ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే దాదాపు 30 వేల కొవిడ్‌ రికవరీలు, 7.82 లక్షలు దాటిన మొత్తం రికవరీ కేసులు

Posted On: 23 JUL 2020 2:21PM by PIB Hyderabad

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య వరుసగా రెండోరోజూ గణనీయంగా పెరిగింది. గత 24 గంటల్లో అత్యధికంగా 29,557 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం రికవరీ కేసులు 7,82,606 కు చేరాయి. రికవరీ రేటు కూడా పెరిగి 63.18 శాతానికి చేరింది. కోలుకున్న వారి సంఖ్య పెరుగుదలతో.., రికవరీలు, యాక్టివ్‌ కేసుల మధ్య అంతరం పెరుగుతోంది. ప్రస్తుతం ఇది 3,56,439 గా ఉంది.

    కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొవిడ్‌-19 నిర్వహణ వ్యూహాలు దీనికి కారణంగా మారాయి. కేంద్రం, రాష్ట్రాల స్ధిరమైన ప్రయత్నాల కారణంగా సమర్ధవంత కంటైన్‌మెంట్లు, పరీక్షల్లో పెరుగుదల, సరైన చికిత్స వ్యూహాలు సాధ్యమయ్యాయి. సంయుక్త పర్యవేక్షణ బృందం (జేఎంజీ) వంటి.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని నిపుణుల బృందాలు ఈ ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేశాయి. దిల్లీ ఎయిమ్స్, వివిధ రాష్ట్రాలు/యూటీలలోని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీలోని సాంకేతిక నిపుణులు ఈ ప్రయత్నాలను పరిపూర్ణం చేశారు. కేంద్రం, నిపుణుల బృందాలను రాష్ట్రాలు, యూటీలకు పంపడం ద్వారా పరిస్థితిని పర్యవేక్షించింది. ఈ ప్రయత్నాల వల్ల మరణాల రేటు స్థిరంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఇది 2.41 శాతంగా ఉంది.

    వాస్తవ కేసు భారాన్ని తగ్గించడానికీ ఈ ప్రయత్నాలు దోహదపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,26,167 కు పరిమితమైంది.
 
    కొవిడ్‌-19కు సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు&సూచనలపై అధికారిక, తాజా సమాచారం కోసం https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను చూడవచ్చు.

    కొవిడ్‌-19పై సాంకేతిక సందేహాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు; ఇతర సందేహాలుంటే ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva కు పంపవచ్చు.

    కేంద్ర ఆరోగ్య&కుటుంబ సంక్షేమ శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91-1123978046 లేదా 1075 (ఉచితం) కి ఫోన్‌ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు. రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్‌ నంబర్ల జాబితాను https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లో చూడవచ్చు.   

***



(Release ID: 1640676) Visitor Counter : 193