ప్రధాన మంత్రి కార్యాలయం

ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 07 NOV 2020 2:42PM by PIB Hyderabad

నమస్తే,

మంత్రివర్గంలో నా సహచరులు రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గారు, సంజయ్ ధోత్రే గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మెన్ డాక్టర్ ఆర్. చిదంబరం గారు, ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి రామ్‌గోపాల్ రావు గారు, బోర్డు సెనేట్ సభ్యులు, ఫ్యాకల్టీ సభ్యులు, తల్లిదండ్రులు, యువ సహచరులు, సోదర సోదరీమణులారా!!

సాంకేతిక ప్రపంచానికి ఈ రోజు చాలా కీలకమైన రోజు. నేడు, ఐఐటి ఢిల్లీ ద్వారా, దేశం ముంగిట్లోకి 2 వేలకు పైగా సాంకేతిక నిపుణులు అందుబాటులోకి వస్తున్నారు. ఈ రోజు ఈ ముఖ్యమైన రోజున డిగ్రీలు పొందుతున్న విద్యార్థులందరికీ, విద్యార్థి స్నేహితులు అందరికీ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు, వారి గైడ్లు, ఫ్యాకల్టీ సభ్యులకు నా శుభాకాంక్షలు.

ఈరోజు, ఐఐటి ఢిల్లీ 51వ స్నాతకోత్సవం జరుగుతోంది. అంతేగాక ఈ యేడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టలు సంపాదించిన ఈ సంస్థ తన డైమండ్ జూబ్లీని సైతం జరుపుకుంటోంది. ఢిల్లీ ఐఐటి ఈ దశాబ్దానికి తన విజన్ డాక్యుమెంట్‌‌ని సిద్ధం చేసుకుంది.  డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నందుకు, ఈ దశాబ్దానికి మీ లక్ష్యాలకు నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాము.

నేడు, గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ సి.వి. ఇది రామన్ జన్మదినం. ఈ రోజు ఈ స్నాతకోత్సవాన్ని ఆ మహానుభావుడి జన్మదినం రోజున జరుపుకోవడం చాలా శుభ సందర్భం. నేను ఆ మేధావికి ప్రణమిల్లుతున్నాను. ఆయన చేసిన ఉత్తమ కృషి మనందరికీ, ముఖ్యంగా మన యువ శాస్త్రవేత్తలకు, యువతకు అనేక సంవత్సరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉన్నారు.

మిత్రులారా,

కరోనారు సంబంధించిన  ఈ సంక్షోభం, ప్రపంచంలో ఎన్నో కీలక మార్పులను తెచ్చిపెట్టింది. పోస్ట్-కోవిడ్ ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో సాంకేతికత కీలక పాత్ర పాత్ర పోషిస్తుంది. ఒక సంవత్సరం క్రితం వరకు, సమావేశాలు లేదా పరీక్షలు, వైవా లేదా స్నాతకోత్సవాలు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్నింటి స్వరూపం పూర్తిగా మారిపోతుందని ఎవరూ అనుకోలేదు. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలు ఇప్పుడు వర్కింగ్ రియాలిటీ స్థానాన్ని పూర్తిగా ఆక్రమించేస్తున్నాయి.

మీ బ్యాచ్ ఏమాత్రం అదృష్టవంతమైనది కాదని మీరు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ మా గ్రాడ్యుయేటింగ్ సంవత్సరంలో మాత్రమే  ఎందుకు జరగాలి? అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ, కాస్త భిన్నంగా ఆలోచించండి. మీకు మాత్రమే అందరికంటే ముందు ఒక ప్రయోజనం లభిస్తుంది. మీరు పనిచేయబోయే ప్రదేశంలో, బయట ఉద్భవిస్తున్న కొత్త నిబంధనలను తెలుసుకోవడానికి, స్వీకరించడానికి మీకు ఎక్కువ సమయం ఉంది. కాబట్టి, దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి. అంతేగాక మీ జీవితంలో ఎంతో ప్రకాశవంతమైన దిశలోనూ  ఆలోచించండి. మీ బ్యాచ్ నిజంగానే చాలా లక్కీ బ్యాచ్. మీరు మీ చివరి సంవత్సరంలో క్యాంపస్‌లో ఉన్న అనుభూతిని ఆస్వాదించగలిగారు. గత అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో విషయాలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూడండి. పరీక్షల ముందు లైబ్రరీ, రీడింగ్ రూంలో మీరు గడిపిన మధుర క్షణాలు, అర్ధరాత్రి మెస్’లో పరాఠాలు తినడం, లెక్చర్ల మధ్యలో కాఫీలు తాగుతూ మఫిన్లు తినడం వంటి అనేక తీపి గుర్తులను మీరు తిరిగి చూస్తే ఆనందిస్తారు. ఢిల్లీ ఐఐటీలో అందరికీ రెండు రకాల స్నేహితులు ఉన్నారని నాకు తెలిసింది. ఒకటి  కాలేజ్ స్నేహితులు, రెండు హాస్టల్ వీడియో గేమ్స్ స్నేహితులు. మీరు ఖచ్చితంగా రెండింటినీ మిస్ అవుతారు.

మిత్రులారా,

ఇంతకు ముందు ఐఐటి మద్రాస్, ఐఐటి బొంబాయి, ఐఐటి గువహతి స్నాతకోత్సవాలకు ఇదే తరహాలో హాజరుకావడానికి, కొన్నిచోట్లకు నేరుగా వెళ్ళగలిగే అవకాశం నాకు లభించింది. ఈ ప్రదేశాలన్నింటిలో ప్రతిచోటా వినూత్నమైన ప్రక్రియ ఏదో జరుగుతోందని నేను చూశాను. ఆత్మనిర్భర భారత్ ప్రచారం విజయవంతం అయ్యేందుకు ఇది ప్రధాన శక్తి. కోవిడ్ -19 ప్రపంచానికి మరో విషయం నేర్పింది. ప్రపంచీకరణ ముఖ్యం కాని అదే సమయంలో స్వయం సంవృద్ధిగా నిలవడం కూడా అంతే ముఖ్యం.

మిత్రులారా,

దేశంలోని యువతకు, సాంకేతిక నిపుణులకు, టెక్-ఎంటర్ప్రైజ్ లీడర్లకు అనేక కొత్త అవకాశాలను ఇచ్చేందుకు ఆత్మనిర్భర భారత్ ప్రచారం అనేది ఒక ముఖ్యమైన ప్రచారం. ఈ రోజు, వారి ఆలోచనలు, ఆవిష్కరణల కోసం అత్యంత అనుకూలమైన వాతావరణం సిద్ధంగా ఉంది. తద్వారా వారు వాటిని స్వేచ్ఛగా అమలు చేయగలుగుతారు. తమ ఉత్పత్తులను స్కేల్ చేయడమే కాకుండా, వాటిని సరైన విధంగా మార్కెట్ చేయవచ్చు. ఈ రోజు, భారతదేశం తన యువతకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు అనుకూల పరిస్థితులను కల్పించేందుకు పూర్తిగా కట్టుబడి ఉంది, తద్వారా యువత కోట్లాది మంది పౌరుల జీవితాలను వారి ఆవిష్కరణలతో మార్చగలదు. దేశం మీకు వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని ఇస్తుంది. మీ నైపుణ్యంతో, మీ అనుభవంతో, మీ ప్రతిభతో, మీ ఆవిష్కరణతో, దేశం మీకు వ్యాపారం చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మార్చి ఏర్పాట్లు అందించినప్పుడు, మీరు ఈ దేశంలోని పేదల్లో అత్యంత పేదలు, పౌరులకు కనీస జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు , కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలి. క్రొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొని రావాలి.

ఇటీవల, దాదాపు ప్రతి రంగంలో చేసిన ప్రధాన సంస్కరణల వెనుక ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. మొదటిసారి, వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, కొత్త స్టార్టప్‌లకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడి మార్గాలు తెరుచుకున్నాయి. రెండు రోజుల క్రితం, బిపిఓ రంగానికి సులువుగా వ్యాపారం చేయడానికి పెద్ద సంస్కరణ కూడా జరిగింది. ప్రభుత్వం ఇతర సర్వీస్ ప్రొవైడర్- OSP మార్గదర్శకాలను పూర్తిగా సరళీకృతం చేసింది, దాదాపు అన్ని పరిమితులను తొలగించింది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రభుత్వ జోక్యం ఇకపై ఏమాత్రం ఉండదు. ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకుంటారు. ఈ కారణంగా, బిపిఓ ఇండస్ట్రీస్‌‌కి ప్రస్తుతం ఉన్న భారంనెమ్మదిగా తగ్గుతుంది. ఇదే కాకుండా, బిపిఓ పరిశ్రమకు బ్యాంక్ గ్యారెంటీతో సహా వివిధ నిబంధనల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఇది మాత్రమే కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ నుంచి టెక్ ఇండస్ట్రీ వంటి సౌకర్యాల నుంచి నిరోధించిన చట్టాల నిబంధనలు కూడా పూర్తిగా తొలగించాము. ఇది దేశంలోని ఐటి రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత శక్తివంతంగా, పోటీగా తయారుచేస్తుంది. అంతేగాక  మీలాంటి యువ ప్రతిభకు ఎక్కువ అవకాశాలను ఇస్తుంది.

మిత్రులారా,

ఈ రోజు దేశంలో మీ వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకోవడం, భవిష్యత్ అవసరాలను అర్థం చేసుకోవడం, ఒకదాని తరువాత ఒకటిగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొన్నేళ్ళుగా ఉన్న పాత నియమాలను ఒక్కటొక్కటిగా మార్చేస్తున్నాము.  గత శతాబ్దంలోని నియమాలు - తరువాతి శతాబ్దం నుంచి వచ్చిన చట్టాలు దాని భవిష్యత్తును ఏమాత్రం  నిర్ణయించలేవు. అందుకే కొత్త శతాబ్దం, కొత్త తీర్మానాలు. కొత్త శతాబ్దం, కొత్త ఆచారాలు. కొత్త శతాబ్దం, కొత్త చట్టాలు ముందుకు వస్తున్నాయి. కార్పొరేట్ పన్ను అత్యల్పంగా ఉన్న దేశాల్లో నేడు భారతదేశం కూడా ఉంది. స్టార్ట్-అప్ ఇండియా ప్రచారంతో  భారతదేశంలో ఇప్పటికే 50 వేలకు పైగా స్టార్ట్ అప్‌లు ప్రారంభమయ్యాయి. గత ఐదేళ్లలో దేశంలో పేటెంట్ల సంఖ్య 4 రెట్లు పెరిగింది. దీనికి కారణం ప్రభుత్వ ప్రయత్నాలు.. వీటి  ప్రభావం ఇప్పడు కనిపిస్తోంది. ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్లలో 5 రెట్లు పెరుగుదల ఉంది. ఇందులో కూడా ఫిన్‌టెక్‌తో పాటు ఆగ్రో, డిఫెన్స్, మెడికల్ రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. సంవత్సరాలుగా, 20కి పైగా యునికార్న్లను భారతదేశంలో భారతీయులు తయారు చేశారు. దేశం పురోగతి మార్గంలో పయనిస్తున్నందున, రాబోయే ఏడాది రెండేళ్ళలో , వారి సంఖ్య పెరుగుతుందని, ఈ రోజు ఇలాంటి విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న మీలాంటి యువకులు దీనికి కొత్త శక్తిని చేకూర్చవచ్చని నాకు నమ్మకం ఉంది.

మిత్రులారా,

ఇంక్యుబేషన్ నుంచి నిధుల వరకు ఈ రోజు స్టార్టప్‌లకు అనేక రకాల సహాయం అందిస్తున్నారు. 10వేల కోట్ల రూపాయల విలువైన ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపొందించాము. 3 సంవత్సరాలుగా, టాక్స్ ఎక్సెప్షన్, సెల్ఫ్ సర్టిఫికేషన్, ఈజీ ఎగ్జిట్ వంటి అనేక సౌకర్యాలు స్టార్ట్ అప్‌‌లకు చాలా సులభంగా అందుతున్నాయి. ఈ రోజు మనం జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ కింద 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలను సృష్టిస్తుంది. ఇది ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను తీర్చగలదు.

మిత్రులారా,

ప్రతి రంగం తమ గరిష్ట సామర్థ్యాన్ని సాధించడానికి నేడు దేశం కొత్త మార్గాల్లో పనిచేస్తోంది. మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు, కొత్త ప్రదేశంలో పని చేస్తే, మీరు కొత్త మంత్రంతో పని చేయాల్సి ఉంటుంది. అది ఒక్కటే మంత్రం. నాణ్యతపై దృష్టి పెట్టండి; ఎప్పుడూ రాజీపడకండి. ప్రమాణాలను నిర్ధారించుకోండి; మీ ఆవిష్కరణలు భారీ స్థాయిలో పని చేసేలా చేయండి. విశ్వసనీయతకు భరోసా ఇవ్వండి; మార్కెట్లో దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంచుకోండి. మార్కెట్లో అనుకూలత తీసుకురండి; మార్పుకు సిద్ధంగా ఉండండి. జీవన విధానంలో  అనిశ్చితతను ఆశించండి. మీరు ఈ ప్రాథమిక మంత్రాలపై పనిచేస్తే, అది మీకు గుర్తింపుతో పాటు బ్రాండ్ ఇండియాలో కూడా ప్రకాశిస్తుంది. మీరు బ్రాండ్ ఇండియాకు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అని నేను మీకు చెప్తున్నాను. మీరు చేసే పని దేశ ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపును ఇస్తుంది. మీరు ఏమి చేస్తారు అనేది దేశ ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. గ్రామాల్లోని పేదల కోసం దేశం చేస్తున్న ప్రయత్నాలు మీ అంకితభావం, మీ ఆవిష్కరణ ద్వారా కూడా నిరూపితమౌతాయి.

మిత్రులారా,

మన పాలనలో అత్యంత పేదలను చేరుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అత్యంత శక్తివంతమైన మార్గంగా ఎలా ఉంటుందనే విషయాన్ని, గత సంవత్సరాల్లో దేశం చేసి చూపించింది. ఈ రోజు, అది ఇల్లు, విద్యుత్, టాయిలెట్, గ్యాస్ కనెక్షన్ లేదా ఇప్పుడు నీరు అయినా, ఇలా అటువంటి సౌకర్యాలన్నీ డేటా, స్పేస్ టెక్నాలజీ సహకారంతో అందించగలుగుతున్నాం. ఈరోజు  జనన ధృవీకరణ పత్రం నుంచి లైఫ్ సర్టిఫికేట్ వరకు అన్నింటిని డిజిటల్‌గా పొందగలిగే సౌకర్యం  అందుబాటులో ఉంది. సాధారణ పౌరుల జీవితాలను సులభతరం చేసేందుకు జన్‌‌ధన్,  -ఆధార్-మొబైల్ కి సంబంధించి ట్రినిటీ జామ్, డిజి-లాకర్స్,  ఇప్పుడు డిజిటల్ హెల్త్ ఐడి కోసం ప్రయత్నాల వంటి సౌకర్యాలు ఒకదాని తరువాత ఒకటి వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. టెక్నాలజీ లాస్ట్ మైల్ డెలివరీని సమర్థవంతంగా చేసింది. అంతేగాక అవినీతి పరిధిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీల విషయంలో, ప్రపంచంలోని అనేక దేశాల కంటే భారతదేశం చాలా ముందుంది. భారతదేశం రూపొందించిన యుపిఐ వంటి  ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందిన వాటిని అవలంబించాలని కోరుకుంటున్నాయి.

మిత్రులారా,

ఇటీవల ప్రభుత్వం మరొక పథకాన్ని ప్రారంభించింది. దీనిలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పథకం యాజమాన్య ప్రణాళిక. దీని కింద,మొదటిసారిగా, భూమి ,ఆస్తి మ్యాపింగ్, ఇంటి ఆస్తి మ్యాపింగ్ కార్యక్రమం భారతదేశంలోని గ్రామాల్లో జరుగుతోంది. ఇంతకుముందు ఈ పని జరిగితే, హ్యూమన్ ఇంటర్ఫేస్ మాత్రమే ఇందులో మాధ్యమంగా ఉండేది. అందువల్ల, లోపాలు, సందేహాలు, అనుమానాలు, భయాలు అనేకం ఉండేది. ఇది సహజమైనదే. మీరు టెక్నాలజీ ప్రపంచానికి చెందినవారు కాబట్టి మీరు ఈ విషయాలతొ సంతోషంగా ఉంటారు. ఈ రోజు, ప్రతి గ్రామంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ ద్వారా ఈ మ్యాపింగ్ జరుగుతోంది.  గ్రామ ప్రజలు కూడా దానితో పూర్తిగా సంతృప్తి చెందుతున్నారు, వారు ఈ ప్రచారంలో పాల్గొనడంతో పాటు ప్రచారం సైతం చేస్తున్నారు. భారతదేశంలోని సాధారణ పౌరులు సైతం సాంకేతిక పరిజ్ఞానంపై ఎంత నమ్మకం ఉంచుతున్నారో ఇది చూపిస్తోంది.

మిత్రులారా,

సాంకేతిక పరిజ్ఞానం, దాని పట్ల భారతీయుల విశ్వాసం అనేది ఇప్పుడు  మీ భవిష్యత్తుకు వెలుగును చూపిస్తుంది. మొత్తం దేశంలో మీకు అపారమైన అవకాశాలు ఉన్నాయి, అపారమైన సవాళ్లు ఉన్నాయి, దీనికి మీరు మాత్రమే పరిష్కారాలు ఇవ్వగలరు. వరదలు, తుఫానుల సమయంలో  విపత్తు తర్వాత నిర్వహణ, భూగర్భ జలమట్టం ఎలా నిర్వహించడం కానీ, సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం, సౌర విద్యుత్ ఉత్పత్తి,  బ్యాటరీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, టెలిమెడిసిన్, రిమోట్ సర్జరీ టెక్నాలజీ, బిగ్ డేటా ఎనాలసిస్ వంటి ప్రాంతాల్లో పని చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మిత్రులారా,

ఒక దేశానికి సంబంధించిన ఇలాంటి అనేక అవసరాలను నేను మీ ముందు ఉంచగలను. ఈ అవసరాలన్నీ మీరు చేసే  నూతన ఆవిష్కరణల ద్వారా, మీ కొత్త ఆలోచనలు, మీ శక్తి , మీ ప్రయత్నాల ద్వారా మాత్రమే నెరవేరుతాయి. అందువల్ల, ఈ రోజు దేశ అవసరాలను మీరు గుర్తించాలని మీకు నా ప్రత్యేక అభ్యర్థన. కార్యక్షేత్రంలో జరుగుతున్న మార్పులు, ఆత్మనిర్భర భారత్‌తో సంబంధం ఉన్న సామాన్యుల ఆకాంక్షల్లో చేరేందుకు పని చేయాలని, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ కూడా ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మిత్రులారా,

ఏమైనప్పటికీ మీ అందరికీ పూర్వ విద్యార్థుల సమావేశాలను నిర్వహించడం చాలా సులభం. ఇతర కళాశాలల విద్యార్థులు తమ పూర్వ విద్యార్థుల సమావేశం కోసం, కాలేజీకి కూడా ఎక్కువసేపు ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ మీకు మరొక పెద్ద సాధారణ ఎంపిక ఉంది. మీరు మీ పూర్వ విద్యార్థులను వారాంతంలో, బే ఏరియాలో, సిలికాన్ వ్యాలీలో, వాల్ స్ట్రీట్లో లేదా ఏదైనా ప్రభుత్వ సచివాలయంలో చిన్న నోటీసుతో కలవవచ్చు, ఎందుకంటే మీరు పూర్వ విద్యార్థులను చాలా సులభంగా కలుసుకోవచ్చు. ఎందుకంటే మీ పూర్వ విద్యార్థులు ప్రతిచోటా ఉన్నారు. మీ ఉనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎక్కువగా ఉంది. భారతదేశంలో, స్టార్ట్-అప్ రాజధానులైన ముంబై, పూణే , బెంగళూరుల్లో ఐఐటిల్లో చదివిన అనేక ప్రభావవంతులైన వ్యక్తుల నెట్‌వర్క్ కనిపిస్తుంది. ఇది మీ విజయం, ఇది మీ ప్రభావం.

మిత్రులారా,

మీరంతా అసాధారణమైన సామర్ధ్యాలు కలిగిన విద్యార్థులు. అన్నింటికంటే ముందు మీరు 17-18 సంవత్సరాల వయస్సులో క్లిష్ట పరీక్షలలో ఒకటైన J-E-E లో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత మీరు ఐఐటికి వచ్చారు. కానీ, మీ సామర్థ్యాన్ని మరింత పెంచే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వెసులుబాటు. మరొకటి వినయం. వెసులుబాటు ద్వారా, మీరు ఏ అవకాశాన్ని అయినా అందుకోగలరు. ధైర్యంగా నిలబడి, సమాజానికి తగ్గట్లుగా మారిపోవాలి. మీ జీవితంలో ఏ సమయంలోనైనా మీరు మీ గుర్తింపును తొలగించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. ఏ విషయంలోనూ. ఎవరితోనూ 'లైట్ వెర్షన్' గా ఎప్పుడూ ఉండకండి. అసలు వెర్షన్‌గా ఉండండి. మీరు నమ్మే విలువలను పాటించిననప్పుడు మీరు ఛాంపియన్‌‌గా నిలుస్తారు. అదే సమయంలో, జట్టులో సభ్యుడిగా ఉండేందుకు ఎప్పుడూ వెనుకాడకూడదు.వ్యక్తిగత ప్రయత్నాలకు వాటి పరిమితులు ఉన్నాయి. జట్టుగా  కృషితో ముందుకు వెళ్ళే మార్గం ఉంది. జట్టుగా చేసే కృషి పరిపూర్ణతను తెస్తుంది. రెండవది వినయం. మీ సక్సెస్, మీ విజయాల గురించి మీరు పూర్తిగా గర్వపడాలి. చాలా తక్కువ మంది మీరు సాధించిన విజయాలను సాధించి ఉంటారు. అలాంటి సమయంలో మీరు మరింత సాధారణంగా ఉండాల్సి ఉంటుంది.

మిత్రులారా,

ఒకరు తనను తాను సవాలు చేసుకోవడం, ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకోవడం కొనసాగించడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు జీవితంలో ఎప్పుడూ ఒక విద్యార్థిగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీకు తెలిసినదే సరిపోతుందని ఎప్పుడూ అనుకోకండి.

“సత్యం జ్ఞానం, అనంతం బ్రహ్మం” అని మన గ్రంథాలలో ఎప్పుడో చెప్పారు.

అంటే, జ్ఞానం, సత్యం అనేవి బ్రహ్మ మాదిరిగా  అనంతమైనవి. మీరు చేసిన అనేక కొత్త ఆవిష్కరణలు, ఇవన్నీ సత్యం, జ్ఞానానికి విస్తరణ మాత్రమే. అందువల్ల, మీ ఆవిష్కరణ దేశానికి, దేశవాసులకు, పేదలకు, ఆత్మనిర్భర భారతదేశానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మీ జ్ఞానం, మీ నైపుణ్యం, మీ బలం దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది, ఈ నమ్మకంతో ముందుకు సాగాలి.  మీ అందరికీ చాలా అభినందనలు, అనేక శుభాకాంక్షలు, మీ జీవితపు నూతన ప్రయాణం మీ తల్లిదండ్రుల అంచనాలకు అనుగుణంగా ప్రారంభం కావాలి. మీకు విద్యను నేర్పించిన మీ ఉపాధ్యాయులు, జీవితంలో విజయం సాధించడానికి జీవితంలో పనిచేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన వారి అంచనాలను తప్పకండి. భారత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, భారతదేశం తన జనాభా పట్ల ఎంతో గర్వంగా ఉంది. మన దేశ  జనాభా ఎప్పుడైతే ఐఐటియన్లతో నిండుతుందో, అప్పుడు అది ప్రపంచంలో కూడాదేశ  విలువను మరింత పెంచుతుంది. ఈ రోజు జీవితంలో నూతన ప్రయాణాన్ని ఎంతో ఉత్తేజంతో ప్రారంభిస్తున్న మీకు, మీ కుటుంబానికి, మీ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

అందరికీ శుభాకాంక్షలు



(Release ID: 1671199) Visitor Counter : 235