ప్రధాన మంత్రి కార్యాలయం

ఐసిఎమ్ ఆర్ ప్రయోగశాల లు మూడింటి లో అధిక స్తోమత కలిగిన కోవిడ్-19 పరీక్ష సదుపాయాల ను ప్రారంభించిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 27 JUL 2020 6:05PM by PIB Hyderabad

నమస్తే.

కోట్లాది భారతదేశ పౌరులు కరోనా విశ్వమారి తో చాలా ధైర్యం గా పోరాడుతూ ఉన్నారు.

కరోనా పై పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు ఉత్తర్ ప్రదేశ్ లు సలుపుతున్న సమరాన్ని ఈ రోజు న ప్రారంభించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడినటువంటి పరీక్ష సదుపాయాలు  మరింత గా బలోపేతం చేయగలవు. 

మిత్రులారా,

దిల్లీ-ఎన్ సిఆర్, ముంబయి, ఇంకా కోల్ కాతా లు ఆర్థిక కార్యకలాపాల కు ప్రధాన కేంద్రాలు గా ఉన్నాయి.  లక్షల మంది యువతీయువకులు వారి యొక్క ఉద్యోగ జీవనం కోసం మరియు వారి యొక్క కలల ను పండించుకోవడం కోసం దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ఈ నగరాలల కు వస్తూ ఉంటారు.  ఈ మూడు నగరాల లో ప్రస్తుత పరీక్ష కేంద్రాల సామర్థ్యానికి అదనం గా సుమారు 10,000 పరీక్ష సదుపాయాల ను జోడించడం జరుగుతుంది.

ఈ నగరాల లో ఇక పరీక్షల ను మరింత శీఘ్ర గతి న నిర్వహించడం జరుగుతుంది.  ఒక మంచి విషయం ఏమిటి అంటే ఈ యొక్క అత్యాధునిక సాంకేతికత తో కూడిన ప్రయోగశాల లు ఒక్క కరోనా పరీక్షల కే పరిమితం కావు.

రాబోయే కాలం లో, ఈ ప్రయోగశాలల కు హెపెటైటిస్ బి మరియు సి, హెచ్ఐవి, ఇంకా డెంగి సహా అనేక ఇతర వ్యాధుల కు సంబంధించిన పరీక్షల ను సైతం నిర్వహించే విధం గా తగినటుటవంటి ఏర్పాటుల ను వీటి లో జతపరచడం జరుగుతుంది.

ఆ తరహా ఏర్పాటుల ను చేస్తున్నందుకు గాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ ఆర్) లోని మిత్రుల కు అనేకానేక అభినందన లు.

 మిత్రులారా,

ప్రస్తుతం భారతదేశం సరైన కాలం లో సరి అయినటువంటి నిర్ణయాల ను తీసుకొన్న కారణం గా ఇతర దేశాల తో పోల్చినపుడు మరింత నిలకడతనం కలిగినటువంటి స్థితి లో ఉన్నది.  ప్రస్తుతం, మన దేశం లో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య పెద్ద దేశాల కంటే చాలా తక్కువ గా ఉన్నది.  అదే కాలం లో, రోగ నివృత్తి స్థాయి కూడాను ఇతర దేశాల కంటే చాలా అధికం గా ఉంటూ మరి రోజు రోజు కు మెరుగుపడుతున్నది కూడాను.  ప్రస్తుతం, భారతదేశం లో కరోనా కు గురై కోలుకొన్న వారి సంఖ్య ఇంచుమించు 10 లక్షల కు చేరుకోనున్నది.  

మిత్రులారా,

కరోనా పై దీర్ఘ కాలికం పాటు సాగే చాలా పెద్ద సమరం లో  ప్రధానం గా కరోనా చికిత్స కై ఉద్దేశించిన ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను దేశం లో శరవేగం గా ఏర్పాటు చేయడం అతి ముఖ్యమైనటువంటి సంగతి.  ఈ కారణం గా, ఆరంభం లోనే, కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల పాకేజీ ని ప్రకటించింది.

అవి ఐసలేశన్ కేంద్రాలు కావచ్చు, ప్రత్యేకం గా కోవిడ్ చికిత్స కే ఉద్దేశించినటువంటి ఆసుపత్రులు కావచ్చు లేదా పరీక్షల కోసం, ట్రేసింగు ఇంకా ట్రాకింగుల కు ఉద్దేశించిన నెట్ వర్కింగ్ కావచ్చు.. భారతదేశం తన సామర్థ్యాల ను అతి శీఘ్రతరం గా విస్తరించుకొంటూ పోయింది.  ప్రస్తుతం భారతదేశం లో 11,000 కు పైగా కోవిడ్ సదుపాయాలు, ఇంకా 11 లక్షల కు పైగా ఐసలేశన్ బెడ్స్ ఉన్నాయి.

 మిత్రులారా,

జనవరి లో, మన దగ్గర కరోనా పరీక్ష కు ఒకే ఒక కేంద్రం ఉండింది.  కాగా ప్రస్తుతం కరోనా పరీక్షల కోసం యావత్తు దేశం లో సుమారు 1300 ప్రయోగశాల లు పనిచేస్తున్నాయి.  ప్రస్తుతం, భారతదేశం లో ప్రతి రోజూ 5 లక్షల కు పైగా పరీక్షల ను నిర్వహించడం జరుగుతున్నది.  రాబోయే వారాల లో, దీని ని ప్రతి రోజూ 10 లక్షల కు పెంచేందుకు మేము ప్రయత్నిస్తున్నాము.

మిత్రులారా,

కరోనా ప్రపంచవ్యాప్త వ్యాధి కాలం లో, ప్రతి ఒక్కరు ఒకే ఒక సంకల్పాన్ని కలిగివున్నారు.. అది ఏమిటంటే భారతదేశం లో ప్రతి ఒక్కరిని కాపాడాలి అన్నదే.  ఈ సంకల్పం భారతదేశం లో అద్భుతమైనటువంటి ఫలితాల ను ఇచ్చింది.   ప్రత్యేకించి పిపిఇ, మాస్కు లు మరియు టెస్ట్ కిట్ ల విషయం లో, భారతదేశం సాధించింది ఏమిటో చెప్పాలి అంటే అది ఒక చాలా పెద్ద విజయ గాథ అని చెప్పాలి.  ఒక దశ లో, భారతదేశం లో ఒక పిపిఇ కిట్ అయినా ఉత్పత్తి కాలేదు.  ఇవాళ, భారతదేశం ప్రపంచం లోకెల్లా రెండో అతి పెద్ద పిపిఇ కిట్ తయారీదారు దేశం గా ఉన్నది.

కేవలం 6 మాసాల క్రితం దేశం లో ఒక్కటంటే ఒక్కటైనా పిపిఇ కిట్ తయారీదారు సంస్థ అనేది లేదు.  ప్రస్తుతం 1200 కు పైగా తయారీదారు సంస్థ లు ప్రతి రోజూ 5 లక్షల పిపిఇ కిట్ ల ను ఉత్పత్తి చేస్తున్నాయి.  ఒక దశ లో, ఎన్-95 మాస్కులు విదేశాల నుండి భారతదేశానికి దిగుమతి అయ్యేువి.  ప్రస్తుతం భారతదేశం లో ప్రతి రోజూ 3 లక్షల కు పైగా ఎన్-95 మాస్కుల ను తయారు చేయడం జరుగుతున్నది.

వెంటిలేటర్ ల కోసం ఇతర దేశాల పైన భారతదేశం ఆధారపడిన కాలం అంటూ ఒకటి ఉండింది.  ప్రస్తుతం, భారతదేశం లో ప్రతి సంవత్సరం లో 3 లక్షల వెంటిలేటర్ లను ఉత్పత్తి చేసే విధం గా ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడం జరిగింది.  ఈ మధ్య కాలం లో,  మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ ల యొక్క ఉత్పత్తి ని కూడాను చాలా పెద్ద స్థాయి లో పెంచడమైంది.

ఈ యొక్క ఏకోన్ముఖ ప్రయాసల వల్ల, ప్రజల యొక్క ప్రాణాల ను కాపాడడం ఒక్కటే కాకుండా, మనం దిగుమతి చేసుకొంటూ వచ్చిన వస్తువులు దేశం నుండి ఎగుమతి అవుతున్నాయి 

మిత్రులారా,

అంత తక్కువ కాలం లో అంతటి భారీ మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పూర్తి చేయడం అనే కఠినమైనటువంటి సవాలు మన ముందుకు వచ్చి నిలచిన సంగతి ని మీరు ఎరుగుదురు.  మరొక పెద్ద సవాలు ఏది అంటే కరోనా తో పోరాడేందుకు దేశంలోని మానవ వనరుల ను సంసిద్ధుల ను చేయడమే అది.  మన చికిత్స సిబ్బంది, ఆశా కార్యకర్త లు, ఎఎన్ ఎమ్ లు, ఆంగన్ బాడీ లు, ఇంకా ఇతర హెల్థ్ వర్కర్ లు మరియు సివిల్ వర్కర్ లు ఇంతకు ముందు ఎన్నడూ జరగని స్థాయి లో శిక్షణ ను పొందడమైంది. 

ప్రస్తుతం, కరోనా తో భారతదేశం సాగిస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి ప్రపంచం దిగ్భ్రమ కు లోనైంది.  మరి ప్రపంచం యొక్క  భయం మరియు ఆందోళన దోషపూర్ణమని నిరూపణ అవుతున్నది.  మరి దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం మన సిపాయీలు కూడాను.

 మిత్రులారా,

కరోనా పై పోరు లో, మనం ఇవాళ ఏ స్థితి కి చేరుకొన్నామంటే, ఎక్కడైతే దీని విషయం లో మనకు జాగరూకత పరం గా ఎటువంటి లోటు లేదు, వైజ్ఞానిక సమాచారం, ఇంకా వనరులు సైతం విస్తరిస్తున్నాయి. 

ఇప్పుడిక మనం రాష్ట్రాల స్థాయి లోను, జిల్లా స్థాయి, బ్లాకు స్థాయి మరియు గ్రామ స్థాయిల లోను డిమాండు, సరఫరా ల నిర్వహణ వ్యవస్థ ను పటిష్టపరచవలసివున్నది.

మనం అందరమూ కలసి ఒక నవీనమైన ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను రూపొందించడమొక్కటే కాకుండా ప్రతి గ్రామం లో క్లినిక్ లను, ప్రభుత్వ మరియు ప్రైవేటు డిస్పెన్సరీల ను కూడా బలోపేతం చేసి, ఇంకా వాటి ని సమర్థం గా తీర్చిదిద్దవలసివున్నది.  మనం ఈ పనుల ను తప్పక చేయాలి, మరి అలా చేసినట్లయితే మన పల్లెల లో కరోనా తో పోరు అనేది బలహీనపడదు.  ఇప్పటివరకు,  ఈ రంగం లో పల్లెటూళ్లు ఎంతో చక్కటి పనితీరు ను కనబరచాయి.


మరి దీనితో, మన కరోనా యోధులు ఏ విధమైన అలసట కు లోనవకుండా చూసుకోవలసివుంది.  ఆరోగ్య వ్యవస్థ లోకి నూతన వృత్తినిపుణులను మరియు పదవీవిరమణ చేసిన వృత్తినిపుణులను తీసుకురావడం కోసం కూడాను ఎడతెగకుండా కృషి చేయవలసివుంది. 

మిత్రులారా,

సమీప భవిష్యత్తు లో బోలెడన్ని పండుగ లు వరుస కట్టి వస్తున్నాయి.  ఈ యొక్క వేడుకలు సంతోషాన్ని మరియు ఆనందాన్ని కొనితేనివ్వండి; అయితే మనం ప్రజల నడుమ న సంక్రమణ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గాను ప్రతి ఒక్క ముందుజాగ్రత్త ను తీసుకొని తీరాలి.  అలాగే, పండుగ సంబరాల వేళ పేద కుటుంబాల కు ఎటువంటి ఇక్కట్టు లు ఎదురవకుండా చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది.

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన యొక్క ప్రయోజనాలు ప్రతి ఒక్క పేద కుటుంబాని కి సరి అయిన కాలం లో తప్పక అందేటట్టు గా మనం చూడవవలసివున్నది.

మిత్రులారా,

మన దేశం లోని ప్రతిభాన్విత వైజ్ఞానికులు కరోనా కు టీకామందు ను తీసుకు రావడం కోసం శాయశక్తుల శ్రమిస్తున్నారు.  అయితే ఒక ప్రభావశీలమైనటువంటి ఔషధం గాని లేదా టీకామందు గాని కనుగొనబడనంత కాలం వరకు, మనం మాస్కుల ను అవశ్యం ధరించాలి, సామాజిక దూరాన్ని గాని లేదా ‘దో గజ్ దూరీ’ ని (ఒక మనిషి కి మరొక మనిషి కి నడుమ న ఎడం ను) పాటించాలి, ఇంకా చేతుల ను తరచుగా శుభ్రం చేసుకొంటూ ఉండాలి.  మనం మనలను, అలాగే ఇళ్ల లోని మన కుటుంబ సభ్యుల ను, యువకులను, ఇంకా వృద్ధులను కూడా కాపాడుకోవలసిందే.  

కరోనా పై పోరాటం లో మనమంతా కలసికట్టుగా పోరాడి విజయాన్ని సాధిస్తామని నేను నమ్ముతున్నాను.  మరొక్క మారు, ఈ యొక్క అత్యాధునిక సాంకేతిక సదుపాయాలకు గాను అనేకానేక అభినందన  లు. 

మీకు అనేకానేక ధన్యవాదములు.


https://youtu.be/axMHb2WBhJM


***



(Release ID: 1641988) Visitor Counter : 186