ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో మొత్తం కోవిడ్ కేసులలో చికిత్సపొందుతున్నవారు 4.35 శాతానికి తగ్గుదల

వారం రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ

మొత్తం కోలుకున్నవారి 90 లక్షలకు పైమాటే

Posted On: 04 DEC 2020 10:34AM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్ బారిన పడిన మొత్తం జనాభాలో ఇంకా చికిత్సపొందుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. నిన్నటివరకు చికిత్సలో ఉన్న బాధితుల శాతం 4.44 కాగా ఈ రోజు అది 4.35 శాతానికి తగ్గింది. ఈ ధోరణి గత వారం రోజులుగా కొనసాగుతూ వస్తోంది. గత 24 గంటలలో కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 4,16,082 కు చేరింది.

గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తహా 36,595 మందికి కోవిడ్ సోకినట్టు తేలగా, 42,916 మంది కొత్తగా కోలుకున్నారు.  ఆ విధంగా ఈ తేడా అయిన  6,321 నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలకు దోహదం చేసినట్టయింది. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Z3UU.jpg

ప్రతి పది లక్షలమంది జనాభాలో కోవిడ్ బారిన పడిన వారు భారత్ లో 6936 మందిగా నమోదుకాగా ఇది అంతర్జాతీయంగా చూస్తే చాలా తక్కువ. పశ్చిమార్థ గోళంలొని అనేక దేశాల్లో ఇది చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WPCW.jpg

కోలుకున్నవారి శాతం మరింత మెరుగుపడి ఈరోజుకు 94.2% అయింది. ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య  90,16,289 కు చేరింది. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం 86,00,207 కు చేరింది. కొత్తగా కోలుకున్న కేసులలో 80.19% మంది పది రాష్ట్రాలకు చెందినవారున్నారు. అందులో మహారాష్టలో  అత్యధికంగా 8,066 మంది, కేరళలో 5,590 మంది, ఢిల్లీలో  4,834 మంది కోలుకున్నారు.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PPU4.jpg

కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో75.76% కేసులు 10 రాష్టాలలో నమోదు కాగా నిన్న కేరళలో కొత్తగా 5,376 కేసులు, మహారాష్టలో  5,182 కేసులు,  ఢిల్లీలో 3,734 కేసులు తేలాయి.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PTV0.jpg

గడిచిన 24 గంటలలో 540 మరణాలు నమోదయ్యాయి. వాటిలో  77.78% కేవలం 10 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లొనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 115 మరణాలు నమోదు కాగా ఢిల్లీలో 82 మంది, పశ్చిమ బెంగాల్ లో 49 మంది చనిపోయినట్టు తేలింది.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ABIP.jpg

అంతర్జాతీయంగా చూసినప్పుడు భారత్ లో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు అతి తక్కువగా 101 నమోదయ్యాయి.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006WNIS.jpg

****


(Release ID: 1678251) Visitor Counter : 251