ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోజువారీ కొత్తగా నమోదయ్యే కేసులలో, ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్ లోనే 69% కేసులు నమోదయ్యాయి

మిలియన్ జనాభాకు జరుగుతున్న పరీక్షలు లక్ష దాటాయి

మిలియన్ జనాభాకు అధిక పరీక్షలు జాతీయ సగటు కన్నా 23 రాష్ట్రాలు/యుటి లలోనే మెరుగుగా జరిగాయి.

Posted On: 28 NOV 2020 11:32AM by PIB Hyderabad

భారత్ లో క్రియాశీల కేసులు ఈ రోజు 4,54,940 వద్ద ఉంది. భారతదేశం మొత్తం పాజిటివ్ కేసులు క్రియాశీల కేసుల్లో 4.87% ఉన్నాయి. 

గత 24 గంటల్లో  కొత్తగా నిర్ధారణ అయిన కేసులు 41,322 నమోదయ్యాయి. రోజువారీ కొత్త వాటిట్లో 69.04% కేసులు ఎనిమిది రాష్ట్రాలు / యుటి అంటే మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్ నుండి నమోదయ్యాయి. 6,185 కొత్త కోవిడ్ కేసులతో మహారాష్ట్ర ఆధిక్యంలో ఉంది. ఢిల్లీలో 5,482 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత కేరళ లో 3,966 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UGRD.jpg

మిలియన్ జనాభాకు పరీక్షలు ఈ రోజు ఒక లక్షను దాటాయి. మిలియన్ జనాభాకు భారతదేశం  పరీక్షలు 1,00,159.70గా నమోదయ్యాయి. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OD8I.jpg

గత 24 గంటల్లో నిర్వహించిన 11,57,605 పరీక్షలతో, మొత్తం సంచిత పరీక్షలు 13.82 కోట్లు (13,82,20,354) అయ్యాయి.  పరీక్షా సంఖ్యలు బాగా పెరగడంలో మౌలిక సదుపాయాలను పరీక్షించడంలో స్థిరమైన మరియు ప్రగతిశీల విస్తరణ కీలక పాత్ర పోషించింది. 1175 ప్రభుత్వ ప్రయోగశాలలు మరియు 986 ప్రైవేట్ ప్రయోగశాలలతో సహా దేశంలో 2,161 పరీక్షా ప్రయోగశాలలతో, రోజువారీ పరీక్షా సామర్థ్యం గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందింది. జాతీయ ప్రయత్నాన్ని అనుసరించి, 23 రాష్ట్రాలు / యుటిలు జాతీయ సగటు కంటే మెరుగ్గా మిలియన్ జనాభాకు పరీక్షలు జరుగుతున్నాయి. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BY62.jpg

13 రాష్ట్రాలు/యుటిలలో మిలియన్ జనాభాకి పరీక్షలు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్నాయి.  

http://staic.pib.gov.in/WriteReadData/userfiles/image/image004T9M0.jpg

భారతదేశంలో మొత్తం కోలుకున్న కేసులు 87.59 లక్షలు (8,759,969). జాతీయ రికవరీ రేటు నేడు 93.68% వద్ద ఉంది. దేశంలో గత 24 గంటల్లో 41,452 రికవరీలు నమోదయ్యాయి. కొత్తగా కోలుకున్న కేసులలో 76.55%, 10 రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ గరిష్ట సంఖ్యను నివేదించింది ఇక్కడ కొత్తగా 5,937 కేసుల రికవరీ నమోదయ్యాయి. కేరళలో 4,544 మంది కోలుకున్నారు, మహారాష్ట్రలో 4,089 మందికి వ్యాధి నయమైంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005SHKO.jpg

గత 24 గంటల్లో నమోదైన 485 కేసులలో 78.35% పది రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నాయి. 98 మరణాలతో ఢిల్లీ గరిష్టంగా కొత్త మరణాలను నివేదించింది. మహారాష్ట్రలో 85 మంది మరణించారు, పశ్చిమ బెంగాల్ 46 మంది మరణించారు.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006REPH.jpg

 

****


(Release ID: 1676753) Visitor Counter : 171