ప్రధాన మంత్రి కార్యాలయం

వారాణసీ లోని ఎన్ జిఒ ప్రతినిధుల తో ప్రధాన మంత్రి సంభాషణ

Posted On: 09 JUL 2020 1:25PM by PIB Hyderabad

హర్ హర్ మహాదేవ్.

పవిత్రమైన కాశీ గడ్డ మీది పుణ్యాత్ములైన ప్రజలందరి కి ఇవే నా అభినందన లు.  ఇది శ్రావణ మాసం.  ఈ కాలం లో, ప్రతి ఒక్కరు బాబా యొక్క చరణాల సన్నిధి లో తనను తాను సమర్పించుకోవాలని తలపోస్తారు.  కానీ నేను బాబా యొక్క నగరానికి చెందిన ప్రజల తో సంభాషించే అవకాశాన్ని దక్కించుకొన్నప్పుడు నాకు అనిపిస్తూంది నేను ఒకసారి దర్శనం చేసుకొనేటటువంటి సౌభాగ్యాని కి నోచుకొన్నాను అని.  అన్నింటి కంటే ముందు, మీకు అందరికీ భగవాన్ భోలే నాథ్ యొక్క ఈ ప్రీతిపాత్రమైన మాసం తాలూకు శుభకామనలు.  

భగవాన్ భోలే నాథ్ యొక్క ఆశీర్వాదాల కారణం గా ఈ కరోనా సంక్షోభ కాలం లో సైతం, కాశీ లో పరిపూర్ణమైన ఆశ, ఇంకా ఉత్సాహం ఉట్టిపడుతున్నాయి.  ఈ రోజుల లో ప్రజలు బాబా విశ్వనాథ్ ధామ్ ను సందర్శించలేకపోతున్నారు అనేది నిజమే మరి పవిత్రమైనటువంటి శ్రావణ మాసం లో దర్శనం చేసుకోలేకపోవడం తాలూకు మీ యొక్క బాధ ను నేను అర్థం చేసుకోగలను.  మానస్ మందిరం కావచ్చు లేదా దుర్గా కుండ్ కావచ్చు వంటివి ప్రతిఒక్కటీ మూసి ఉన్నాయి అనేది నిజం మరి సంకట్ మోచన్ లో జరిగే సావన్ కా మేలా ను సైతం నిలిపివేశారు. 

కానీ ఇది కూడా నిజం అది ఏమిటి అంటే- ఈ భారీ సంకట కాలం లో, నా కాశీ, మన కాశీ, దీని తో దృఢం గా పోరాడుతున్నది.  నేటి కార్యక్రమం కూడా దీనిలో ఒక భాగం గా ఉన్నది.  ఎంత పెద్ద విపత్తు అయినా సరే, ఎవ్వరూ కూడా ను కాశీ ప్రజానీకం యొక్క భావన కు సాటి రాజాలరు.  ప్రపంచాని కి గతి ని అందించేటటువంటి నగరం ఎదుట కరోనా వంటి సంక్షోభం లెక్క కు రాదు అని మీరు చాటారు. 

కరోనా కారణం గా, ప్రజలు కాశీ లో చాయ్ ని సేవించేటందుకు టీ రింగ్స్ కు వెళ్లడం లేదు అని నా దృష్టి కి వచ్చింది; అందుకని ఇప్పుడు డిజిటల్ పద్ధతి మొదలైంది.  వేరు వేరు ప్రాంతాల కు చెందిన ప్రజలు ఈ సంప్రదాయానికి ఊపిరులూదారు.  ఇక్కడి సంగీత సంప్రదాయాన్ని మహా సంగీతకారులు అయిన బిస్మిల్లా ఖాన్ గారు, గిరిజా దేవి గారు, ఇంకా హీరాలాల్ యాదవ్ గారు ల వంటి వారు సుసంపన్నం చేశారు.  ప్రస్తుతం, కాశీ కి చెందిన నవ తరం కళాకారులు ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకు పోతున్నారు.   గడచిన మూడు- నాలుగు నెలలు గా కాశీ లో అటువంటి అనేక కార్యాల ను నిరంతరం గా చేపట్టడం జరిగింది.  

ఈ కాలం లో, యోగి గారి ని మరియు ప్రభుత్వం లోని వివిధ వ్యక్తుల ను నేను నిరంతరం సంప్రదిస్తూ వస్తున్నాను.  కాశీ నుండి సమాచారం నాకు అందుతూనే ఉంది; మరి నేను వారి కి ఏమి చేయాలి, ఇంకా ఏమి చేయకూడదో మార్గనిర్దేశం చేస్తున్నాను కూడా.  అయినా వారాణసీ లో మీ వంటి వారు అనేకులు ఉన్నారు, ఎవరితో అయితే నేను ఫోన్ లో క్రమం తప్పక మాట్లాడుతూ, మరి సమాచారాన్ని, ఇంకా స్పందనల ను అడిగి తెలుసుకొంటూ ఉన్నానో.  అలా నేను ఫోన్ లో మాట్లాడినటువంటి వారి లో కొంత మంది ఈ కార్యక్రమం లోనూ పాలు పంచుకొంటూ ఉండి వుంటారని నేను నమ్ముతున్నాను. 

సంక్రమణ ను అడ్డగించడానికి ఎవరు ఏయే చర్యల ను తీసుకొంటున్నారు, ఆసుపత్రుల స్థితి ఎలాగ ఉంది, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, క్వారన్టీన్ సంగతి ఏమిటి, బయటి నుండి వస్తున్న శ్రమిక మిత్రుల కు మనం ఎన్ని ఏర్పాటుల ను చేయగలుగుతున్నాము.  ఈ విషయాలు అన్నిటి ని గురించి నేను పదే పదే అడుగుతూ వస్తున్నాను. 
 
మిత్రులారా,

మన కాశీ లో బాబా విశ్వనాథ్ మరియు మాత అన్నపూర్ణ- వీరు ఉభయులూ వసిస్తున్నారు.  ఒక సందర్భం లో భగవాన్ మహాదేవుడు  స్వయం గా మాత అన్నపూర్ణ ను భిక్ష కై అడిగినట్లు ప్రాచీనమైనటువంటి విశ్వాసమంటూ ఒకటి ప్రచారం లో ఉన్నది.  అప్పటి నుండి, కాశీ కి ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన దక్కింది.. అది ఏమిటి అంటే- ఇక్కడ ఏ ఒక్కరు కూడా ను పస్తు పడుకోరు అని, మాత అన్నపూర్ణ మరియు బాబా విశ్వనాథ్ ప్రతి ఒక్కరి కి ఆహారాన్ని సమకూర్చుతారు అనీనూ. 

మన అందరి ని, ప్రత్యేకించి మీ అందరి ని, ఈ కాలం లో పేదల కు సేవ చేసే ఒక మాధ్యమం గా దైవం మార్చడం మీ అందరి కి, సంస్థలన్నిటి కి దక్కినటువంటి ఒక సౌభాగ్యం గా ఉన్నది.  ఒక రకం గా, ప్రతి ఆపన్న వ్యక్తి కి మీరు మాత అన్నపూర్ణ మరియు బాబా విశ్వనాథ్ ల యొక్క దూత ల వలె ఉన్నారు. 

అంత తక్కువ వ్యవధి లో మీరు ఒక ఫూడ్ హెల్ప్ లైన్ తో ముందుకు వచ్చారు; సాముదాయిక వంటగదుల యొక్క విస్తారమైనటువంటి నెట్ వర్క్ ను నిర్మించడం, హెల్ప్ లైన్ లను అభివృద్ధిపరచి, ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని మరియు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించారు; ఇంకా, ఈ ప్రయోజనం కోసమని వారాణసీ లోని కంట్రోల్ ఎండ్ కమాండ్ సెంటరు ను పూర్తి స్థాయి లో ఉపయోగించుకొన్నారు.  అంటే, ప్రతి ఒక్కరు పేదల కు ప్రతి ఒక్క స్థాయి లో సాయపడేందుకుగాను పూర్తి సామర్థ్యం తో శ్రమించారు అన్నమాటే.   ఇంకా నన్ను ఇది కూడా చెప్పనివ్వండి, మన దేశం లో సేవా స్ఫూర్తి అనేది ఒక క్రొత్త విషయం ఏమీ కాదు; అది మన సంస్కృతి లో ఇమిడిపోయివుంది అని.  అయితే ఈ సారి ప్రజల కు సేవ చేయడం అనేది ఒక సాధారణమైన పని ఏమీ కాదు.  ఈ పర్యాయం అది సంతోషం గా లేనటువంటి ఏ ఒక్కరి కన్నీటి నో తుడవడం మాత్రమే కాక, అది ఒక వ్యాధి.. అదే కరోనావైరస్.. సోకే ముప్పు సైతం దానితో వెంటబెట్టుకువచ్చింది.  మరి ఈ కారణం గా, సేవా స్ఫూర్తి కి తోడు త్యాగం చేయాలన్న స్ఫూర్తి కలగలసిపోయింది.  మరి అందుకనే కరోనా సంక్షోభం లో భారతదేశం లోని మూల మూల న శ్రమించిన ప్రజలు చేస్తున్నది ఒక చిన్న పని ఏమీ కాదు!  ఇది కేవలం విధి ని నిర్వర్తించడం గురించిన సంగతి కాదు.  వారి కట్టెదుట ఒక భయం, ఒక మహా అపాయం ఉండినాయి; మరి వారు వాటి ని వారంతట వారు గా ఎదుర్కో సాగారు.  ఇది ఒక క్రొత్త రూపం లోని సేవ గా ఉన్నది.

మరి నాతో చెప్పారు ఎప్పుడైతే జిల్లా పాలన యంత్రాంగం ఆహారాన్ని పంచిపెట్టడానికి తన దగ్గర గల వాహనాల కు కొరత ను ఎదుర్కొన్నదో, తపాలా విభాగం తన వద్ద ఉపయోగం లో లేకుండా పడి ఉన్న తపాలా శకటాల ను ఈ ప్రయోజనం కోసం వినియోగించింది అని.  ఒక్కసారి ఊహించండి.. ఇంతకు ముందు ప్రభుత్వం మరియు పాలన యంత్రాంగం యొక్క ప్రతిష్ట ఎలా ఉండింది అంటే అడిగిన ప్రతి ఒక్క దాని ని నిరాకరించడం జరిగింది.  విభాగాలు అధికార పరిధి అంశం పై పోట్లాడుకొనేవి..  ‘ఇది నా విభాగం.  దీనిని నేను మీకు ఎందుకు ఇవ్వాలి?’ అంటూ.  కానీ ఇక్కడ మనం చూశాము- అది ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా మరొకరి కి సాయపడుతూ ఉండటాన్ని.  ఈ సంఘీభావం, ఏకత.. ఇవే కాశీ ని మరింత గొప్పది గా చేసివేశాయి.  మరి మనకు ఇక్కడ పాలన యంత్రాంగం ఉన్నది, గాయత్రి పరివార్ రచనాత్మక్ ట్రస్ట్, రాష్ట్రీయ రోటీ బ్యాంకు, భారత్ సేవాశ్రమ్ సంఘ, మన సింధీ సోదరీమణులు మరియు మన సింధీ సోదరులు, భగవాన్ అవధూత్ రాం కుష్ఠ్ సేవా ఆశ్రమ్, సర్వేశ్వరి సమూహ్ కానివ్వండి, బ్యాంకుల తో, వ్యాపార సంఘాల తో అనుబంధాన్ని కలిగివున్న వారు కానీయండి, ఇంకా పేదల కు మరియు ఆపన్నుల కు సాయపడుతున్న అటువంటి వారు లెక్క లేనంత మంది.. మరి వీరందరూ కాశీ యొక్క కీర్తి ని పెంపు చేశారు.  కానీ నేను 5-6 మంది ని గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడగలను.  మానవాళి యొక్క సేవ లో వారి ని వారు సమర్పణం చేసుకొన్నటువంటి ప్రజలు మరియు సంస్థ లు వేల సంఖ్య లో ఉన్నాయి;  కానీ నేను వారందరి గురించి మాట్లాడలేను.  నేను ప్రతి ఒక్కరి శ్రమ కు ఈ రోజు న వందనాన్ని ఆచరిస్తున్నాను.  ఈ కార్యభారం లో ప్రమేయం కలిగిన అటువంటి ప్రతి ఒక్కరి కి ఇదే నా వందనం.  మరి నేను ఈ రోజు న మీతో మాట్లాడుతున్న వేళ లో, నేను కేవలం సమాచారాన్నే అడగడం లేదు, నేను మీ నుండి ప్రేరణ ను సైతం పొందుతూ ఉన్నాను.  మీ వంటి వారు ఈ సంకట కాలం లో మరింత గా పాటుపడ్డారు, మరి మీ యొక్క ఆశీర్వాదాలు కావాలి అని నేను కోరుకొంటున్నాను.  మరి బాబా భోలేనాథ్, ఇంకా మాత అన్నపూర్ణాదేవి మీకు మరింత బలాన్ని ప్రసాదించు గాక.
 
మిత్రులారా,

ఈ కరోనా సంకటం ప్రజలు ఆలోచించేటటువంటి, ప్రజలు పనిచేసేటటువంటి, ప్రజలు తినేటటువంటి మరియు ప్రజలు త్రాగేటటువంటి పద్ధతుల ను పూర్తి గా మార్చివేసింది.  మరి మీరు చేసిన రీతి లోని సేవ సామాజిక జీవనం మీద ఒక పెద్ద ప్రభావాన్ని ప్రసరించింది.  నేను నా చిన్నతనం లో ఈ మాటల ను వినేవాడి ని.. అవి ఏమిటి అంటే.. ఒక స్వర్ణకారుడు ఉండే వాడు.  అతడు అతడి యొక్క ఇంట్లోనే పని చేసే వాడు, మరి కొన్ని కుటుంబాల వారి కోసం బంగారు వస్తువుల ను తయారు చేస్తూ ఉండే వాడు అని.  కానీ ఆయన కు ఒక అలవాటు ఉంది.  అతడు బజారు నుండి దాతున్ లను కొనుగోలు చేసే వాడు.  మనం ఉదయం పూట బ్రశ్ లను ఉపయోగిస్తాం కానీ ఆ కాలం లో మనం పళ్ల ను దాతున్ ల తో శుభ్రపరచుకొనే వారు.  మరి ఆ వ్యక్తి ఆసుపత్రి కి పోయి రోగుల యొక్కయు వారి బంధువుల యొక్కయు సంఖ్య ను లెక్కించి, సాయంత్రం పూట వారందరి కి దాతున్ లను ఇచ్చి సాయపడేవాడు.  అతడి కి ఆ ప్రాంతం అంతటి లో పేరు వచ్చేసింది.  ప్రతి ఒక్కరు ఆయన యొక్క సేవా భావన ను గురించి ఎంత గా మాట్లాడుకొనే వారు అంటే బంగారం తో సంబంధం ఉన్న ఏ పని కి అయినా వారు ఆయన వద్దకే వెళ్లడానికే మొగ్గు చూపేది.  అంటే, ఆయన ప్రజల కు సేవ చేస్తూ ఉన్నపపటికీ కూడాను, తన పట్ల ఆయన ఒక విశిష్టమైనటువంటి విశ్వసనీయత ను కుదుర్చుకోగలిగారు.  ప్రతి ఒక్క పరివారాని కి ఆయన ఒక నమ్మకస్తుడైన వ్యక్తి గా మారిపోయారు.  దీనర్థం, మన సంఘం సేవా భావన ను కేవలం ఇచ్చి పుచ్చుకొనే దాని కంటే ఏదో మిన్న అయినది గా భావిస్తుంది అని.  మరి ఎవరైతే సేవ ను అందుకొంటారో, వారు తనకు ఏ అవకాశం వచ్చినా తాను సైతం ఎవరో ఒకరి కి సేవ చేస్తాను అని నిర్ణయించుకొంటారు.  ఈ చక్రభ్రమణం సాగుతూ ఉంటుంది.  సంఘాని కి ప్రేరణ ను ఇచ్చేది ఇదే.  

అంతటి భయానకమైన ప్రపంచవ్యాప్త వ్యాధి ఒకటి వంద సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని కమ్ముకొందని మీరు వినే ఉంటారు, మరి ఇప్పుడు వంద సంవత్సరాల కు ప్రపంచాన్ని మరొక విశ్వమారి చుట్టుముట్టింది.  ఆ కాలం లో భారతదేశం లో అంత భారీ జనాభా లేదు.  కానీ ఆ కాలం లో, సదరు మహమ్మారి కి ప్రజలు గరిష్ఠ సంఖ్య లో 
 బలైన దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉంది.  కోట్ల మంది మరణించారు.  మరి ఈ విశ్వమారి వేళ లో, యావత్తు ప్రపంచం భారతదేశం అనే పేరు ను  వింటే చాలు భయపడిపోయింది.  వందేళ్ల కిందట భారతదేశం మహమ్మారి కారణం గా నాశనమైంది అని నిపుణులు ఉట్టంకించ సాగారు;  భారతదేశం లో ఎంతో మంది చనిపోయారు, మరి ఇవాళ భారతదేశం యొక్క జనాభా కూడాను భారీ గా పెరిగిపోయింది, అనేకమైన సవాళ్లు ఉన్నాయి.  వారు భారతదేశాని కి పలు ప్రశ్నల ను వేయడం మొదలుపెట్టారు.  వారు తలపోశారు ఈ మారు సైతం భారతదేశం కుదేలు అవుతుంది అని.  కానీ జరిగింది ఏమిటి?  ఉత్తర్ ప్రదేశ్, 23-24 కోట్ల జనసంఖ్య కలిగిన రాష్ట్రం, ఏ విధం గా కాపాడబడుతుంది అంటూ ప్రజల లో బోలెడన్ని సందేహాలు తలెత్తడం మీరు చూసే ఉంటారు.  మరికొందరు అనే వారు, యుపి లో బోలెడంత పేదరికం ఉన్నది, చాలా మంది ప్రవాసీ శ్రమికులు అక్కడ ఉన్నారు, వారంతా రెండు గజాల దూరాన్ని ఎలా పాటించగలరు? వారు కరోనా తో కాకుంటే ఆకలి వల్ల ప్రాణాలు వదులుతారు అని.   కానీ మీ యొక్క సహకారం, కఠోర శ్రమ మరియు ఉత్తర్ ప్రదేశ్ ప్రజ యొక్క బలం ఆ భయానుమానాలు అన్నిటి చెల్లాచెదరు చేసివేశాయి.

మిత్రులారా,

బ్రాజీల్ వంటి ఒక పెద్ద దేశం లో, ఎక్కడయితే సుమారు 24 కోట్ల మంది జనాభా ఉన్నారో, అక్కడ 65000 మంది కి పైగా కరోనా వల్ల చనిపోయారు.  కానీ దాదాపు గా అంతే జనాభా కలిగిన యుపి లో, ఇంచుమించు 800 మంది కరోనా బారి న పడి మరణించారు. 

అంటే, యుపి లో, వేల మంది ప్రాణాల ను- ప్రాణ నష్టం ఏర్పడే స్థితి ఉండగా- కరోనా కోరల లో నుండి కాపాడడం జరిగింది.  ప్రస్తుతం స్థితి ఎలాగ ఉంది అంటే, ఉత్తర్ ప్రదేశ్ లో సంక్రమణ వ్యాప్తి యొక్క వేగాన్ని నియంత్రించడమొక్కటే కాకుండా కరోనా ప్రభావానికి లోనైన వారు కూడా ను శీఘ్రం గా కోలుకొంటున్నారు.  దీనికి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే అది మీ వంటి గొప్ప మనుషులు అందిస్తున్న జాగృతి, సేవ మరియు సక్రియత లే.  మీ వంటి సామాజిక, ధార్మిక మరియు పరోపకార సంస్థలు, మీ యొక్క సంకల్పం, ఇంకా మీ యొక్క విలువలు సంఘం లో ప్రతి ఒక్కరి కి ఈ కష్ట కాలం లో కరోనావైరస్ తో పోరాడేందుకు శక్తి ని ఇచ్చాయి; అంతే కాక ఈ శక్తి అత్యంత క్లిష్ట కాలాల్లో ఎంతో సహాయకారి గా నిలచింది.

మిత్రులారా,

మనం కాశీ లో నివసిస్తున్నాము.  మరి కబీర్ దాస్ గారు అన్నారు -

‘సేవక్ ఫల్ మాంగే నహీ, 
సేబ్ కరే దిన్ రాత్ ’ అని.

ఈ మాటల కు .. ఇతరుల కు సేవ చేసేటటువంటి వారు ఆ సేవ తాలూకు ఫలాల ను ఆశించరు.. అని భావం.  ఆయన రాత్రనక పగలనక ఒక నిస్వార్ధమైన సేవ లో తలమునకలు అయ్యారు.  అన్యుల కు నిస్వార్థ సేవ చేయాలి అనేటటువంటి ఈ యొక్క విలువ లుల ప్రస్తుతం ఈ యొక్క కష్ట కాలం లో దేశవాసుల కు సాయపడుతున్నాయి.  ఈ యొక్క భావన తోనే కేంద్ర ప్రభుత్వం కూడాను కరోనా విశ్వమారి వేళ పౌరుల కష్టాల ను పంచుకోవడానికి, మరి వాటి ని తగ్గించడానికి నిరంతర ప్రయాస లు పడింది.  పేదల కు ఆహార సామగ్రి అందేటట్టు, వారు జేబుల లో డబ్బు ను కలిగివుండేటట్టు, వారు ఉపాధి ని పొందేటట్టు, మరి వారి శ్రమ కై రుణం పొందేటట్టు పూచీ పడడానికి మేము యత్నిస్తున్నాము.   

మిత్రులారా,

ఇవాళ భారతదేశం లో 80 కోట్ల మంది కి పైగా ప్రజల కు ఆహార సామగ్రి ని ఉచితం గా ఇవ్వడం జరుగుతున్నది.  ఇది పేదల కు మరియు వారాణసీ లోని శ్రమికుల కు కూడానుఎంతగానో లబ్ధి ని చేకూర్చుతున్నది.  భారతదేశం, అమెరికా జనాభా కు రెండింతల జనాభా కలిగిన భారతదేశం, ఒక్క పైసా అయినా తీసుకోకుండా వారికి సాయాన్ని అందిస్తూ వారిని కాపాడుకొంటున్నది.  మరి ఈ యొక్క పథకాన్ని నవంబర్ 30వ తేదీ వరకు, అంటే దీపావళి ఇంకా ఛఠ్ పూజ ల వరకు, పొడిగించడమైంది.  ఏ ఒక్క బీద వ్యక్తి పండుగల వేళ ఆహారానికి దూరం కాకుండా పూచీ పడడానికి మేము కృషి చేస్తున్నాము.  ఆహారానికి తోడు, పేద లు లాక్ డౌన్ కాలం లో వంట చేసుకోవడానికి గాను ఇంధనాన్ని పొందడం లో ఎటువంటి సమస్య ను ఎదుర్కోకుండా ఉండాలని
గత మూడు నెలలు గా ఉజ్వల పథకం యొక్క లబ్ధిదారుల కు గ్యాస్ సిలిండర్ లను ఉచితం గా  అందించడం జరుగుతున్నది.

మిత్రులారా,

ప్రభుత్వం స్థిరం గా శ్రమిస్తూ, మరి చరిత్రాత్మకమైన నిర్ణయాల ను- అది పేదల జన్ ధన్ ఖాతాల లో వేల కోట్ల రూపాయల ను జమ చేసే నిర్ణయం కావచ్చు, లేదా పేదల కు చిన్న పరిశ్రమల కు, మరియు వీధుల వెంట తిరుగుతూ సరుకులు అమ్మే వ్యక్తుల కు సులభంగా రుణాల ను సమకూర్చడం కావచ్చు, లేదా శ్రమికుల ఉపాధి పరమైన నిర్ణయం కావచ్చు, లేదా వ్యవసాయాని కి, పశు పోషణ కు, మత్స్య పరిశ్రమ కు సంబంధించిన నిర్ణయాలు మొదలైనవి కావచ్చు-  తీసుకొన్నది.  

కొద్ది రోజుల క్రిందట, 20000 కోట్ల రూపాయల తో ఒక చేపల పెంపకం పథకాని కి ఆమోదం తెలపడమైంది.  ఇది ఈ ప్రాంత చేపల రైతుల కు కూడాను లబ్ధి ని చేకూర్చుతుంది.  దీనికి అదనం గా, యుపి లో కొన్ని రోజుల క్రితం ఉద్యోగకల్పన మరియు స్వతంత్రోపాధి కల్పన లకై మరొక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమం లో భాగం గా, చేతి వృత్తుల వారు, నేతకారులు, ఇతర చేతి పనివారు గాని లేదా ఇతర రాష్ట్రాల నుండి తిరిగివచ్చినటువంటి కార్మికులు గాని లక్షలాది శ్రమికుల కు కొలువుల ను ఏర్పాటు చేయడమైంది.

మిత్రులారా,

ఈ కరోనా సంకటం ఎంత పెద్దది అంటే దీని ని సంబాళించడానికి నిరంతర కృషి జరపడం అవసరం.  మనం హాయి గా కూర్చోజాలము.  ప్రతి ఒక్కరు కనిష్ఠ కష్టాన్ని ఎదుర్కొనేటట్టు అదే కాలం లో వారాణసీ ముందుకు సాగుతూ ఉండేటట్టు పూచీపడడానికి మేము నిరంతరం యత్నిస్తున్నామని నేను మా నేత సోదరీమణులు, మా నేత సోదరులు, పడవల ను నడిపే నావికులు, వ్యాపారులు మరియు వర్తకులు, ఇంకా అందరి కి భరోసా ను ఇవ్వదలచుకొన్నాను.  కొన్ని రోజుల క్రితం సాంకేతిక విజ్ఞానం సహాయం తో నేను వారాణసీ యొక్క అభివృద్ధి పనుల పై పాలనయంత్రాంగం తోను, నగరం యొక్క మన శాసనసభ్యుల తోను ఒక సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించాను.  దీనిలో, బాబా విశ్వనాథ్ ధామ్ పరియోజన యొక్క ప్రస్తుత స్థితి తో పాటు ఇతర ప్రాజెక్టు లు అయిన రోడ్లు, విద్యుత్తు, ఇంకా జలం వంటి వాటి స్థితి గతుల గురించి సమగ్ర సమాచారాన్ని నా దృష్టి కి తీసుకువచ్చారు.  కొన్ని అవసరమైన సూచనలను నేను కూడా ఈ సమావేశం లో ప్రస్తావించాను.  కొన్ని సందర్భాల లో అడ్డంకులు సైతం ఎదురవుతాయి, అప్పుడు వాటి ని తొలగించడం కోసం ఏయే చర్యలను అయతే చేపట్టాలో వాటిని చేపట్టాలి అని నేను అన్నాను. 

ప్రస్తుతం, దాదాపు 8000 కోట్ల రూపాయల విలువ కల వివిధ పరియోజనల తాలూకు పనులు కాశీ లో శర వేగం గా జరుగుతూ ఉన్నాయి.  8000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు!  అంటే, దీని నుండి ఎంతో మంది ప్రజలు బ్రతుకుతెరువు ను పొందుతారు అన్నమాట.  పరిస్థితులు సాధారణ స్థాయి కి తిరిగివచ్చినప్పుడు, కాశీ కి పూర్వ వైభవం పున:ప్రాప్తిస్తుంది. 

అందుకోసం ఇప్పటి నుండే మనం సిద్ధం కావలసి ఉన్నది.  ఈ కారణం గా, అన్ని పరియోజన ల పూర్తి పట్ల, ప్రత్యేకించి  క్రూజ్ టూరిజమ్, లైట్ ఎండ్ సౌండ్ శోస్, దశాశ్వమేధ్ ఘాట్ పునరుద్ధరణ, గంగా ఆరతి కై ఆడియో-వీడియో స్క్రీన్ ల స్థాపన ల వంటి పర్యటన సంబంధి పరియోజనల ను పూర్తి చేయడం పట్ల శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది.  

మిత్రులారా,

రాబోయే రోజుల లో, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో కాశీ ఒక ప్రధాన కేంద్రం గా మారడాన్ని మనమంతా చూడాలనుకొంటున్నాము.  మరి ఇది మనం అందరి యొక్క బాధ్యత కూడాను.  ప్రభుత్వం తీసుకొన్న ఇటీవలి నిర్ణయాల అనంతరం, ఇక్కడ చీరెల కై నూతన వ్యాపార అవకాశాలు అందివస్తాయి.  అలాగే ఇతర హస్తకళలు, పాడి, చేపల పెంపకం, ఇంకా తేనెటీగల పెంపకానికి సంబంధించిన అవకాశాలు కూడాను.  బీ-వేక్స్ కు ప్రపంచం లో బోలెడంత గిరాకీ ఉన్నది.  దానిని భర్తీ చేసేందుకు మనం ప్రయత్నించవచ్చు. 

ఈ కోవ కు చెందిన వ్యాపారాల లో పెద్ద ఎత్తున పాలుపంచుకొనేటట్టు చూడవలసింది గా రైతుల కు మరియు నా యువ మిత్రుల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.  అది మన బాధ్యత గా ఉంది.  మన అందరి ప్రయాసల తో, భారతదేశం యొక్క ఒక పెద్ద ఎగుమతి కేంద్రం గా కాశీ ఎదగగలుగుతుంది.  మనం కాశీ ని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కు ఒక ప్రేరణదాయకమైన వనరు గా కూడా ను అభివృద్ధిపరచి తీరాలి.

మిత్రులారా,

మీ అందరి ని చూసేందుకు ఒక అవకాశం నాకు లభించినందుకు నేను నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను; శ్రావణ మాసం లో కాశీవాసుల తో భేటీ కావడం ఒక సౌభాగ్యం కూడాను.  మీరు ప్రజల కు ఏ విధం గా అయితే  సేవల ను అందించారో, ఇంకా సమధికోత్సాహం తో ఆ సేవల ను కొనసాగిస్తున్నారో అందుకు గాను మీకు నేను నిజం గా కృత‌జ్ఞుడినై ఉన్నాను.  

మీరు మీ యొక్క పరోపకార కార్యాలు మరియు సేవ ల ద్వారా ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను ఇచ్చారు; మరి మీరు భవిష్యత్తు లో కూడా ను ప్రేరణ ను ఇవ్వడాన్ని కొనసాగించాలి.  అయితే ఒకటి, దేనినయితే మనం పదే పదే చేయవలసివుంది అంటే అది- ప్రతి ఒక్కరి తో కలసి చేయడమూ, వ్యక్తిగతం గా చొరవ ను తీసుకోవడమూ ను.  మనం ఒక సారి ఉపయోగించే ప్లాస్టిక్ నుండి విముక్తి ని కోరుకొంటున్నాము.  ఈ అంశాన్ని మనం అనాదరించ తగదు.  రహదారుల మీద ఉమ్మి వేసే అలవాటు ను మనం మార్చుకోవలసి ఉన్నది.  రెండోది, మనం రెండు గజాల దూరాన్ని పాటించడాన్ని, ముఖాని కి ముసుగు ను కప్పుకోవడాన్ని మరియు చేతుల ను కడుక్కొనే అలవాటు ను వదలివేయనే కూడదు; వీటి ని ఇతరులు సైతం పాటించేటట్టు మనం చూడాలి కూడాను.  ఇక ఈ పనుల ను మన సంస్కృతి గా మనం మార్చుకోవాలి, వీటిని మన అలవాటు గా చేసుకోవాలి.   

బాబా విశ్వనాథ్ యొక్క మరియు గంగా మాత యొక్క ఆశీస్సు లు మీ అందరి కి లభించు గాక. ఈ అపేక్ష తో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను.   మీరంతా చేస్తున్నటువంటి గొప్ప కార్యానికి గాను మరొక్క సారి నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.

అనేకానేక ధన్యవాదములు.  

హర్ హర్ మహాదేవ్.


***



(Release ID: 1655010) Visitor Counter : 202