ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

క్రియాశీల కేసులు క్రమేణా తగ్గడంలో స్థిర పథాన్ని కొనసాగిస్తున్న భారత్

27 రాష్ట్రాలు / యుటిలలో 20,000 కంటే తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి

మొత్తం క్రియాశీల కేసులలో 78% కేసులు 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి

Posted On: 05 NOV 2020 11:52AM by PIB Hyderabad

కోవిడ్ క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టే దిశగా స్థిరమైన ధోరణిని భారతదేశం కొనసాగిస్తోంది. క్రియాశీల కేసులు గత ఏడు రోజులలో 6 లక్షల కన్నా తక్కువ స్థాయిలో నమోదయి, ప్రస్తుతం 5,27,962 వద్ద ఉన్నాయి. క్రియాశీల కేసులు ఇప్పుడు దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 6.31% మాత్రమే.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001I8PZ.jpg

జాతీయ స్థాయిలో కేసుల గతి చుస్తే, 27 రాష్ట్రాలు/యుటి లు 20,000 కన్నా తక్కువ క్రియాశీల కేసులు నమోదయ్యాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002D2KB.jpg

మొత్తం కేసుల్లో కేవలం 10 రాష్ట్రాలు/యుటిలలో 78% కేసులున్నాయి.  మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ కలిసి 51% కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003APEX.jpg

క్రియాశీల కేసుల తగ్గుతున్న ధోరణితో, కోలుకున్న వారి సంఖ్య  పెరుగుదల, మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మొత్తం కోలుకున్న కేసులు 7,711,809. కోలుకున్న కేసులు, క్రియాశీల కేసుల మధ్య అంతరం దాదాపు 72 లక్షలకు (71,83,847) చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 92.20% కి మరింత మెరుగుపడింది .55,331 కోవిడ్ రోగులు గత 24 గంటల్లో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు, కొత్తగా నిర్ధారించబడిన కేసులు 50,210.

కొత్తగా కోలుకున్న కేసులలో 10 రాష్ట్రాలు / యుటిలలో 82% వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు గుర్తించారు. కేరళ, కర్ణాటక ఒకే రోజు రికవరీకి గరిష్టంగా 8,000 అయి ఫలితాలను మరింత ఆశాజనకం చేసాయి. కొత్తగా కోలుకున్న కేసులలో ఇవి 45% కంటే ఎక్కువ.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0040XGN.jpg

గడచినా 24 గుంతల్లో కొత్తగా 50,210 కేసులు నిర్ధారణ అయ్యాయి 

79% కొత్త కేసులు కేవలం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఉన్నాయి. కొత్త కేసులు పెరగడం కేరళ లో కొనసాగుతుంది, ఆ తరువాతి స్థానంలో ఢిల్లీ ఉంది. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005VVE9.jpg

గడచినా 24 గంటల్లో 704 మరణాలు నమోదయ్యాయి. 

వీటిలో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 80% ఉన్నాయి. మహారాష్ట్ర ఒక్క దగ్గరే 42% పైగా అంటే 300 మరణాలు సంభవించాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006IC3B.jpg

                                                                                                                                               

****


(Release ID: 1670385) Visitor Counter : 248