వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆట వస్తువుల (నాణ్యత నియంత్రణ) ఆదేశం-2020 అమలు తేదీ గడువు పొడిగింపు

प्रविष्टि तिथि: 16 SEP 2020 10:48AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ), ఆట వస్తువుల అమలు (నాణ్యత నియంత్రణ) ఆదేశం గడువును పొడిగించింది. తొలుత 1.9.2020గా ఉన్న అమలు తేదీని 1.1.2021 వరకు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది.

గడువు పెంపు వల్ల... కొవిడ్ కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి, వస్తువుల తయారీలో ప్రమాణాలు పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి దేశీయ తయారీదారులకు మరో 4 నెలల అదనపు సమయం దొరుకుతుంది.

***


(रिलीज़ आईडी: 1654878) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam