ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
తక్కువ స్థాయిలోనే కోవిడ్ చికిత్సలో ఉన్నవారి సంఖ్య
వరుసగా పదో రోజుకూడా చికిత్సలో ఉన్నవారు 10 లక్షలలోపే
భారత్ లో ఇప్పటిదాకా కోలుకున్నవారు 53 లక్షలమంది
గత 12 రోజుల్లోనే కోలుకున్నవారు 10 లక్షలమంది
Posted On:
01 OCT 2020 11:42AM by PIB Hyderabad
భారతదేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా 10 లక్షల లోపే కొనసాగుతూ వస్తోంది. వరుసగా పదో రోజు కూడా చికిత్సలో ఉన్నవారు సంఖ్య పది లక్షల లోపు ఉంటూ ఉంది.

ప్రతి రోజూ కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండటంతో కోలుకుంటున్న ధోరణి కూడా ఒకే విధమైన ట్రెండ్ కనబరుస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 85,3756 కోలుకోగా ఇప్పటివరకు మొత్తం 52.73.201 మంది కోవిడ్ బాధితులు కోలుకొని బైటపడ్డారు. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కోలుకోవటం నమోదవుతూ ఉండటం వలన దేశవ్యాప్తంగా కోలుకుంటున్నవారి శాతం ప్రస్తుతం 83.53% చేరింది.
మొత్తం కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. కోలుకున్న చివరి 10 లక్షలమంది కేవలం 12 రోజుల్లో వచ్చి చేరినవారే. కోలుకున్నవారిలో 77% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే. వాటిలో అత్యధికంగా కోలుకున్నవారున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ ది రెండో స్థానం, తమిళనాడుది మూడో స్థానం.

భారత్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పాజిటివ్ కేసులు 9,40,705 ఉన్నాయి. సెప్టెంబర్ 11 న భారత్ 9.4 లక్షల మంది చికిత్సలో ఉన్నట్టు ప్రకటించింది. ఇలా చికిత్స పొందుతూ ఉన్నవారిలో 76% మంది పది రాష్ట్రాలకు చెందినవారే కావటం గమనార్హం. మొత్తం దేశంలో బైటపడ్డ కొవిడ్ కేసులలో 14.9% మాత్రమే ఇంకా చికిత్సలో ఉన్నారు.

గత 24 గంటల్లో 86.821 కేసులు తాజాగా ధ్రువపడ్దాయి. 76% కొత్త కేసులు పది రాష్ట్రాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయి. అందులో మహారాష్ట నుంచి 18 వేలకు పైగా కొత్తకేసులున్నాయి. కర్నాటక, కేరళ ఒక్కో రాష్టంలో 8, 000 కు పైగా కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 1181 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన మరణాలలో 82% మంది పది రాష్టాలకు చెందినవారు. నిన్న మరణాలు నమోదైన వారిలో 40% మంది (481 మరణాలు) మహారాష్ట్రకు చెందినవే. 87 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.

****
(Release ID: 1660609)
Visitor Counter : 291
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam