ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో 4.23 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోనే 43% కేసులు
Posted On:
31 AUG 2020 12:24PM by PIB Hyderabad
కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలన్న నిర్ణయానికి కట్టుబడి భారత్ పెద్ద ఎత్తున పరీక్షలు జరుపుతోంది. దీంతో వాటి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది జనవరిలో పూణెలోని ఒకే ఒక్క లాబ్ లో పరీక్షలు జరుపుతూ ఉండగాఇప్పుఇడు ఆగస్టు నెల వచ్చేసరికి రోజుకు పది లక్షల పరీక్షలు జరపగలిగే స్థాయికి వచ్చాం. ఇప్పటివరకు జరిఒపిన మొత్తం పరీక్షల సంఖ్య ఈ రోజు 4.23 కోట్లకు చేరగా గడిచిన 24 గంటల్లో 8,46,278 పరీక్షలు జరిగాయి.
దేశంలో గడిచిన 24 గంటల్లో ( ఆదివారం, ఆగస్టు 30న) 78,512 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందువలన కొన్ని మీడియాలలో ప్రచారం జరుగుతున్నట్టుగా 80,000 కే నమోదయ్యాయని అనటం నిరాధారం. ఏడు రాష్ట్రాలే ఈ 24 గంటల్లో నమోదైన మొత్తం కేసులలో 70% కేసులకు కారణం. వాటిలో మహారాష్ట్ర అత్యధికంగా 21%, కేసులు నమోదు చేయగా ఆంధ్రప్రదేశ్ (13.5%), కర్నాటక (11.27%) , తమిళనాడు (8.27%) తో ఆ తరువాత మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 8.27%, పశ్చిమ బెంగాల్ 3.85%, ఒడిశా 3.84% తో ఆ తరువాత ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో మూడు రాష్ట్రాల్లో, అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో 43% నమోదు కాగా తమిళనాడులో మొత్తం కేసుల్లో 11.66% ఉన్నాయి. నిన్నటి మరణాలలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలవే 50% ఉన్నాయి. అందులో మహారాష్ట్రలోనే అత్యధికంగా 30.48% ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదల ఎక్కువగా ఉన్న, మరణాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి సమన్వయం సాధిస్తూ మరింత దూకుడుగా పరీక్షలు నిర్వహించాలని, సమర్థవంతంగా చికిత్సలు జరపాలని, మరణాల శాతం కనీస స్థాయికే పరిమితమయ్యేలా చూడాలని కోరుతూ వస్తోంది. తగిన విధంగా పర్యవేక్షణ ఉండాలని కూడా కోరింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
(Release ID: 1650010)
Visitor Counter : 407
Read this release in:
Punjabi
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada