ప్రధాన మంత్రి కార్యాలయం
రేపు 'ఐఐటీ -2020 గ్లోబల్ సమ్మిట్'లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
03 DEC 2020 9:54PM by PIB Hyderabad
రేపు (డిసెంబర్ 4న) పాన్ఐఐటీ యుఎస్ఏ నిర్వహించనున్న'ఐఐటీ -2020 గ్లోబల్ సమ్మిట్'లో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కీలకోపన్యాసం చేయనున్నారు. రేపు రాత్రి 09:30 గంటలకు ప్రధాని ప్రసంగం ఉంటుంది. ఈ సంవత్సరం ‘ది ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే ఇతివృత్తంతో ఈ సమ్మిట్ జరుగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణ, ఆరోగ్యం, నివాస పరిరక్షణ, సార్వత్రిక విద్య వంటి అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించనుంది. పాన్ఐఐటీ అనేది సంస్థ 20 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల కిందట ప్రారంభించబడిన సంస్థ. 2003 నుండి ఈ సంస్థ ప్రతి యేటా ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. పరిశ్రమ, విద్య మరియు ప్రభుత్వంతో సహా వివిధ రంగాలకు చెందిన వక్తలను ఈ సంస్థ ఆహ్వానిస్తోంది. పాన్ఐఐటీ యుఎస్ఏ సంస్థను వివిధ ఐఐటీలకు చెందిన పూర్వ విద్యార్థులకు చెందిన ఆల్-వాలంటీర్ బృందం నిర్వహిస్తోంది.
****
(Release ID: 1678169)
Visitor Counter : 144
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam