ప్రధాన మంత్రి కార్యాలయం

హైపర్ సానిక్ టెస్ట్ డిమాన్ స్ట్రేషన్ వెహికిల్ యాత్ర విజయవంతం: డి ఆర్ డి ఓ కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 07 SEP 2020 8:16PM by PIB Hyderabad

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ్ (డి ఆర్ డి ఓ) హైపర్ సానిక్ టెస్ట్ డిమాన్ స్ట్రేషన్ వెహికిల్ యాత్రను  విజయవంతం చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

ఈ విషయమై ప్రధాని ఒక ట్వీట్ చేస్తూ, " ఈరోజు హైపర్ సానిక్ టెస్ట్ డిమాన్ స్ట్రేషన్ వెహికిల్ యాత్రను  విజయవంతం చేసినందుకు డి ఆర్ డి వో కు నా అభినందనలు. మన శాస్త్రవేత్తలు రూపొందించిన స్క్రామ్ జెట్ ఇంజన్ ఈ యాత్రను విజయవంతం చేస్తూ శబ్దవేగానికి ఆరురెట్ల వేగాన్ని సాధించింది! అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ రోజు ఇలాంటి సామర్థ్యముంది. " అని పేర్కొన్నారు.

***(Release ID: 1652164) Visitor Counter : 219