ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

75 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులతో

అంతర్జాతీయ రాంకు నిలబెట్టుకున్న భారత్

చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య

రెండు నెలల్లో మూడు రెట్లకు పైగా తగ్గుదల

11 కోట్ల మైలురాయి దాటిన కోవిడ్ పరీక్షలు

Posted On: 02 NOV 2020 11:39AM by PIB Hyderabad

కోవిడ్ నుంచి విముక్తి పొందిన వారి సంఖ్య అధికంగా ఉండటతో అంతర్జాతీయంగా భారత్ మెరుగైన స్థానంలో కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 75 లక్షలు దాటి 75,44,798 కి చేరింది. గడిచిన 24 గంటలలో 53,285 మంది కోలుకున్నారు.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001N0KH.jpg

చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. భారత్ లో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య ప్రస్తుతం 5,61,908 గా నమోదైంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JBQD.jpg

దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో ఇప్పటికీ చికిత్సలో ఉన్నవారు 6.83% మాత్రమే. కేవలం రెండు నెలల కాలంలో  చికిత్సపొందుతూ ఉన్నవారి శాతం మూడు రెట్లు తగ్గింది. సెప్టెంబర్ 3న చికిత్సపొందుతున్నవారి శాతం 21.16% గా నమోదైంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003414G.jpg

దేశంలో 2020 జనవరి నుంచి కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా పరీక్షల విస్తృతి పెరగటం వల్ల బాధితులను త్వరగా గుర్తించటం, చికిత్స అందించటం సాధ్యమవుతోంది. ది ఇప్పుడు 11 కోట్ల మైలు రాయి దాటి 11,07,43,103 చేరాయి. కేంద్ర, రాష్టప్రభుత్వాల సమన్వయంతో దేశంలో లాబ్ ల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగి 2037 కు చేరాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IKC8.jpg

పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటం వలన జాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారి శాతం ప్రస్తుతం 91.68 శాతానికి చేరింది. కొత్తగా గత 24 గంటలలో కోలుకున్న వారిలో 78% మంది 10 రాష్టాలకు చెందినవారు ఉన్నారు. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికంగా ఎనిమిదేసి వేలకు పైగా కోలుకున్నవారు నమోదయ్యారు. 4,000 కు పైగా కెసులతో ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005OUM8.jpg

కొత్తగా గత 24 గంటలలో 45,321 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది.  కొత్త కేసులలో 80% కేవలం 10 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. కేరళ కొత్త కేసులలో 7,025 ఎక్కువగా నమోదు చేస్తూ మొదటి స్థానంలో నిలిచింది.  ఢిల్లీ, మహారాష్ట్ర రెండూ ఐదేసి వేలకు పైగా కేసులతో ఆ తరువాత స్థానంలో ఉన్నాయి.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006HXQ4.jpg

 

గడిచిన 24 గంటలలో 496  మరణాలు నమోదయ్యాయి. వాటిలో 82% మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి. నిన్నటి మరణాలలో 22% (113 మరణాలు)  కేవలం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.59 మరణాలతో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో ఉంది.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007NGS2.jpg

****


(Release ID: 1669451) Visitor Counter : 199