ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మూడురోజులుగా మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నది 10 శాతమే మూడు రోజులుగా పాజిటివ్ కేసులు 5శాతం లోపే
Posted On:
22 OCT 2020 11:44AM by PIB Hyderabad
భారత్ లో చికిత్స పొందుతూ ఉన్న కరోనా బాధితుల సంఖ్య వేగంగా తగ్గుతోంది. మొత్తం కేసులలో ఇప్పటికీ బాధితులుగా ఉన్నవారి సంఖ్య గడిచిన మూడు రోజులుగా 10% లోపే ఉంటూ వస్తోంది. అంటే దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన ప్రతి పందిలో ఒకరు మాత్రమే ఇంక చికిత్సలో ఉన్నారు. ప్రస్తుతం కోవిడ్ బాధితులు 9.29% గా నమోదు కాగా వారి సంఖ్య 7,15,812.
మరో మైలురాయి చేరుకుంటీ రోజువారీ పాజిటివ్ కేసులు గడిచిన మూడు రోజులుగా 5% లోపే ఉంటున్నాయి. దీన్నిబట్టి వ్యాధి వ్యాప్తి బాగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ వ్యూహాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టమవుతున్నది. రోజువారీ పాజిటివ్ కేసుల శాతం 3.8 గా నమోదైంది.
రోజూ పాజిటివ్ కేసులు తగ్గుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారు కూడా తగ్గుతూ ఈ రోజు 7,15,812 కు చేరారు. ఇప్పటిరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 69 లక్షలు (68,74,518). చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్నవారికీ మధ్య తేడా రోజూ పెరుగుతూ వస్తుండగా ఈరోజు అది 61,58,706 గా నమోదైంది. గత 24 గంటల్లో 79,415 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఉండగా కొత్తగా పాజిటివ్ గా నమోదైన వారు 55,839 మంది. ఆవిధంగా కోలుకున్నవారి శాతం 89.20% కు పెరిగింది.
కొత్తగా కోలుకున్నవారిలో 81% మంది కేవలం 10 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోనే నమోదయ్యారు. అమ్దులోఈ మహారాష్టలో అత్యధికంగా 23,000 మందికి పైగా ఒక్కరోజులోనే కోలుకున్నారు.
http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004NJ9M.jpg
55,839కొత్త కేసులు గడిచిన 24 గంటలలోనే నమోదయ్యాయి. వాటిలో 78% కేసులు 10 రాష్టాలలోనే ఉన్నాయి. అందులో మహారాష్ట్ర, కేరళ రాష్టాల్లో ఒక్కో చోట 8,000 కు పైగా కేసులు నమోదు కాగా కర్నాటకలో కేసులు 5,000 దాటాయి.
గత 24 గంటలలో 702 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో 82% కేవలం పది రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లోనే ఉన్నాయి. తాజా మరణాలలో 25% పైగా (180 మరణాలు) మహారాష్ట్రలొనే సంభవించాయి.
***
(Release ID: 1666794)
Visitor Counter : 186
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam