్యవసాయోత్పత్తులు అధికంగా పండిస్తే ధర తగ్గటం సహజమని, అయితే, ఈ కొత్త చట్టం వలన ముందు చెప్పిన ధరకే అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.
  • కర్నాటక: క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రిపూట కర్ఫ్యూ ఉండబోదని కర్నాటక మంత్రులు సూచనప్రాయంగా వెల్లడించారు. కర్ఫ్యూ అవసరం ఉండదని ఆరోగ్యమంత్రి డాక్టర్ సుధాకర్ కూదా వారితో అంగీకరించారు. అయితే ఈ వేడుకల అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలా ఉండగా హోం మంత్రి బసవరాజ్ బొమ్మై మాత్రం క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సమయంలో కర్ఫ్యూ కాకుండా ఇతర మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తున్నదన్నారు.  అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠడ్శాలల విద్యార్థులకు పాలు అందించే క్షీర భాగ్య పథకాన్ని పునఃప్రారంభించాలని పలువురు పోషకాహార నిపుణులు, డాక్టర్లు, ఉద్యమకారులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
  • ఆంధ్రప్రదేశ్: ఏటా నావికాదినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్  ఆధ్వర్యంలో నౌకాదళం విన్యాసాలు జరపటం పరిపాటి కాగా  ఈ సారి మాత్రం కోవిడ్ నిబంధనల కారణంగా నిర్వహించలేదు.  ఎమ్మెల్సీ, గన్నవరం శాసన సభ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ అయిన బచ్చుల అర్జునుడు రెండోవిడత కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటలలో  631 కొత్త పాజిటివ్ కేసులు, 802 కోలుకున్నవారు,  2 మరణాలు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 2,72,123కు, చికిత్సలో ఉన్నవారి సంఖ్య  8,826 కు; మరణాలు 1467 కు; కోలుకొని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య: 2,61,830  కు చేరింది. కోలుకున్నవారి శాతం 96.21 గా నమోదు కాగా దేశవ్యాప్తంగా  కోలుకున్నవారి శాతం  94.2 ఉంది.

నిజనిర్థారణ

 

 

 

Image

 

Image

***


(Release ID: 1678478) Visitor Counter : 200