ప్రధాన మంత్రి కార్యాలయం

మ‌హాత్మాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా శిర‌సు వంచి వంద‌నం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 02 OCT 2020 9:15AM by PIB Hyderabad
మ‌హాత్మాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు శిర‌సు వంచి వంద‌నం చేశారు.

"గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని మ‌నంద‌రం అత్యంత ప్రీతిపాత్రుడైన ఆయ‌నకు శిర‌సు వంచి అభివాదం చేస్తున్నాం. 

ఆయ‌న జీవితం, గొప్ప ఆలోచ‌న‌ల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

భార‌త‌దేశాన్ని సుసంప‌న్న‌మైన‌, కారుణ్య దృక్ప‌థం గ‌ల దేశంగా అభివృద్ధి చేయ‌డంలో బాపూజీ సిద్ధాంతాలు మ‌నంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తూనే ఉంటాయి" అని ప్ర‌ధాన‌మంత్రి సందేశం ఇచ్చారు.
***

(Release ID: 1660934)