ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎస్ఎల్ వి-సి49/ఇఒఎస్-01 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 07 NOV 2020 4:51PM by PIB Hyderabad

పిఎస్ఎల్ వి-సి49/ఇఒఎస్-01 మిశన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారతీయ అంతరిక్ష పరిశ్రమను, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ.. ‘ఇస్రో’) ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

‘‘శనివారం పిఎస్ఎల్ వి-సి49/ఇఒఎస్-01 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారతీయ అంతరిక్ష పరిశ్రమను, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ.. ‘ఇస్రో’) ను నేను అభినందిస్తున్నాను.  నిర్దిష్ట చివరి గడువు లోపల ముఖ్యమైన పనులను పూర్తి చేయడం కోసం కోవిడ్-19 కాలంలో ఎదురైన ఎన్నో అడ్డంకులను మన శాస్త్రవేత్తలు అధిగమించారు.

యుఎస్, లక్జెంబర్గ్ ల కు చెందిన నాలుగేసి ఉపగ్రహాలు, లిథుయేనియా కు చెందిన ఒక ఉపగ్రహం సహా తొమ్మిది ఉపగ్రహాలను కూడా ఈ మిషన్ లో భాగంగా  ప్రయోగించడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

***
 


(Release ID: 1671036) Visitor Counter : 213