ప్రధాన మంత్రి కార్యాలయం
జెన్ నోవా బయోఫార్మా, బయలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీస్ బృందాలతో మాట్లాడనున్న ప్రధాన మంత్రి
Posted On:
29 NOV 2020 6:19PM by PIB Hyderabad
కోవిడ్-19 కి టీకామందును కనుగొనడంలో తలమునకలుగా ఉన్న జెన్ నోవా బయోఫార్మా, బయలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీస్ బృందాలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే ఈ నెల 30వ తేదీ సోమవారం నాడు సంభాషించనున్నారు.
‘‘కోవిడ్-19 కి టీకామందును కనుగొనడం లో నిమగ్నం అయిన మూడు బృందాలతో రేపటి రోజున, అంటే 2020వ సంవత్సరం నవంబర్ 30 న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా PM @narendramodi మాట్లాడుతారు. ఆయన సంభాషించే ఈ బృందాలు జెన్ నోవా బయోఫార్మా, బయలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీస్ లకు చెందిన బృందాలు’’ అని భారతదేశ ప్రధాన మంత్రి కార్యాలయం (@PMOIndia) సామాజిక మాధ్యమం ట్విటర్ ద్వారా ఈ రోజు న, అంటే ఈ నెల 29వ తేదీ ఆదివారం నాడు తెలిపింది.
***
(Release ID: 1677026)
Visitor Counter : 169
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam