ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో సుమారు 75 శాతానికి చేరిన కోవిడ్ రిక‌వ‌రీ రేటు

కోవిడ్ యాక్టివ్ కేసుల‌ను మించి కోలుకున్న పేషెంట్ల సంఖ్య‌

యాక్టివ్ కేసుల క‌న్నాసుమారు 16 ల‌క్ష‌ల ఎక్కువ‌‌గా కోలుకున్న కేసులు

అంత‌ర్జాతీయంగా ఇండియాలో అత్య‌ల్ప కోవిడ్ మ‌ర‌ణాల రేటు, మ‌రింత త‌గ్గిన మ‌ర‌ణాలు

Posted On: 23 AUG 2020 2:50PM by PIB Hyderabad

 

కోవిడ్ నుంచి  కోలుకున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌డంతో ఇండియాలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి రేటు సుమారు 75 శాతానికి చేరింది.
గ‌త 24 గంట‌ల‌లో కోవిడ్  నుంచి 57,989 మంది పేషెంట్లు కోలుకోవ‌డంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఈరోజు  22,80,566 కు చేరింది.

దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న మొత్తం కేసుల సంఖ్య‌, యాక్టివ్ కేసులు (7,07,668) క‌న్న 16 ల‌క్ష‌లు ఎక్కువ (15,72,898).

                         


గ్రాఫ్ లో సూచించిన‌ట్టు, స‌గ‌టున రోజువారీగా కోలుకుంటున్న కోవిడ్ కేసులు (1-7-2020)న 15,018 ఉండ‌గా 2020 ఆగ‌స్టు 19-13 వారంలొ  అది 60,557 గా ఉంది.
                          


క్ర‌మంగా నానాటికీ కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డంతో దేశం వాస్త‌వ  కేస్‌లోడ్  అంటే యాక్టివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప్ర‌స్తుతం ఇది మొత్తం పాజిటివ్ కేసుల‌లో కేవలం 23.24 శాతంగా మాత్ర‌మే ఉంది. ఇది క్ర‌మంగా మ‌ర‌ణాల రేటు త‌గ్గ‌డానికి కూడా కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం దేశంలో 1.86 శాతం కేస్ ఫాట‌లిటీ రేటు (సిఎఫ్ఆర్ ) ఉంది. అంత‌ర్జాతీయంగా ఇది అత్య‌ల్పంగా ఉన్న‌దేశం మ‌న‌ది. దేశంలో పెద్ద ఎత్తున కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, కోవిడ్ బాధితుల‌ను గుర్తించి వారికి స‌కాలంలో స‌మ‌ర్ధ చికిత్స అందించాల‌న్న కేంద్రప్ర‌భుత్వ విధానం వ‌ల్ల ఇది సాధ్య‌మైంది.
కోవిడ్‌నుంచి కోలుకునే వారి శాతం పెర‌గ‌డం, మ‌ర‌ణాలరేటు త‌గ్గ‌డాన్ని గ‌మ‌నించిన‌పుడు , కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఇండియా చేప‌ట్టిన సానుకూల వ్యూహాలు స‌త్ఫ‌లితాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in కు అలాగే @CovidIndiaSeva కు పంప‌వ‌చ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .


 

****


(Release ID: 1648056) Visitor Counter : 184