ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్‌-19 టీకాలు వేయించే వ్యూహం పై చ‌ర్చించడానికి అఖిలప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

భార‌త‌దేశం లో స్వ‌దేశీ టీకాలు మూడిటి తో సహా ఎనిమిది వ్యాక్సీన్‌ లు పరీక్ష తాలూకు వేరువేరు ద‌శ‌ల్లో ఉన్నాయి: ప‌్ర‌ధాన మంత్రి

రాబోయే కొద్ది వారాల్లో టీకా అందుబాటు లోకి వ‌స్తుంద‌న్న అంచ‌నా ఉంది: ప్ర‌ధాన మంత్రి

సురక్షితమైన‌, త‌క్కువ ధ‌ర‌ కు దొరికే టీకామందు రూపకల్పన కై  ప్ర‌పంచం భార‌త‌దేశానికేసి చూస్తోంది: ప‌్ర‌ధాన మంత్రి

Posted On: 04 DEC 2020 4:19PM by PIB Hyderabad

భార‌త‌దేశం లో కోవిడ్‌-19 కి సంబంధించిన టీకాల‌ను పౌరుల‌కు ఇప్పించే వ్యూహాన్ని గురించి చ‌ర్చించ‌డానికి ప్ర‌ధాన ‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శుక్రవారం జ‌రిగిన అఖిల ప‌క్ష స‌మావేశం లో పాలుపంచుకొన్నారు.  టీకాలను వేయించేందుకు ప్ర‌భుత్వం ఒక స‌మ‌గ్ర‌మైన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  సుర‌క్షిత‌మైన‌, త‌క్కువ ధ‌ర‌ కు దొరికే వ్యాక్సీన్ రూపకల్పన కై ప్రపంచం భార‌త‌దేశం వైపు చూస్తోంది అని ఆయ‌న నొక్కిచెప్పారు.

కొవిడ్ టీకాలను వేయించడానికి భార‌త‌దేశం సిద్ధం గా ఉంది

అహ‌మ‌దాబాద్, పుణే, హైద‌రాబాద్ ల‌లో గల టీకా త‌యారీ కేంద్రాల‌ను సంద‌ర్శించినప్ప‌ుడు తాను తెలుసుకొన్న అంశాలను  ప్ర‌ధాన మంత్రి ఈ స‌మావేశం లో వెల్ల‌డించారు.  ప్ర‌స్తుతం దాదాపు గా ఎనిమిది వ‌ర‌కు వ్యాక్సీన్ లు ప‌రీక్ష‌ల తాలూకు వివిధ ద‌శ‌లకు చేరుకొన్నాయ‌ని, వాటిని భార‌త‌దేశం లో ఉత్ప‌త్తి చేయ‌డం జ‌రుగుతుంద‌ని, ఆ టీకాల‌ లో మూడు దేశీయ వ్యాక్సీన్ లు సైతం ఉన్నాయ‌ని ఆయ‌న తెలియజేశారు.

రాబోయే కొన్ని వారాల వ్య‌వ‌ధి లో టీకా అందుబాటు లోకి వ‌స్తుంద‌న్న అంచ‌నా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  టీకామందు కు శాస్త్రవేత్త‌ లు ఆమోదం తెలిపిన వెనువెంట‌నే టీకాల ను ఇప్పించే ప్రచార ఉద్య‌మం భార‌త‌దేశం లో మొద‌ల‌వనుంది.  టీకాల‌ ను ఇప్పించడానికి ప్రాధాన్య సమూహాలను గుర్తించడం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో కేంద్ర ప్ర‌భుత్వం స‌న్నిహిత స‌మన్వయం తో కృషిచేస్తోంది.  

భార‌త‌దేశానికి టీకా పంపిణీ ప్ర‌క్రియ‌ లో ఉన్న ప్రావీణ్యం, సామ‌ర్ధ్యంలతో పాటు టీకాలు ఇప్పించ‌డానికి గ‌ల అనుభవ‌జ్ఞులైన‌ వ్య‌క్తుల‌తో కూడిన విశాల‌మైన నెట్ వ‌ర్క్ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్రముఖంగా ప్రకటిస్తూ, ఇది కోవిడ్ టీకాలను ఇప్పించే ప్ర‌క్రియ‌ ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో మ‌నకు స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌న్నారు.  అద‌న‌పు శీత‌లీక‌ర‌ణ వ్యవస్థ సంబంధిత సామ‌గ్రి ని ఏర్పాటు చేయడానికి,  ఇతరత్రా ర‌వాణా ఏర్పాట్ల కై రాష్ట్ర ప్ర‌భుత్వాలతో స‌హకారాన్ని నెలకొల్పుకోవడం జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

టీకాల‌ను ఇప్పించే కార్య‌క్ర‌మం కోసం జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయ‌డ‌మైంది

టీకా కు సంబంధించిన కార్యక్రమం బాధ్య‌త‌ ను స్వీక‌రించ‌డానికి గాను ఒక జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయ‌డ‌మైంది.  ఆ బృందం లో సాంకేతిక నిపుణులు, కేంద్ర ప్ర‌భుత్వ‌ అధికారులు, రాష్ట్ర ప్ర‌భుత్వాల అధికారులు ఉన్నారు.  ఈ జాతీయ నిపుణుల బృందం జాతీయ అవసరాలకు, ప్రాంతీయ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా ఉమ్మ‌డి నిర్ణ‌యాల‌ను తీసుకొంటుంది.  

భార‌త‌దేశం అజేయ‌ సంకల్ప శ‌క్తి తో మ‌హ‌మ్మారిపై పోరాటం చేసింది

భార‌త‌దేశం లోని పౌరులు అజేయ‌మైన సంక‌ల్పం తో ఈ మ‌హ‌మ్మారి తో పోరాడార‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  ఈ యావ‌త్తు స‌మ‌రం లోను వారు చాటిన సంయ‌మ‌నం, కనబరచిన ధైర్య సాహ‌సాలు, శ‌క్తి పోల్చ‌లేనివి, ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌నివి అని ఆయ‌న అన్నారు.  మ‌నం మ‌న తోటి భార‌తీయుల‌కు సాయ‌ప‌డ‌టం ఒక్క‌టే కాకుండా ఇత‌ర దేశాల పౌరుల‌ను కాపాడ‌టానికి కూడా శాయ‌శ‌క్తులా కృషి చేశామ‌ని ఆయ‌న అన్నారు.  భార‌త‌దేశం అనుస‌రించిన శాస్త్రీయ విధానాలు ప‌రీక్ష‌ ల సంఖ్య‌ ను పెంచేందుకు తోడ్ప‌డ్డాయ‌ని, అంతేకాకుండా అవి పాజిటివిటీ రేటు ను, కోవిడ్ మ‌ర‌ణాల రేటు ను కూడా త‌గ్గించాయ‌న్నారు.

టీకాల‌ను వేయించే ప్ర‌క్రియ పై వ‌దంతులు వ్యాప్తి లోకి రావచ్చంటూ ప్రధాన మంత్రి హెచ్చరిక చేశారు.  అదే జరిగితే, ఇటు ప్ర‌జా హితానికి, అటు దేశ హితానికి భంగకరం కాగ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.  దేశ పౌరుల‌ను మ‌రింత చైత‌న్య‌వంతులుగా తీర్చిదిద్దవలసిందని, ఆ కోవ‌ కు చెందిన వ‌దంతులు ఎంత మాత్రం వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకోవాల‌ని నాయ‌కులంద‌రికీ ఆయ‌న పిలుపునిచ్చారు.

కోవిడ్ పై పోరాడ‌డం లో విలువైన సూచ‌న‌లను, స‌ల‌హాలను ఇచ్చినందుకు అన్ని ప‌క్షాల నాయ‌కుల‌కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు.  దీనితో పాటే, పౌరులంద‌రూ నిరంత‌రం అప్రమత్తులై ఉండ‌వ‌ల‌సిందిగాను, వైర‌స్ విష‌యం లో తీసుకోవ‌ల‌సిన నివార‌క చ‌ర్య‌ల ప‌ట్ల ఎలాంటి అజాగ్ర‌త్త కు తావు ఇవ్వ‌కూడ‌ద‌ంటూను ఆయన మ‌రోసారి విజ్ఞప్తి చేశారు.

రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఏమ‌న్నారంటే..

ఈ స‌మావేశం లో పాల్గొన్న రాజ‌కీయ ప‌క్షాల‌ లో భార‌త‌ జాతీయ కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌, డిఎమ్‌కె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జెడి(యు), బిజెడి, శివ‌ సేన‌, టిఆర్ఎస్‌, బిఎస్‌పి, ఎస్‌పి, ఎఐఎడిఎమ్‌కె, బిజెపి లు ఉన్నాయి.  టీకాల‌ను ఇప్పించే కార్య‌క్ర‌మం ప్ర‌భావవంతంగా, వేగ‌వంత‌ంగా ముందుకు సాగేట‌ట్లు చూడ‌డానికి పూర్తి స్థాయి లో తమ సమర్థన ఉంటుందని నాయ‌కులు ప్ర‌ధాన మంత్రి కి హామీ ని ఇచ్చారు.  మ‌హ‌మ్మారి ని ఎదుర్కోవ‌డంలో ప్ర‌ధాన మంత్రి నాయ‌క‌త్వాన్ని వారు మెచ్చుకొన్నారు.   శాస్త్రవేత్త‌ల స‌ముదాయాన్ని, అలాగే టీకా ను అభివృద్ధిపర్చడంలో టీకా త‌యారీదారు సంస్థ‌ల‌ు చేస్తున్న ప్రయత్నాలను వారు ప్ర‌శంసించారు.  



 

***
 



(Release ID: 1678345) Visitor Counter : 228